తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday 6 August 2011

కళ్యాణి రాగం :: నా మనసు వినిపించే మౌనరాగం....



నా మనసు
వినిపించే
మౌనరాగం....
నీ హృదయాన్ని
స్పర్శించిందనడానికి...
నీ కళ్ళు పలికే 
పల్లవులే గుర్తు.









Thursday 4 August 2011

కసబ్ రంజాన్ ఉపవాసం ఉండడం లేదు...... ఇది ఒక వార్తా? (చర్చించండి)



కసబ్ రంజాన్ ఉపవాసం ఉండడం లేదు...... 

అసలు ఈ వార్త పత్రికలో ప్రచురణార్హమా? ఒక తీవ్రవాది... అది కూడా ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఒక మానవరూప రాక్షసుడి గురించి.....రాయడం ఎంతవరకు సబబు.
నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది పత్రిక.  కాని ఈరోజు ఏ పత్రిక చూసినా ఎవరో ఒకరికి చెంచాగిరి చేస్తూనే ఉన్నాయి. నిష్పాక్షికంగా మేము వార్తలను ప్రచురిస్తాము అని ప్రతి పేపర్ చెప్తూనే ఎవరోఒకరి పక్కనే అన్ని వార్తలు రాస్తున్నాయి. 

ఈ భావదారిద్ర్యం ఇంకా ఎన్నాళ్ళు. క్రైమ్‍స్టోరీస్ లేదా సెక్స్ స్కాండల్స్ గురించి రాస్తే పేపర్ సర్క్యులేషన్ పెరుగుతుందని వాటి బాటనే ఎక్కువ పత్రికలు రాస్తున్నాయి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాల్సిన అవసరం పత్రికల మీదా మీడియా మీద ఉంది. 

అదే కసబ్ గురించి, అతన్ని ఇంకా ఎందుకు ఉరి తీయడం లేదు అని ప్రతిరోజు రాయండి. దేశప్రజల మనోభావాల్ని కేంద్రప్రభుత్వానికి తెలిసేలా పత్రికా ప్రపంచం ప్రయత్నించాలి. అంతేగాని, అత్యాచారానికి గురైన వాళ్ళ ఫోటోలు, అడ్రస్ లతో సహా వివరంగా రాసి వారిని మరింత బాధపెట్టడం కాదు.

మనదేశ పార్లమెంటు మీద దాడి చేసిన ఒక తీవ్రవాదిని, మనదేశప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన నరరూపరాక్షసుడిని సకలభద్రతల మధ్య, రోజూ బిర్యానీలు పెట్టి మరీ పోషించి పెంచుతున్నా మనప్రభుత్వ దౌర్భాగ్యాన్ని ఏమనాలి. 

చట్టాల్ని సవరించాలి. తీవ్రకాలయాపన చేయకుండా దేశభద్రతకు ద్రోహం తలపెట్టే వారిని ప్రాసిక్యూట్ చేసి వారికి కఠినశిక్షలు విధించాలి.  అఫ్జల్‍గురు, కసబ్ లాంటి వారికి ఇన్ని రోజులు రాచమర్యాదలు చేయడం మనతప్పే. వారికి ఈ భూమి మీద జీవించే అవకాశమే లేదు. 

ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి, ప్రభుత్వంలో, ప్రజల్లో చైతన్యం వచ్చేలా పత్రికలు కృషి చేయాలి.

Wednesday 3 August 2011

చల్లని నీ కళ్ళలో కలలా నిలిచిఉన్నాను....


చల్లని నీ కళ్ళలో
కలలా నిలిచిఉన్నాను....
కన్నీటితో
నన్ను కరిగించివేయకు....

కనీసం అలా అయినా
నేను నీలో ఉన్నానని
నా మనసు సేద తీరుతుంది...

ఈ గుండె కొట్టుకుంటోందంటే...
దానికి కారణం నా యెదలోతుల్లో...
నువ్వు చేసే సవ్వడి.....
ఆ.. సవ్వడే నా గుండె చప్పుడై
నన్ను బ్రతికిస్తోంది.....