తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 13 March 2013

మనము ఎవ్వరికీ ఏమీ ఇవ్వనపుడు మనకు ఒకరినుండి ఆశించే హక్కు లేదు...


విసుగు, తప్పులు, కోపాలు అన్నీ పుట్టేది మన మనసులోనే. మనం మనస్పూర్తిగా నిజాయితీ గా ఉండగలిగితే అవేవి మన మీద ఆధిపత్యం చెలాయించలేవు. మన విసుగును మన సహనంతోనే పోగొట్టుకోవాలి. నిజాయితీ గా ఉండి మన అంతరాత్మ చెప్పినట్టు వింటే ఎలాంటి తప్పులు చెయ్యము. మనం మన స్వార్దాన్ని కొంచెం వీడి, మనకు చేతనయిన సహాయం ఇతరులకు చెయ్యగలిగితే అంతకు మించి మనం సాధించాల్సింది ఏమీ లేదు.

ఒక చిన్న సంఘటన చెబుతాను.

ఒక మనిషి రోడ్ మీద నడుస్తున్నాడు. నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. ఎదురుగా ఒక నల్లటి కుక్క కోరలు బయటకు సాచి కరవడానికి సిద్దంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. అతనికి భయంవేసి పరిగెత్తాలనిపించింది. కానీ అతనికి అనిపించింది. తనని అది ఎందుకు కరుస్తుంది. తను దానిని ఏమీ చెయ్యలేదు కదా.

మళ్ళీ అతనికే అనిపించింది.... తనని ఆ కుక్క ఎందుకు కరవకూడదు?...
తనెప్పుడైనా ఆ కుక్క కి ఏదైనా సాయం చేశాడా.  తను తినేది ఏమైనా దానికి పెట్టాడా? లేదే. దానికి ఏరోజూ ఎలాంటి ఉపకారము చెయ్యలేదు. కాబట్టి దానిని కరవొద్దు అనే హక్కు తనకి లేదు....
అతను ఇలా అలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు.
ఏమనుకుందో ఏమో ఆ కుక్క ... అతనికేసి ఒకలాగ చూసి...వెళ్ళిపోయింది..

మనము ఎవ్వరికీ ఏమీ ఇవ్వనపుడు మనకు ఒకరినుండి ఆశించే హక్కు లేదు...

ఎదుటివారు ఇలా ఉండాలి అని కోరుకుంటామే కాని, మనం అలా మంచిగా తాయారుకావడానికి ప్రయత్నించము.

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఏమైనా తప్పులుంటే చెప్పండి....

Tuesday, 26 February 2013

స్త్రీలో కేవలం శారీరక సుఖాన్ని


స్త్రీలో కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే
చూసిన వాడు పశువవుతాడు.
అదే స్త్రీలో అమ్మతనాన్ని చూడగలిగిన వాడు
మనిషవుతాడు.

శాంతి నిండిన భారతావని అవతరణ ఎప్పుడు?


తల్లీ! భారతమాతా!
ఎప్పుడమ్మా ఈ దేశంలో ప్రజలు
భయంలేకుండా స్వేచ్చగా తిరగగలిగేది?
ఎప్పుడు తల్లీ! చదువుకోసం, విధులకోసం
బయటకు వెళ్ళిన నీ అడబిడ్డలు క్షేమంగా
ఇల్లు చేరగలిగేది.
ఇల్లు దాటి బయటకు వెళ్ళిన
నీ బిడ్డలు, రోడ్డుప్రమాదాల బారిన గాని,
ఉగ్రవాద మారణహోమానికి గాని,
మాఫియా కబంధహస్తాల్లో గాని
రౌడీమూకల రాక్షసత్వానికి గాని
సైకోల పైశాచికత్వానికి గాని
బలికాకుండా క్షేమంగా ఇల్లు చేరగలిగేది..?
ఎప్పుడు తల్లీ ఈ దేశానికి నిజమైన
స్వాతంత్ర్యం వచ్చేది?
నీ బిడ్డలు స్వేచ్చగా, హాయిగా తిరగగలిగేది ఎప్పుడు?
శాంతి నిండిన భారతావని అవతరణ ఎప్పుడు?