తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Sunday, 5 July 2015

చరిత్రలో నేటి (July 5th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  5th   ) ప్రాముఖ్యత
1962: అల్జీరియా స్వాతంత్ర్యదినోత్సవం
1811: వెనెజులా స్వాతంత్ర్యదినోత్సవం(దక్షిణ అమెరికా లో మొదటిసారిగా స్వాతంత్ర్యం (స్పెయిన్ నుంచి) పొందిన దేశం).
1916 : భారతదేశ 7 వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జననం (మ.1994).
1927 : గొప్ప భావుకుడైన తెలుగు కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరియు రచయిత రావూరి భరద్వాజ జననం.
1947: భారతదేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే చట్టం బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది.
1954 : ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ను నెలకొల్పారు.
1975 : కేప్ వెర్డె స్వాతంత్ర్య దినోత్సవం (500 సంవత్సరాల పోర్చుగీస్ వలస పాలన తర్వాత)

1996: డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొర్రె నుంచి తీసిన జీవకణం ద్వారా పుట్టించారు.

Saturday, 4 July 2015

ఓ మహాత్మా, మాకోసం మీ ప్రాణత్యాగం చేసినా కూడా.. మిమ్మల్ని గుర్తుచేసుకోలేని ఈ బిజీ బిజీ సమాజాన్ని క్షమించండి.

www.onenandyala.com


(1902 July 4) స్వామి వివేకానంద మరణం

www.onenandyala.com



ఓ యోధుడా, నేతలు మిము మరిచినా... తెలుగు జాతి ఊపిరి ఉన్నంతవరకు మీ త్యాగం మా మనసుల్లో శాశ్వతం.... జోహార్...అల్లూరి సీతారామరాజు....

www.onenandyala.com ... says... జోహార్...అల్లూరి సీతారామరాజు..జోహార్


చరిత్రలో నేటి (July 4th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July 4th ) ప్రాముఖ్యత
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
టైక్వాండో దినోత్సవం.
1897: భారత స్వాతంత్ర్యసమరయోధుడు అల్లూరి సీతారామరాజు జననం (మ.1923).
1898: రెండుసార్లు భారతదేశ ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేసిన గుర్జారీలాల్ నందా జననం (మ.1998).
1902: ప్రసిద్ధి గాంచిన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద మరణం (జ.1863).
1933 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జననం.
1963: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మరణం (జ.1878).
1970: నక్సల్బరీ, శ్రీకాకుళము లలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో విరసం (విప్లవ రచయిత సంఘం) ఏర్పడింది

Friday, 3 July 2015

దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?

www.onenandyala.com 


చాలా దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేక ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి.  భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి మరియు ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.  పిల్లలు ఎత్తుగా ఉన్న గంటను పైకి ఎగిరి లేక ఎత్తుకోబడి మ్రోగించడానికి ఇష్టపడతారు.

మనము గంటను ఎందుకు మ్రోగిస్తాము?భగవంతుడిని నిద్ర లేపడానికా? కానీ దేవుడు ఎప్పుడూ నిద్రపోదు.
భగవంతునికి మనము వచ్చినట్లు తెలియచేయడానికా?   ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తెలుపవలసిన అవసరము లేదు.
ఆయన ప్రాంగణము లోనికి రావడానికి అనుమతి కొరకా? అది స్వంత ఇంటికి వస్తున్నట్లే గనుక రావడానికి అనుమతి తీసికొన అవసరము లేదు.  భగవంతుడు మనలని ఎల్లవేళలా ఆహ్వానిస్తుంటాడు.

మరి మనం గంటను ఎందుకు మ్రోగిస్తున్నట్లు?

గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దము మంగళకరమైన ధ్వనిగా పరిగణించ బడుతుంది.  ఇది విశ్వానికంతా భగవన్నామమయిన 'ఓంకార' నాదాన్ని ఉద్భవింపజేస్తుంది.  సదా శుభప్రదమైన భగవంతుని యొక్క దర్శనము పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట మ్రోగిస్తాం.
వైదిక క్రియా పరంగా 'హారతి' ఇచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము.  ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది.  మ్రోగే గంట, శంఖము మరియు ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి.  ఇది గంట మ్రోగించడము లోని అదనపు సంకేతము.

మనము చేసే నిత్య పూజ ఆరంభములో ఇలా చెపుతూ గంటను వాయిస్తాము.

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను.  దాని వలన సద్గుణ దైవీ పరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాలనుండి వైదొలగు గాక!

పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివిస్తే, వారు పెద్దయ్యాక తల్లి తండ్రులను వృద్దాశ్రమంలో ఉంచుతారా?

www.onenandyala.com

Whatsapp No.  9490883666

www.facebook.com/onenandyal

తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికితీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకుమీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలనిఅనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడాఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2వ తరగతిలోనేహాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడునెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదామేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలనిఅప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐనఈ విషయంఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడునెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక ఈటాపిక్ ఎప్పుడూమాట్లాడకు.