తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 30 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 4.... కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..


           కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..
కార్తీక్ ని అభినందించడానికి మాధవి, చందన ఇద్దరు వచ్చారు. "కంగ్రాట్స్ అన్నయ్యా! పార్టీ ఎప్పుడు" అడిగింది చందన.

          మీరెప్పుడంటే అప్పుడే.... చెప్పాడు కార్తీక్.  "కంగ్రాట్స్ అండి" ఎంతో అభిమానంతో చెప్పింది మాధవి.
తనే ఐ.ఎ.ఎస్. పాస్ అయినంత సంతోషంగా ఉందామెకు. అలా కాసేపు మాట్లాడుకున్నారు. 
మాట్లాడుకున్నంతసేపు ఒకరి వైపు ఒకరు ఎంతో ఆర్తిగా చూసుకుంటున్నారు.
కార్తీక్, మాధవి లు ఇద్దరూ ఒకరంటే ఒకరికి మనసులో ఉన్న  ప్రేమను  బయటపెట్టుకోలేక
తల్లడిల్లిపోతున్నారు. 

     రాత్రంతా తనతో గడిపిన హిమబిందువు సూర్యకిరణాల వేడికి కరిగి, తనను వీడలేక వేడే వేళ చిగురుటాకు పడే మనోవేదన వారిద్దరి హృదయాలను అవరించుకుని ఉంది.

          "సరే ఇంక వెళ్తా కార్తీక్ గారు" చెప్పింది మాధవి.

          సరేనండి ఒకింత బాధగా అన్నాడు కార్తీక్.

          చందన గేటు వరకు వెళ్ళి మాధవి ని సాగనంపి వచ్చి, అన్నయ్యా! నీకు, మధు కి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం అని నాకు తెలుసు. ఎవరికి ఎవరు చెప్పు కోవడం లేదు. తనకి నువ్వంటే చాల ఇష్టం. నీకు చెప్పలేక, ఒకవేళ చెప్తే దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే ఎలా అని నలిగిపోతోంది. నువ్వు మాధవి కి ప్రపోజ్ చెయ్యడం కంటే వాళ్ళనాన్న గారితో మాట్లాడు. తను వాళ్ళ అమ్మా, నాన్న మాటను కాదని ఏదీ చెయ్యదు అని చెప్పింది చందన.

          అదేమంచిది అనిపించింది కార్తీక్ కి కూడా.
         ఒకరోజు మాధవి వాళ్ళ ఇంటికి వచ్చాడు కార్తీక్. సమయానికి వాళ్ళ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు.


                                                                                                                                    ఇంకా వుంది......

ప్రేమ కూడా ఎంతో మధురంగా కనబడుతుంది.........ఇంత కర్కశంగా మనసుని చీలుస్తుందా అనిపించేటట్లు


ప్రేమ కూడా 
ఎంతో మధురంగా కనబడుతుంది.......
ఇంత కర్కశంగా 
మనసుని చీలుస్తుందా అనిపించేటట్లు......
ప్రేమ బారిన పడి... 
అది పెట్టే బాధ కు విలవిలలాడే వాళ్లకు తెలుస్తుంది....
ప్రేమ ఎంత కర్కశమైనదో.....


మంచు కూడా ఎంతో స్వచ్చంగా అమాయకంగా కనిపిస్తుంది...
కానీ మనిషినే తినేస్తుంది దానిలో చిక్కుకుంటే......
దానిపేరే ఫ్రాస్ట్‍బైట్....

Friday, 29 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 3


చందన అలోచనలు కొన్ని సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను తిరగేసాయి. 

అప్పుడు మాధవి, చందనలు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్.  కార్తీక్ ఐ.ఐ.టి. లో M.Tech. పూర్తిచేసి సివిల్స్ రాస్తున్నాడు. చందనకు కార్తీక్ అన్నయ్య వరుస అవుతాడు. 

         మాధవి పట్టు పరికిణీలో పదహారణాల స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి లా ఉండేది.  అందం, తెలివి, అణకువ,  పెద్దలంటే వినయ విధేయతలు కలబోసిన మధ్యతరగతి అమ్మాయి.

          కానీ కార్తీక్ కొన్ని వందల కోట్ల సంపదకు వారసుడు. మృదుస్వభావి. చక్కగా ఉంటాడు. కానీ అతనిలో తాను ధనవంతుడు అన్న భావన ఎక్కడా కనబడదు. సేవాభావం ఎక్కువ.  వీలైనంత ఎక్కువ మంది సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం అతనిది. ఒక ఆఫీసర్ గా ఎక్కువమంది సేవ చెయ్యవచ్చుననే  అలోచనతోనే అతను సివిల్స్ రాస్తున్నాడు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు.

          ఐ.ఐ.టి. లో చేరిన కొత్తలో చందన పుట్టినరోజు పార్టీలో మాధవిని చూశాడు.
చూడగానే తనని తాను మర్చిపోయాడు. "ఈ అమ్మాయి తన భార్య అయితే తనంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనిపించింది. మాధవి కు కూడా కార్తీక్ ని చూడగానే గుండె ఝల్లుమంది. చూడగానే అతని పట్ల అభిమానం ఏర్పడింది. ఒకరినొకరు మౌనంగా అభిమానంగా చూసుకునేవారు. ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఏర్పడింది.
కానీ ఎవ్వరూ బయటపడలేదు.  

          అలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. మాధవి ఇంజనీరింగ్ పూర్తికావచ్చింది.
కార్తీకి సివిల్స్ లో దేశం మొత్తానికి టాపర్ గా నిలిచి అత్యున్నత సర్వీస్ ఐ.ఎ.ఎస్. కి సెలెక్ట్ అయ్యాడు. 

                                                                                                   ఇంకా వుంది......

దుఃఖం.... భయం..... ఘర్షణ.... వీటన్నింటిని మించిన భయంకరమైన స్థితి.....


మనసును కష్టపెట్టే విషయం ఏదైనా జరిగితే, 
మనసుకి బాధ కలుగుతుంది. మనకి ఇష్టంలేని
విషయం ఏదైనా చెయ్యాల్సి వస్తే మనసులో ఘర్షణ కలుగుతుంది. 
భరించలేనంత దుఃఖం కలుగుతుంది. మనసూ దుఃఖిస్తుంది.

ఆనందం ... దుఃఖం.... భయం..... ఘర్షణ....
ఇవన్నీ మనసుకు సంబంధించిన రకరకాల స్థాయీ భావాలు.  

కానీ... వీటన్నింటిని మించిన భయంకరమైన స్థితి.....మరొకటి ఉన్నది......

అదే....... మనసులో నిశ్శబ్దం నిద్రపోవడం......మనసులో శూన్యం ఏర్పడడం.

ఏమీ తోచదు. బాధ వేస్తుంది. కానీ ఎందుకు బాధ పడుతున్నామో తెలియదు.
కోపంగా, విసుగ్గా, చిరాగ్గా మాత్రం ఉంటుంది.
ఎందుకు విసుక్కుంటున్నామో, ఎందుకు చిరాకు పడుతున్నామో, ఎందుకు కోప్పడుతున్నామో కూడా తెలియదు. మన సొంతవారి మీదనే కేకలేస్తుంటాము.  

పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ప్రియుడితో లేచిపోయి .....

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై నా అభిప్రాయం


బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ లో సుమలత తనకన్నా వయసులో పెద్దవారితో పాదనమస్కారం చేయించుకోవడం బాలేదు.  కుటుంబ సమస్యలతో బాధ పడే వారు చాలా మంది ఉన్నారు.  అత్తింట్లో ఆరళ్ళకు, భర్త పెట్టే బాధలకు తట్టుకోలేక నరకయాతన పడేవారు చాలామంది ఉన్నారు. అసలు నూటికి 90  శాతం మహిళలకు D.V. Act (Domestic Violence Act   గురించి కానీ,  498A section  గురించి కానీ తెలియదు. అటువంటి వారికి Law గురించి, Law లో మహిళలకు ఉన్న హక్కుల గురించి కొంత తెలియజేసే ప్రయత్నం అభినందించదగ్గదే.  సైకాలజిస్ట్, లాయర్, లాంటి నిపుణులతో కౌన్సిలింగ్ చేయించి పరిష్కారం సూచించటం కూడా బాగుంది.


 సంపన్నులను, మధ్యతరగతి వారిని వదిలేసి కేవలం  బీదవారిని మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి పిలుస్తున్నారేమో అనిపించినా ఈ మధ్య వచ్చిన కొన్ని ఎపిసోడ్స్ లో మధ్య తరగతి వారు కూడా ఉన్నారు.  సంపన్నులకు, కోట్ల కొలది డబ్బు ఉన్నవాళ్ళలో చాలామంది మన సంస్కృతి పై పెద్దగా పట్టింపులేదు.  న్యాయాన్నే కొనగలిగేంత స్తితిలో ఉన్నవాళ్ళకు ఈ ప్రోగ్రామ్ కి రావాల్సిన అవసరం లేదు. 


 ఎటొచ్చీ మధ్యతరగతి వారికి, పేదవారికి న్యాయసహాయం అవసరం. కానీ కొన్ని సన్నివేశాలను ఎడిట్ చెయ్యాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా వాళ్ళు చానల్ లో చూపించే సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ప్రియుడితో లేచిపోయి  ఒక నెల గడిపి మళ్ళీ తిరిగి భర్త దగ్గరకు వచ్చి నాపిల్లలు నా భర్త కావాలి అని వచ్చిన భార్య..... ఇలాంటి సమస్యలతో వచ్చేవారికి కౌన్సిలింగ్ చేసి అలాంటి వాటిని ప్రసారం చెయ్యకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.

Thursday, 28 April 2011

నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే..........


నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే
దాన్ని పట్టుకుని వాదించి గెలవడం,
అవతలి వారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవడం...
గొప్ప వాళ్ళ లక్షణం అయితే కావచ్చు....


కానీ...


అవతలి వాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు
 ప్రవర్తించడం మహోన్నతుల స్వభావం.

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై మీ కామెంట్...ప్లీజ్...


నేను సాధారణంగా టి.వి. లొ ఎటువంటి సీరియల్ చూడను. కానీ ఈ మధ్య మా ఆవిడ బలవంతం మీద  బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ చూస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఇంట్లోను, ప్రతి భార్యా భర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు సహజం.  సర్దుకుపోతేనే సంసారం బాగుటుంది.  భార్య, భర్త ఇద్దరు పట్టింపులకు, పంతాలకు పోతే వారి మధ్య దూరం పెరగడమే కాకుండా అది ఇంకా చాలా దూరం వెళ్తుంది.

గొడవలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  జీవితంలో ఒక్కోసారి రాజీ పడడం అనేది తప్పనిసరి. మరీ జీవితమే రాజీ అంటే కష్టమే.  చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఎలా పెద్దవై ఎంత దూరం వెళ్తున్నాయో, ఎంతమంది జీవితాలు నాశనమవుతున్నాయో మన కళ్ళెదురుగా ఆ ప్రోగ్రామ్ లో చూపెడుతున్నారు.  ఒక సైకాలజిస్ట్ ని, ఒక లాయర్ ని కూర్చోబెట్టి అందరికి అర్దమయ్యేలా వివరిస్తున్నారు.  చాలామంది జీవితాలు ఈ ప్రోగ్రామ్ వల్ల బాగుపడుతున్నాయి.
సుమలత గారిది చాలా మంచి ప్రయత్నం.  ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ చూడండి. అందరికి చూడమని చెప్పండి.
దీనివల్ల కొంతమేలు జరిగినా మంచిదే కదా. నా అభిప్రాయం చెప్పాను. మీ అభిప్రాయం చెప్పండి.

జి తెలుగు  వారి ప్రయత్నానికి హ్యాట్సాఫ్.......