తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 2 January 2013

కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఉపయోగం ఎంతవరకు?


కెమికల్ క్యాస్ట్రేషన్ వల్ల ఉపయోగం ఎంతవరకు?

అత్యాచారం చేసిన వారిని కెమికల్ క్యాస్ట్రేషన్ పద్దతి ద్వార శిక్షించాలి అని ఒక కొత్త వాదన బయల్దేరింది. కాని ఈ విధానం ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది సందేహాస్పాదం.  దీనివల్ల అత్యాచారం చేసిన వ్యక్తి నిర్వీర్యుడై ఒక రకమైన శాడిజానికి గురై సమాజానికి ప్రమాదకారిగా మారి కనిపించిన ఆడవాళ్ళనందరిని చంపే సైకో గా మారే అవకాశం ఉంది. కాబట్టి అత్యాచారం చేసిన వ్యక్తికి మరణదండనే సరైన శిక్ష. అది కూడా వీలైనంత త్వరగా అమలుజరగాలి. ఆడవాళ్లపై అత్యాచారాలకు పూనుకొనే ఆలోచన చేసే ప్రతి ఒక్కడికి భయం కలగాలి.
ఆ భయం కలిగితే గాని ఈ అత్యాచారాలు తగ్గే అవకాశం లేదు.

నా వాదనతో ఏకీభవిస్తారా...
మీ స్పందనను తప్పక తెలియజేయండి.....

3 comments:

  1. ఆ భయం ఏ విధంగా కలుగుతుందో కూడా చెప్పండి.

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజమే ,దాని వలన సైకో గా మారే ప్రమాదం కూడా లేకపోలేదు ,అది మరింత ప్రమాదకరం కూడా ,ఇకపోతే 10 లేక 30 సమ్వత్సరాలు శిక్ష అని కుడా అంతున్నారు ,హాయిగా జైలులో కూర్చుని పందుల్లా తారవచ్చు ,భయం కలగాలి ,ఇంకోసారి తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకూడదు, రోజూ కొంచ్చం కొంచెం గా చంపాలి ,అయితే ఇక్కడ మానవహక్కుల వాల్లకి అభ్యంతరం రావచ్చు ,దొక పనికిమాలిన సంఘం ఎం
    మాటలాడతారో వాల్లకే తెలియదు ,వ్యవస్త మారాలండీ

    ReplyDelete
  3. పద్మార్పితగారికి, రోహిణి గారికి, వారి స్పందనకు నా ధన్యవాదాలు.

    మొదట చట్టాలను మార్చాలి. ఎటువంటి పరిస్థితుల్లో చేసినా తప్పు తప్పే. పోయిన ప్రాణం తిరిగిరాదు. ఎవరైనా సరే వాళ్ళని కేవలం ఒక వారం లోపుగానే విషమిచ్చి చంపాలి. తను ఒకప్రాణం తీసేటపుడు, అవతలి వ్యక్తి ఎంత విలవిలలాడిందో, అంతటి నరకం వీళ్ళు కూడా అనుభవించాలి. ఇలాంటి పని చేసిన ప్రతి ఒక్కడిని ఇలాగే చేస్తే ఖచ్చితంగా భయం అనేది కలుగుతుంది. ఇక మానవహక్కుల సంగతంటార... బలైనవారికి మానవహక్కులు వర్తించవా అండి. వాళ్ళు కూడా మనలాంటి మానవులే కదా. వాళ్ళ హక్కుల్ని నాశనం చేసి, వాళ్ళ జీవితాల్ని నాశనం చేసినవాళ్ళకి మాత్రం మానవహక్కులు ఎలా వర్తిస్తాయండి.

    సంవత్సరాల తరబడి విచారణ చేస్తూ, మధ్యలో బెయిల్ మీద దర్జాగ తిరుగుతూ చివరికి వాడు కాలంతీరి చనిపోయాక శిక్ష వేస్తే ఏంటి వెయ్యకపోతే ఏంటి. నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి కేసుల విచారణ ఒక వారం లేక రెండు వారాల్లోనే ముగిసి నేరం చేసినవాడికి శిక్ష పడాలి. అప్పుడే వ్యవస్థలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.

    రాదంటారా?

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.