తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 2 May 2014

అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను...

చనిపోతున్న వ్యక్తి యొక్క భావాలను ఎవరో ఇలా వ్రాసారు. అమ్మా,... నేనొక పార్టీకి వెళ్ళాను... నువ్వు చెప్పిన మాటను గుర్తుంచుకున్నాను. నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను. నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది. నువ్వెప్పుడూ నామంచి కోరే చెప్తావు. నాకు తెలుసు. ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్చెయ్యొచ్చు” అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోవచ్చింది..త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్చేస్తున్నారు, నేనూ నా బండి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను. ఆరెండో కారు నన్ను గమనించలేదు “ఢాం”అని నన్ను డీకొట్టింది, పేవ్మెంట్ మీద నేను పడి ఉన్నాను. పోలీసులు వచ్చారు. ఆ రెండో డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు.. ఆంబులెన్స్ వచ్చింది. నేను కొద్దిసేపట్లో మరణిస్తాననివారన్నారు. అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను...చుట్టూ రక్తం.. నా రక్తం, అమ్మా, నేను త్రాగలేదు, తక్కిన వాళ్ళు త్రాగారు, వాళ్ళకు సరైన ఆలోచన లేదు, నువ్వు నాకు చెప్పినట్లుగా వాళ్ళకు ఎవ్వరూ హితం చెప్పలేదా? చెప్పి ఉండి ఉంటే నాకీ భయంకర అకాల మరణం తప్పేదిగా.. నేను భరించలేని నొప్పి, బాధ, యమయాతన అనుభవిస్తున్నాను. నన్ను కొట్టినవాడు ఊరికే నిలబడి చూస్తూ ఉన్నాడు.. నేను చచ్చిపోతూ ఉంటే అతడు నడుస్తున్నాడు... అమ్మా ఇదేమి న్యాయం? నాకు సమాధానం చెప్పమ్మా... నాకు భయం వేస్తోంది... నా ఊపిరి ఆగిపోతున్నది....నా కోసం నువ్వు ఏడవకమ్మా...... ...... దీనిని మీకు తెలిసినవారందరికీ పంచండి. మనుష్యులలో ఇది మార్పు తేవాలి. త్రాగేసి డ్రైవ్ చెయ్యకూడదనే ఇంగితజ్ఞానం అందరికీ రావాలి

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.