తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 15 April 2016

వేసవిలో జల్జీర పానీయం త్రాగడం చాలా అవసరం

వేసవిలో జల్జీర పానీయం త్రాగడం చాలా అవసరం
వేసవి సీజన్ లో జల్జీర త్రాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, జీర్ణక్రియ మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఈ పానీయం శరీరాన్ని చల్లగా ఉంచతుంది. శరీరంలో ఎక్సెస్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్స్ తగ్గిస్తుంది. వేసవి సీజన్ లో జల్జీర పానీయాన్ని త్రాగడం వల్ల వివిధ రకాల జీర్ణసమస్యలను నివారించుకోవచ్చు. ఈ శీతలపానియాన్ని తీసుకొన్నప్పుడు పొట్టలో టాక్సిన్స్ ను క్లియర్ చేస్తుంది. దాంతో పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీరా వాటర్ త్రగడం వల్ల కూడా వేసవి సీజన్ లో శరీరంను రిఫ్రెష్ చేస్తుంది మరియు శరీరంను చల్లగా ఉంచుతుంది. సమ్మర్ హీట్ ను బీట్ చేయాలంటే ఇలాంటి హెల్తీ డ్రింక్ త్రాగాల్సిందే... అదేవిధంగా ఈ వేసవి కాలంలో మరో ఆశ్చర్యం, మామిడిపండ్ల సీజన్ కాబట్టి, మామిడి కాయతో తయారుచేసిన జల్జీర ను తీసుకోవడం మరింత ఆరోగ్యకరం.
Health benifits
** జల్జీర వాటర్ త్రాగడం వల్ల పొట్ట ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను నయం చేస్తుంది. గ్యాస్ నివారించబడే వరకూ కొద్దిగా కొద్దిగా జీర వాటర్ త్రాగుతుండాలి.
** వేసవి వేడివల్ల ఒంట్లో నీరంతా చెమట రూపంలో బయటకు నెట్టివేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే జల్జీర వాటర్ ను రోజుకి రెండు మూడు సార్లు త్రాగాలి. దాంతో బాడీ హీట్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.
** బరువు తగ్గించడానికి : ఈ జీర వాటర్ ను రోజుకు రెండు సార్లు త్రాగితే ఆకలిని కంట్రోల్ చేస్తుంది, అందువల్ల తక్కవుగా తింటారు. దాంతో బరువు తగ్గించుకోవచ్చు.
**ఎసిడిటి తగ్గిస్తుంది:జల్జీర జీర్ణ సమస్యలకు చాలా మంచిది. మీరు ఎక్కువ భోజనం చేసినప్పుడు ఒక గ్లాసు జీర వాటర్ కొద్దిగా నిధానంగా తీసుకొంటే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఎసిడిటిని వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
** మలబద్దకం నివారిస్తుంది: జల్జీర త్రాగడం వల్ల మలబద్దకం నివారిస్తుంది. వేసవి కాలంలో మలబద్దకానికి గురిఅవుతుంటే జల్జీర వాటర్ ను రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.
జల్జీర పానీయం తయారీకై ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?t=14&v=YQ25fF8ETX4

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.