తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 23 May 2015

మాంగల్య ధారణ-తలంబ్రాలు - వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం...

www.onenandyala.com


మాంగల్య ధారణ-తలంబ్రాలు

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం. సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది. పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం. మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

Friday, 22 May 2015

నాతిచరామి ..... కన్యాదానం చేస్తూ అమ్మాయి తండ్రి అల్లుడితో ఇలా చెబుతాడు..

www.onenandyala.com                                www.onenandyala.com


నాతిచరామి


కన్యాదానం చేస్తూ అమ్మాయి తండ్రి అల్లుడితో ఇలా చెబుతాడు..

అష్టవర్షా~ భవత్కన్యా పుత్రవత్పాలితా మయా!
ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ!!

"నాయనా! ఎనిమిదేండ్లు నిండిన ఈ అమ్మాయిని, కొడుకును పెంచినట్లు  అల్లారుముద్దుగా పెంచాను.  ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను.  నీవీమెను స్నేహంతో చూసుకోవాలి.

ఇలా చెప్పి, "జీవితంలో మీరిద్దరు కలసి మెలసి ఎన్నో మధురానుభూతులను పొందాలి.  మంచి పనులను చేయాలి.  సిరిసంపదలననుభవించాలి. సత్సంతానాన్ని కనాలి. ధర్మార్ధకామమోక్షాలనే పురుషార్ధాలను సంపాదించుకోవడంలో ఈనాడు నీకు అర్ధాంగి అయిన నాకూతురును నిరాదరించకు. మోసం చేయకు.  అతిక్రమించి వెళ్ళకు.  అలా ఎన్నటికీ చెయ్యనని నాకు మాట ఇవ్వు! అని అంటాడు. దానికి సమాధానంగా, పెండ్లికొడుకు "ఈమెను అతిక్రమించనని మీకు మాట ఇస్తున్నాను" అంటాడు.  జీవితంలో వేసే ప్రతి అడుగులో నిజంగా ఆ మాటను గుర్తు పెట్టుకుని ప్రతివ్యక్తి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ దాంపత్యం ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. 

Wednesday, 20 May 2015

మే 20వ తేదీ పిచ్చుకల దినోత్సవం మరియు మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా...

www.onenandyala.com

నేడు అంతర్జాతీయ 'జీవవైవిధ్య దినోత్సవం'. మే నెల 20వ తేదీన 'పిచ్చుకల దినోత్సవం' కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో 'జీవవైవిధ్యం' గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం.  ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి.
తమ అమృతధ్వనులతో మనల్ని నిద్రలేపి, తిరిగి సాయంసంధ్యవేళకల్లా గూళ్ళకు చేరుకుని తమ కువకువనాదాలతో మనల్ని కుశలమా అని అడుగుతూ మన జీవితంలో భాగంగా  మారిపోయిన మన పిచ్చుక స్నేహితులు ఇప్పుడు ఎక్కడ?  టెక్నాలజీ పెరిగింది ... మనుషుల మధ్య అంతరాలు పెరిగాయి.. ఒకే ఇంట్లో ఉంటూ మొబైల్ లో మాట్లాడుకునే రోజులు వస్తున్నాయి.  సెల్ టవర్ల రేడియేషన్ ధాటికి మన పిచ్చుక స్నేహితులు మనకి దూరమైపోయాయి. చివరికి పిచ్చుక జాతే అంతరించిపోయే స్థితికి వచ్చింది. అంతరించిపోయే పక్షుల జాబితాలో పిచ్చుకలను కూడా చేర్చాల్సి వస్తోంది. 

జీవ వైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.  

ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.

విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


సృష్టిలో జీవరాశుల ఏకత్వం

ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్దతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగితా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవమనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాసులు అంతరించిపోతున్నాయి.


ప్రకృతి హితంగా భారతీయ ఆచారాలు
భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిది అని భావించి విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు. వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్చమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది.

భూ కాలుష్యం

రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్తనాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.
కాపాడుకొనే విధానం

మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
నేపధ్యం

·                 2013 - నీరు మరియు జీవ వైవిద్యం

·                 2012 - సముద్ర జీవ వైవిద్యం

·                 2011 - అటవీ జీవవైవిద్యం.

·                 2010 - జీవ వైవిద్యం, అభివృద్ధి మరియు పేదరికం నియంత్రణ

·                 2009 - బలమైన విదేశీ జాతులు (Invasive Alien Species)

·                 2008 - జీవ వైవిద్యం మరియు వ్యవసాయం.

·                 2007 - జీవ వైవిద్యం అంరియు వాతావరణ మార్పు

·                 2006 - డై లాండ్స్ లో జీవ వైవిద్యాన్ని రక్షించుట

·                 2005 - Biodiversity: Life Insurance for our Changing World

·                 2004 - Biodiversity: Food, Water and Health for All

·                 2003 - Biodiversity and poverty alleviation - challenges for sustainable development

·                 2002 - Dedicated to forest biodiversity

A.P. DSC 2015 ప్రాధమిక కీ

A.P. DSC 2015 ప్రాధమిక కీ కోసం  ఇక్కడ క్లిక్ చెయ్యండి

http://www.onenandyala.com/home2.html

Monday, 18 May 2015

తిరుమలలో ప్రతి మంగళవారం జరిగే అష్టదళ-పాదపద్మారాధన ఆర్జితసేవ వెనుక సంఘటన...

visit us at  ::     www.onenandyala.com

తిరుమలలో ప్రతి మంగళవారం జరిగే అష్టదళ-పాదపద్మారాధన ఆర్జితసేవ వెనుక సంఘటన...

అది 1982  టి టి దే సంస్థ స్వర్ణజయంతి కి తయారవబోతూంది 
షేక్ మస్తాన్ వలి  అనే ముస్లిం వ్యక్తి గుంటూరు జిల్లావాసి  స్వామి భక్తుడు  
స్వామికోవెలలో దర్శనమునకువెళ్లి అర్చకుల వద్ద తన వొక చిన్న కోరిక వెలిబుచ్చేడు 
 
అర్చకులు విబ్రమం చెంది కార్యనిర్వహణాధికారి వద్దకు పంపేరు 
వారు లోపల సభ్యులతో చాలా వ్యవహారములలో  నిమగ్నమయిన సమయం లో వొక ముస్లిం వ్యక్తి  వారిని కలవడానికి వచ్చేడ ని వర్తమానం వెళ్ళింది 
వారు అతడిని వెంటనే లోనికి రమ్మని మేము చాల పనిలో ఉన్నాము మీరు వచ్చిన పని వెంటనే తెలియచేయ్యవలసినది  అని చెప్పేరు. 

ఆ ముస్లిం వ్యక్తి ఇలా అన్నాడు... 
అయ్యా, నన్ను  లోనికి రానిచ్చినందుకు ధన్యవాదములు. 
నా పేరు షేక్ మస్తాన్  గుంటూరు జిల్లాలో వొక చిన్న గ్రామము లో చిన్నవ్యాపారస్థుడను  మా యింట్లో వారందరమూ  కొన్ని తరాలనుండీ స్వామి, భక్తులము మేము ఇంటిలో రోజూ  ఉదయాన్నే లేచి స్వామీ సుప్రభాతం నించీ మంగళా   శాసనము వరకూ అన్నీ చదువుతాము  నాకు వెంకటేశ్వర గద్యం కూడా తప్పులులేకుండా చదవడం వచ్చు 

మా తాత గారు కొన్ని దశాబ్దాలకిందట స్వామికి 108 బంగారు పుష్ప లని కైoకర్యం  చేసి వాటి తో అష్టోత్తర సేవ చేయించాలని కోరిక  ధనం లేకపోవడం వల్ల  యిన్నాళ్ళూ  ఆ సేవా భాగ్యం కలగ లేదు  యిప్పుడు అన్నీ సమకూరేయి  ఈ పుష్పాలని స్వీకరించి నన్ను ధన్యుడ ని చేసి మా పూర్వీకుల మొక్కు తీర్చండి అని కోరేడు 

ఆ సభ లో నిశ్శబ్దం తాండవించింది  కొన్ని లిప్తలపాటు. తరువాత ఆ కార్యనిర్వహణాధికారి తేరుకుని  అయ్యా! ముందు కూర్చోండి, మీ వంటి భక్తులు రావడం మాకు చాలా ఆనందం గా వున్నాది   కాకుంటే మీరు యిచ్చిన ఈ పుష్పాలని స్వీకరిస్తాము కాని మీరు చెప్పినట్టు అష్టోత్తర పూజకి కొన్ని ప్రతి బంధకాలున్నాయి మేమయినా వారి వద్ద సేవకులమే, వారు నిర్ణయించాలి  ఆయన అనుజ్ఞ అయితే కొద్ది రోజులలో మేము మీకోరిక తీరుస్తాము  అని వారికి అభయమిచ్చి సజల నయనాలతో పంపేసేరు.

1984 లో తి తి దే సంస్థ స్వర్ణ జయంతి ఉత్సవాల సమయం లో  ప్రతి మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన సేవ అనే ఆర్జిత సేవ ప్రారంభించి  ఆ ముస్లిం వ్యక్తి స్వర్ణ పుష్పాలతో పూజ మొదలెట్టేరు.

ఆ సాహెబ్ గారి పేరు సయ్యద్ మీరా అనే భక్తుడు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ వాసి.