visit us at :: www.onenandyala.com
తిరుమలలో ప్రతి మంగళవారం జరిగే అష్టదళ-పాదపద్మారాధన ఆర్జితసేవ వెనుక సంఘటన...
అది 1982 టి టి దే సంస్థ స్వర్ణజయంతి కి తయారవబోతూంది
షేక్ మస్తాన్ వలి అనే ముస్లిం వ్యక్తి గుంటూరు జిల్లావాసి స్వామి భక్తుడు
స్వామికోవెలలో దర్శనమునకువెళ్లి అర్చకుల వద్ద తన వొక చిన్న కోరిక వెలిబుచ్చేడు
అర్చకులు విబ్రమం చెంది కార్యనిర్వహణాధికారి వద్దకు పంపేరు
వారు లోపల సభ్యులతో చాలా వ్యవహారములలో నిమగ్నమయిన సమయం లో వొక ముస్లిం వ్యక్తి వారిని కలవడానికి వచ్చేడ ని వర్తమానం వెళ్ళింది
వారు అతడిని వెంటనే లోనికి రమ్మని మేము చాల పనిలో ఉన్నాము మీరు వచ్చిన పని వెంటనే తెలియచేయ్యవలసినది అని చెప్పేరు.

ఆ ముస్లిం వ్యక్తి ఇలా అన్నాడు...
అయ్యా, నన్ను లోనికి రానిచ్చినందుకు ధన్యవాదములు.
నా పేరు షేక్ మస్తాన్ గుంటూరు జిల్లాలో వొక చిన్న గ్రామము లో చిన్నవ్యాపారస్థుడను మా యింట్లో వారందరమూ కొన్ని తరాలనుండీ స్వామి, భక్తులము మేము ఇంటిలో రోజూ ఉదయాన్నే లేచి స్వామీ సుప్రభాతం నించీ మంగళా శాసనము వరకూ అన్నీ చదువుతాము నాకు వెంకటేశ్వర గద్యం కూడా తప్పులులేకుండా చదవడం వచ్చు
మా తాత గారు కొన్ని దశాబ్దాలకిందట స్వామికి 108 బంగారు పుష్ప లని కైoకర్యం చేసి వాటి తో అష్టోత్తర సేవ చేయించాలని కోరిక ధనం లేకపోవడం వల్ల యిన్నాళ్ళూ ఆ సేవా భాగ్యం కలగ లేదు యిప్పుడు అన్నీ సమకూరేయి ఈ పుష్పాలని స్వీకరించి నన్ను ధన్యుడ ని చేసి మా పూర్వీకుల మొక్కు తీర్చండి అని కోరేడు
ఆ సభ లో నిశ్శబ్దం తాండవించింది కొన్ని లిప్తలపాటు. తరువాత ఆ కార్యనిర్వహణాధికారి తేరుకుని అయ్యా! ముందు కూర్చోండి, మీ వంటి భక్తులు రావడం మాకు చాలా ఆనందం గా వున్నాది కాకుంటే మీరు యిచ్చిన ఈ పుష్పాలని స్వీకరిస్తాము కాని మీరు చెప్పినట్టు అష్టోత్తర పూజకి కొన్ని ప్రతి బంధకాలున్నాయి మేమయినా వారి వద్ద సేవకులమే, వారు నిర్ణయించాలి ఆయన అనుజ్ఞ అయితే కొద్ది రోజులలో మేము మీకోరిక తీరుస్తాము అని వారికి అభయమిచ్చి సజల నయనాలతో పంపేసేరు.
1984 లో తి తి దే సంస్థ స్వర్ణ జయంతి ఉత్సవాల సమయం లో ప్రతి మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన సేవ అనే ఆర్జిత సేవ ప్రారంభించి ఆ ముస్లిం వ్యక్తి స్వర్ణ పుష్పాలతో పూజ మొదలెట్టేరు.
ఆ సాహెబ్ గారి పేరు సయ్యద్ మీరా అనే భక్తుడు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ వాసి.
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.