తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 3 July 2015

చరిత్రలో నేటి (July 3rd ) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (July  3rd   ) ప్రాముఖ్యత
1350 : నామదేవుడి నిర్యాణం.
1918 : తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జననం. (మ.1974).
1914 : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు విశ్వనాథశర్మ జననం.
1924 : ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ జననం.(మ.1999)
1927 : తెలుగు రచయిత, బలివాడ కాంతారావు జననం (మ. 2000).
1928 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి జననం.(మ.1990)
1980 : భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జననం.

Thursday, 2 July 2015

దేవాలయపు వెనుకభాగాన్ని తాకరాదు?

www.onenandyala.com


"నువ్వు ఒక గొప్ప వ్యక్తివి" ... ఈ విషయం ఎప్పటికి మరవొద్దు......

www.onenandyala.com

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్నగదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు.
తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.
ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు.
సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ వెయ్యి
రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు.
మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు.
తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ వెయ్యి రూపాయలు నోటు బాగా మడతలు పడి,
మట్టి కొట్టుకుపోయింది.
మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు.
అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు.
ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు.
అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి
ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ
మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు..
జీవితం ప్రతి సారి మనకు ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది... జారవిడచిన
అవకాశాల కోసం చింతించక క్రొత్త ఆశలతో సరికొత్త ఊహలతో ముందడుగు వేయి...
వేయిరూపాయి నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. మన విలువ కూడా ఎప్పటికీ
తరగదు..
✳ "నువ్వు ఎప్పడు నీ విలువను
పోగొట్టుకోలేవు"✳
"నువ్వు ఒక గొప్ప వ్యక్తివి" ...
ఈ విషయం ఎప్పటికి మరవొద్దు........

తెలుగుగంగ ఉద్యోగి రక్తదానం.

www.onenandyala.com


చరిత్రలో నేటి (July 2nd ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  2nd  ) ప్రాముఖ్యత
·                 1843: హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం (జ.1755).
·                 1982 : ప్రముఖ విప్లవకవి చెరబండరాజు మరణం(జ.1944).
·                 1961 : అమెరికా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత మరియు పాత్రికేయుడు ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరణం(జ.1899).
·                 1995 : "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" , దూరవిద్య ప్రముఖుడు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి గడ్డం    రాంరెడ్డి మరణం(జ.1929).

·                 2002 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి మరణం(జ.1933).

Wednesday, 1 July 2015

ద్రౌపతి పతివ్రతా? నిజమా !?

www.onenandyala.com

 ద్రౌపతి పతివ్రతా? నిజమా !? సందేహమా.. ? 
ద్రౌపతి నిజంగా పతివ్రతే. అదెలాగండీ..ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ...అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ? ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. ద్రౌపతిగా జన్మించింది. ముందుగా ఒక చిన్న లెక్క. ఒక రూపాయికి వంద పైసలు.,పది పైసలు పది..,పావలాలు (ఇరవై ఐదు పైసలు) నాలుగు..,అర్థరూపాయిలు రెండు. అలాగే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే. ద్రౌపతి యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. ఇక ధర్మరాజాదులు కుంతి, మాద్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే. కానీ...అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. ఆ అసలు కథ ఏమిటంటే.. త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని’ ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. ‘మహేంద్రా.. ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది. కనుక తపస్సు చెయ్యి. అయితే.. బ్రహ్మహత్య దోషంతో ఉన్న నీకు, ప్రస్తుతం దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు. కనుక, నీ పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నీకు నమ్మకమైన మిత్రుల దగ్గర దాచివుంచి, ఒక ప్రాణశక్తిని నీదగ్గర ఉంచుకుని తపస్సు చేసి బ్రహ్మహత్యపాతక పరిహారం చేసుకో’ అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యమడు, వాయువు, అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు ప్రారింభించాడు. పాండురాజు భార్యలైన కుంతి, మాద్రులు... దూర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా..నకుల, సహదేవులు జన్మించారు. కనుక., పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ‘ఇంద్రుడు’. ఏ ఒక్కరు తగ్గినా.. పరిపూర్తి ఇంద్రుడు కాజాలడు. ఇక..ఇంద్రుడు బ్రహ్మహత్యపాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్త తిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞకుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో (ఒకే భర్త అయిన ఇంద్రునితో) ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ‘ద్రౌపతి’(శచీదేవి) కచ్చితంగా పతివ్రతే. సందేహం లేదు. ఆమె ‘పంచభరృక’ కాదు. సినిమా కథలు నమ్మకండి. పురాణాలు చదవండి. వాటినే నమ్మండి. ఈ కథ ‘మార్కండేయ పురాణంలో’ ఉంది.

చరిత్రలో నేటి (July 1st ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  1st ) ప్రాముఖ్యత
డాక్టర్స్ డే (వైద్యుల దినోత్సవం).
1882 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న గ్రహీత, స్వాతంత్ర్యసమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ జననం(మ.1962).
1929 : తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా జననం(మ.1989).
1938 : అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జననం.
1961: అంతరిక్షం లోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా జననం.
1962 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న గ్రహీత, స్వాతంత్ర్యసమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ మరణం(జ.1882).
1962  : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రత్న గ్రహీత పురుషోత్తమ దాస్ టాండన్ మరణం(జ.1882).
2006 : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు కొరటాల సత్యనారాయణ మరణం(జ.1923).
1930 : దార అప్పలనారాయణ, (మారు పేరు కుమ్మరి మాస్టారు ), ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారుడు జననం(మ.1997).

1966 : దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రముఖ తెలుగుకవి, మరణం(జ.1921).