అమ్మా...
నన్ను నేల మీద పడుకోబెట్టినపుడు
నా శరీరానికి స్నానం చేయించాల్సి వచ్చినపుడు...
నీ కన్నీటిని అందుకోసం వాడకు.
నన్ను తీసుకెళ్ళేటపుడు మాత్రం
ఓ రెండు కన్నీటి చుక్కలు అర్పించు.
బూడిదలోంచి నా అస్థికల్ని ఏరేటప్పుడు
నీ హృదయం ముక్కలు కాకుండా చూసుకో.
నీ వేళ్ళ సందుల్లోంచి జారే బూడిద
నేలపైని దుమ్ములో కలిసినా....
నా జ్ఞాపకం.......
నీ హృదయంలో శాశ్వతమని తెలుసు.
ఆ ఒక్క ఊహే...
నా అంతిమయాత్రకి కళ్యాణిరాగంగా మిగుల్తోంది...
ఢిల్లీ దారుణం లో బలైన నిర్భయ మృతి సందర్భంలో ఈ వాక్యాలు రాశాను.
మీ విలువైన స్పందనను, నిర్భయకు మీ నివాళి ని అందజేయండి.