తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Sunday, 31 May 2015

ఆశీర్వచనము మరియు కొన్ని ముఖ్య విషయాలు

నేడు ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం. (ప్రపంచ పొగాకు దినం) సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

www.onenandyala.com
నేడు ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం. (ప్రపంచ పొగాకు దినం) సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
ఫ్రెంచ్ దేశస్థుడైన జీన్ నికోట్ (ఈయన పేరు నుండి నికోటిన్ అనే పదం ఉత్పన్నమైంది) 1560వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో పొగాకును ప్రవేశపెట్టారు, అక్కడి నుండి అది ఇంగ్లాండ్ కు విస్తరించింది. మొట్టమొదట ధూమపానం చేసిన ఆంగ్లవ్యక్తిగా బ్రిస్టల్ లోని ఒక నావికుడు 1556లో, "అతని నాసికా రంధ్రాల నుండి పొగ వదులుతుండగా" గమనించబడ్డాడు.
పొగాకు ధూమపానం పద్ధతిలో పొగాకును మండించి దాని నుండి వచ్చే ఆవిరిని రుచి చూడటం లేదా పీల్చడం జరుగుతుంది. ఈ పద్ధతి క్రీస్తుపూర్వం 5000–3000 నుండే ప్రారంభమైంది. అనేక నాగరికతలలో మతపరమైన క్రతువులలో ధూపమును మండించేవారు, తరువాత కాలంలో ఇదే ఆనందానికి లేదా సాంఘిక పరికరంగా అనుసరించబడింది. పొగాకు ఉమ్మడి వ్యాపార మార్గాలను అనుసరించి పురాతన ప్రపంచంకు1500ల చివరిలో పరిచయమైంది. ఈ పదార్ధం తరచూ విమర్శలకు గురైంది, కానీ ప్రజాదరణ పొందింది. 1920ల చివరిలో జర్మన్ శాస్త్రవేత్తలు ధూమపానానికీ మరియు ఊపిరితిత్తుల కాన్సర్ కి మధ్య సంబంధాన్ని కనుగొని ఆధునిక చరిత్రలో మొదటి ధూమ-పాన వ్యతిరేక ప్రచారానికి దారితీసారు. అయితే ఈ పోరాటం రెండవ ప్రపంచయుద్ధ సమయంలో శత్రువుల సరిహద్దులు దాటడంలో విఫలమైంది, మరియు ఆ తరువాత ప్రజాదరణను కోల్పోయింది. 1950లో, ఆరోగ్య విభాగ అధికారులు మరలా ధూమపానానికి మరియు కాన్సర్ కి మధ్య సంబంధాన్ని సూచించడం ప్రారంభించారు. 1980లలో శాస్త్రీయమైన ఆధారాలు లభ్యమై, ఈ పద్ధతికి వ్యతిరేకంగా రాజకీయ చర్యలను ప్రేరేపించాయి. 1965 నుండి అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగ రేటు బాగా పెరిగింది లేదా తగ్గింది. అయితే, అభివృద్ధి చెందుతున్న ప్రప్రంచంలో దీని పెరుగుదల కొనసాగింది. 
పొగాకు వినియోగంలో ధూమపానం సర్వసాధారణమైన పద్ధతి, మరియు అత్యంత సాధారణంగా ధూమపానానికి వినియోగించబడే పదార్ధం పొగాకు. వ్యవసాయ ఉత్పత్తికి తరచూ కొన్ని పదార్ధాలు కలుపుతారు మరియు తరువాత వేడిచేయబడుతుంది. దాని నుండి వచ్చే ఆవిరి పీల్చబడి చురుకైన పదార్ధాలు వాయు గోళాల ద్వారా ఊపిరితిత్తులలోనికి గ్రహించబడతాయి. ఈ చురుకైన పదార్ధాలు నరాల చివర్లలో రసాయనిక ప్రతిస్పందనలను పెంచి గుండె వేగాన్ని, జ్ఞాపకశక్తి, చురుకుదనం మరియు ప్రతిస్పందన సమయాలను పెంచుతాయి. డోపమిన్ మరియు ఎండార్ఫిన్లు విడుదలై, తరచూ ఆనందానికి కారణమవుతాయి. 2000 నాటికి, 1.22 బిలియన్ల మంది ప్రజలచే ధూమపానం చేయబడుతోంది. స్త్రీల కంటే పురుషులలో ధూమపానం ఎక్కువగా ఉంటోంది, అయితే యుక్త వయస్కులలో ఈ లింగభేదం ఎక్కువగా లేదు. ధనికుల కంటే బీదవారు, అభివృద్ధి చెందిన దేశాల ప్రజల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ధూమపానం ఎక్కువగా చేస్తున్నారు.
• చాలా మంది ధూమపానం కౌమార దశ లేదా ప్రారంభ పరిణతదశలో ప్రారంభిస్తారు. సాధారణంగా ప్రారంభ దశలో, ధూమపానం ఆనందకరమైన సంచలనాలను కలిగించి, అనుకూల పునర్బలనం యొక్క మూలంగా ఉంటుంది. ఒక వ్యక్తి అనేక సంవత్సరాలపాటు ధూమపానం చేసిన తరువాత మానివేయుటకు వ్యతిరేకత చూపే లక్షణాలు మరియు ప్రతికూల పునర్బలనం కొనసాగించడానికి ప్రేరణగా ఉంటాయి.

ప్రారంభ వినియోగం
ధూమపానం యొక్క చరిత్ర క్రీస్తుపూర్వం 5000–3000లో ఈ వ్యవసాయ ఉత్పత్తి దక్షిణ అమెరికాలో సాగు చేయబడుతున్న కాలానికి చెందింది;మొక్క యొక్క పదార్ధాన్ని కాల్చి వినియోగించడం అనే ప్రక్రియ యాదృచ్చికంగా లేదా ఇతర వినియోగ అవసరాల కోసం అన్వేషిస్తున్నపుడు వృద్ధి చెందింది. ఈ పద్ధతి మంత్ర క్రతువులలో ప్రారంభమైంది. బాబిలోనియన్లు, భారతీయలు మరియు చైనీయులు వంటి అనేక పురాతన నాగరికతలకు చెందినవారు మతపరమైన క్రతువులలో ధూపమును మండించే వారు, ఇజ్రాయిలీలు మరియు కేథోలిక్ మరియు సాంప్రదాయ క్రిస్టియన్ చర్చ్ లలో కూడా ఈ విధంగానే చేసేవారు. అమెరికాలో ధూమపాన మూలాలు మంత్ర క్రియలలో ధూపం వేయడం నుండి వచ్చి ఉండవచ్చు కానీ తరువాత ఆనందం కొరకు సాంఘిక పరికరంగా అనుసరించబడింది. పొగాకు యొక్క ధూమపానం మరియు అనేక ఇతర భ్రమ కలిగించే మాదక ద్రవ్యాలు మైమరుపును కలిగించి ఆత్మ సంబంధ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి వాడారు.
తూర్పు ఉత్తర అమెరికా తెగల ప్రజలు సంచులలో పెద్ద మొత్తంలో పొగాకును తీసుకు వెళ్లి వర్తకానికి అంగీకరించబడే వస్తువుగా వాడేవారు ఇంకా తరచూ గొట్టముల ద్వారా పీల్చేవారు, నిర్దేశింపబడిన ఆచార సంబంధ కార్యక్రమాలలో, మరియు ఏదైనా బేరాన్ని కుదుర్చుకునేటపుడు, మరియు బాల్యావస్థతో సహా, జీవితంలోని అన్ని సందర్భాలలో ధూమపానం చేసేవారు. పొగాకు సృష్టికర్త యొక్క కానుకగా మరియు వదిలిన పొగాకు నుండి వెలువడే పొగ ధూమపానం చేసిన వారి ఆలోచనలు మరియు ప్రార్ధనలను స్వర్గానికి చేరుస్తుందని నమ్మేవారు. 
ధూమపానంతో పాటు, పొగాకు ఔషధంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక బాధానివారిణిగా అది చెవి నొప్పి మరియు పంటి నొప్పులలో మరియు అప్పుడప్పుడు పిండికట్టులలో ఉపయోగపడుతుంది. ఎడారి భారతీయులచే ధూమపానం జలుబును స్వస్థపరచేదిగా చెప్పబడింది, ప్రత్యేకించి ఎడారి ఋషి, సాల్వియా డొర్రీ యొక్క ఆకులతో పొగాకును కలిపినపుడు, లేదా భారతీయ సాంబ్రాణి వేరు లేదా దగ్గు వేరు లేప్టోటేనియ మల్టిఫిడ యొక్క ఆకులతో కలిపినపుడు అది ప్రత్యేకించి ఆస్త్మా మరియు క్షయలో బాగా పనిచేస్తుంది.

.. పూర్తి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.... www.onenandyala.com

చరిత్రలో నేటి (May 31st) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (May  31stప్రాముఖ్యత

నేడు ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం. (ప్రపంచ పొగాకు దినం)
526  : టర్కీ లో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.
1725 : మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జననం.
1911 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మారిస్ అలైస్ జననం (మ.2010).
1930 : సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ జననం.
1942 : తెలుగు సినిమా నటుడు, దర్శకుడు,నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు సూపర్‌స్టార్ కృష్ణ జననం.

1964 : స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ మరణం.

Saturday, 30 May 2015

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం

www.onenandyala.com

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక --  పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు. స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

చరిత్రలో నేటి (May 30th) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (May  30th) ప్రాముఖ్యత

1921: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కంచనపల్లి పెదవెంకటరామారావు జననం.
1987 : గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం.
1962 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీ లో ప్రారంభమయ్యాయి.
2007 : ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం.(జ.1927)
2008 : కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.

Friday, 29 May 2015

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- కాశీ యాత్ర

www.onenandyala.com

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- కాశీ యాత్ర

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

మిత్రులారా సీల్డ్ నోట్లకట్టల్లోంచి డబ్బు.. ఇలా తీస్తున్నారు.... తస్మాత్ జాగ్రత్త

www.onenandyala.com

Friends watch this cheating


తల్లిదండ్రులూ.... పిల్లల విషయంలో ... మరింత జాగ్రత్త...వహించండి.

www.onenandyala.com

Watch This video.


Thursday, 28 May 2015

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- ముహూర్త నిశ్చయం, "స్నాతకం"

www.onenandyala.com

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- ముహూర్త నిశ్చయం, "స్నాతకం"

ముహూర్త నిశ్చయం
వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు. నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.
"స్నాతకం"

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. "సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ. స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.

Wednesday, 27 May 2015

అది చూసి, అమ్మ మొహం మీది నవ్వు మాయమైంది. ఆ చిన్న వయసులో తన కూతురి స్వార్థం చూసి, ఆ తల్లి మనసు గాయపడింది.

www.onenandyala.com


ఒక చిన్న పాప తన రెండు చేతులలో రెండు ఆపిల్సు పట్టుకుని
ఉంది.
.
.
అది చూసిన ఆ పాప అమ్మ,, నవ్వుతూ "నాకు కూడా ఒక ఆపిల్
ఇవ్వు తల్లీ....!!!" అని గారాభం గా అడిగింది.
.
.
అది విన్న ఆ పాప, వెంటనే ఒక ఆపిల్ ను కొరికి ఎంగిలి చేసింది. రెండో
ఆపిల్ ఇస్తుందనుకొనేలా, ఆ పాప రెండవ ఆపిల్ ను కూడా ఎంగిలి
చేసింది.
.
.
అది చూసి, అమ్మ మొహం మీది నవ్వు మాయమైంది. ఆ చిన్న
వయసులో తన కూతురి స్వార్థం చూసి, ఆ తల్లి మనసు
గాయపడింది. మారు మాడ్లాడక, అక్కడ నుండి పోబోయింది.
.
అంతలో, ఆ పాప ఒక చేయి ముందుకు చాచి "అమ్మా..! ఈ ఆపిల్
తీయగా ఉంది. ఇది తీసకో" అంది......
.
.
.
జీవితం లో కూడా మనలో చాలా మంది, ఎదుటి వారి భావనలను అర్థం
చేసుకోక, తొందరపాటు నిర్ణయాలు తీస్కుంటాం...!! మంచి
స్నేహితులను, సంభంధాలను కోల్పోతాం....!

డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో వున్నాడు..... మీకు కొంచెం కూడా బాద్యత లేదా?"

www.onenandyala.com


సర్జరీ కోసం ......ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్, హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని, తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు
అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు..
డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో వున్నాడు..... మీకు కొంచెం కూడా బాద్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను.... బయట వున్నాను ..... ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే, నేను నాకు సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.................. మరి ఇప్పుడు మీరు స్తిమిత పడి శాంతిస్తె ..... నేను సర్జరీకి వెళతా".
తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొదుక్కే ఇలా జరిగివుంటే, నువ్వు శాంతంగా ఉండగలవా?"
డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "నేను మన పవిత్ర వేదగ్రందాలలో వున్నది ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.... 'మనం మట్టి నుండే వచ్చాం ...మట్టిలోకే వెళ్ళిపోతాం... అది అంతా ఆ భగవంతుని మాయాలీలలు' ....... డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవత కాలాన్ని పోదిగించలేరు.. వెళ్లి మీరు నీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి........ నేను చెయ్యవలసింది చేసి ...మేము ప్రయత్నిస్తాము".
తండ్రి కోపంతో రగిలిపోతూ "మనది కానప్పుడు ... సలహాలు ఇవ్వటం చాలా తేలికే" గొణుకుంటున్నాడు
డాక్టర్ కొన్ని గంటల తరువాత .... వచ్చి తండ్రితో "భగవంతునికి ధన్యవాదాలు... మీ కొడుకు ఇప్పుడు క్షేమమే" .. "మేరు ఎమన్నా అడగ్గాలని అనుకుంటే నర్స్ ని అడగండి" అని..... తండ్రి నుంచి సమాధానంకోసం ఆగ కుండా బయటకు వెళ్ళిపోయాడు ....
తండ్రి:"ఈ డాక్టర్ ఎందుకు అంత కఠినాత్ముదు........కొన్ని నిముషాలు ఆగివుంటే నేను నా కొడుకు గురించి అడిగివుందేవాడిని కదా"
అంటూ కామెంట్ చేస్తున్నాడు .......... అక్కడనే వున్న నర్స్ అది చూసి డాక్టర్ వెళ్ళిన కొన్ని నిముషాల తరువాత ...
నర్స్ కన్నీళ్ళతో "ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు. మేము ఆయనకి సర్జరీ కోసం, ఫోన్ చేసినప్పుడు ... స్మశానం దగ్గర వున్నారు.. మద్యలో వచ్చి ఆయన మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి .... మళ్ళా స్మశానానికే వెళ్లారు".

Tuesday, 26 May 2015

అత్యంత మధురమైన బంధం భార్యాభర్తల అనుబంధం...

www.onenandyala.com 


పరస్పర ప్రేమానుబంధం

భర్తకు భార్య చరణదాసి అయితే, భార్యకు భర్త అనురాగ సేవకుడు. మేలిమి క్షీరంలా భర్త క్షేమం కోసం, అతని శ్రేయస్సు కోసం భార్య నిరంతరమూ తపిస్తుంది. అతని సన్నిధిలోనే తనకు సకలమూ అని తలపోస్తుంది. భర్త కూడా తన అనురాగ దేవత అయిన భార్యను ఎలా ఆనందపెట్టాలి, ఏ విధంగా తమ జీవితాన్ని నిత్యమూ నవ్యమైన రీతిలో ఎలా గడపాలి అన్న విషయంలో నిరంతరమూ పరితపిస్తూ ఉంటాడు. ఉద్యోగబాధ్యతలు కావచ్చు, వ్యాపార నిర్వహణ కావచ్చు. ఎంత దూరాన ఉన్నా, అతని యోచన, ఆలోచన తన అర్ధాంగి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. తాను మైళ్ల దూరంలో ఉంటే కనీసం భోజనమన్నా చేసిందో లేదో అని ఆందోళన పడుతూనే ఉంటాడు.

దాదాపు పాతికేళ్లు వచ్చేవరకు ఒకరికొకరు తెలియకపోయినా దాంపత్య బంధంతో ఒక్కటయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటిగా ఉండటమే సృష్టిలోని చిత్రమైన బంధం. విచిత్రమైన అందం. ప్రకృతి, పురుషుడు వేరువేరు కాదు. ఇద్దరూ కలిస్తేనే ఈ చరామయ జగత్తు. అదే విధంగా దాంపత్య బంధంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న ప్రశ్నే లేదు. ఇద్దరూ సమపాళ్లలో సంసారరథాన్ని లాగే చక్రాలే. ఆ చక్రాలకున్న ఇరుసే వీరి అనుబంధంలోని ఔన్నత్యం. అవగాహనలోని పరిణతిని చాటే తత్వం. మనం అధిదేవతలుగా నిత్యమూ కొలిచే దైవాలనే ఉదాహరణలుగా తీసుకుంటే దాంపత్య బంధంలో వారి అరమరికలు లేని మహిమాన్విత తత్వం వెల్లడవుతుంది. శివపార్వతులొక్కటిగా దర్శనమిచ్చే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిబింబాలు. ఇక, విష్ణుమూర్తి తన హృదయసీమ మీదే తన అర్ధాంగి మహాలక్ష్మిని కొలువుంచుకుని పరవశిస్తూ ఉంటాడు.సర్దుకుపోతేనే సుఖసాగరం
భార్యాభర్తల బంధం కలకాలం నిలిచి ఉండాలంటే ఒకరిమీద ఒకరికి అవగాహన, గౌరవం ఉండాలి. నా మాటే నెగ్గాలి అన్న పంతాలు, పట్టింపులు ఉండకూడదు. భర్త ఏదన్నా విషయం చెబితే వెంటనే నచ్చకపోయినా, అందులోని భావాన్ని భార్య గ్రహించాలి. అలాగే, భార్య ఏదన్నా విషయం చెబితే, తనకు హితవుగా లేకపోయినా, అందులోని ఆంతర్యాన్ని గ్రహించి భర్త సర్దుకుపోవాలి. అన్ని విషయాల్లోనూ ఇద్దరికీ ఒకే విధమైన అభిప్రాయాలు ఉండాలన్న నిబంధనేమీ లేదు. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా! అదే విధంగా మన ఇంట్లో జరిగే విషయాలు కావచ్చు, బంధువర్గానికీ, మిత్రబృందానికీ సంబంధించిన విషయాలు కావచ్చు.

భాగస్వాముల్లో ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండాలనేదే లేదు. అటువంటి సమయాల్లోనే కాస్త పట్టూ, విడుపు ధోరణి అవలంబిస్తే ఈ విశాలమైన వసుధలో ఉన్న సుధ అంతా వారిరువురిదే! ఆలూమగల మధ్య అప్పుడప్పుడు పొడసూపే భేదాభిప్రాయాలు అద్దం మీద ఆవగింజలాంటివి. అంటే ఎక్కువకాలం ఆ తేడా వాళ్ల మధ్య నిలవదనేది భావం. అలాగే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే నేటి రోజుల్లో ఆర్థికపరమైన విషయాల్లో మరింత పరిణతి అవసరం. నీ డబ్బు, నా డబ్బు అని అస్తమానం బేరీజు వేసుకుంటే ఇద్దరికీ మిగిలేది అశాంతి, కరువయ్యేది అమూల్యమైన మనఃశాంతి!ఇద్దరూ సమానులే
అదే విధంగా, పండగలకీ, శుభకార్యాలకీ వెళ్లేటప్పుడు సాధారణంగా భేదాలు పొడసూపుతూ ఉంటాయి ఆలుమగల మధ్య అకారణ భేదాలు. ఒకరికి విలువైనదిగా, వెళ్లక తప్పనిదిగా అనిపించే కార్యం మరొకరికి అనవసరమైనదిగా అనిపించవచ్చు. అంతమాత్రాన, జీవిత భాగస్వామిపై ఆ భావాన్ని రుద్దడం సమంజసం కాదు. తాను రావడం కుదరదనేది మృదువుగా చెప్పి, అవతలివాళ్లు నొచ్చుకోకుండా ఆ శుభకార్యానికి పంపించాలి. విజ్ఞత, తెలివితేటలు భార్యభర్తల్లో ఏ ఒక్కరికో సొంతం కాదు. ఒక్కొక్కసారి భర్త సరియైన నిర్ణయం తీసుకోవచ్చు. మరొకసారి భార్య తీసుకునే నిర్ణయమే ప్రయోజనకారి కావచ్చు. 

అందుకే జీవితాన్ని కలిసి పంచుకునే భాగస్వాములు కలివిడిగా ఉండాలిగానీ విడివిడిగా ఉండటం సబబు కాదు. దంపతుల్లో ఏ ఒక్కరూ తమ భాగస్వామిలోని లోపాలను ఎవ్వరి ముందూ ప్రకటించకూడదు. చివరికి సొంత అన్నదమ్ములైనా, అప్పచెల్లెళ్లయినా మూడో వ్యక్తులే కాబట్టి, వారి ముందూ వ్యతిరేకంగా ఏమీ అనకూడదు. అది రెండోవారి హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. తమ భాగస్వామిలోని సుగుణాలను మాత్రం వీలున్నంతగా నలుగురి ముందూ ప్రస్తావించాలి. అది హితకరం, సంసారసౌధానికి బలాన్ని పెంచే మూలధనం. అది ఎదుటివారి హృదయసీమకు మలయసమీరంలా సోకుతుంది. సంసారంలో ఆనందం అర్ణవమవుతుంది.అరమరికలు లేని భార్యాభర్తల బంధం ఈ ధరిత్రికి మనోహరమైన అందం! అది అద్వితీయమైన అనుబంధం! భువనమనే కమనీయ వనంలో ఎన్నటికీ వసివాడని సుమ సుగంధం! 

Monday, 25 May 2015

హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- నిశ్చితార్థం, ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి

www.onenandyala.com          https://www.facebook.com/onenandyalనిశ్చితార్థం

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.
ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి క���తురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

Sunday, 24 May 2015

www.onenandyala.com          https://www.facebook.com/onenandyal


హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- (1)


"వివాహం"

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.
పెళ్ళి చూపులు
పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.

Saturday, 23 May 2015

మాంగల్య ధారణ-తలంబ్రాలు - వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం...

www.onenandyala.com


మాంగల్య ధారణ-తలంబ్రాలు

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం. సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది. పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం. మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు. కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

Friday, 22 May 2015

నాతిచరామి ..... కన్యాదానం చేస్తూ అమ్మాయి తండ్రి అల్లుడితో ఇలా చెబుతాడు..

www.onenandyala.com                                www.onenandyala.com


నాతిచరామి


కన్యాదానం చేస్తూ అమ్మాయి తండ్రి అల్లుడితో ఇలా చెబుతాడు..

అష్టవర్షా~ భవత్కన్యా పుత్రవత్పాలితా మయా!
ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ!!

"నాయనా! ఎనిమిదేండ్లు నిండిన ఈ అమ్మాయిని, కొడుకును పెంచినట్లు  అల్లారుముద్దుగా పెంచాను.  ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను.  నీవీమెను స్నేహంతో చూసుకోవాలి.

ఇలా చెప్పి, "జీవితంలో మీరిద్దరు కలసి మెలసి ఎన్నో మధురానుభూతులను పొందాలి.  మంచి పనులను చేయాలి.  సిరిసంపదలననుభవించాలి. సత్సంతానాన్ని కనాలి. ధర్మార్ధకామమోక్షాలనే పురుషార్ధాలను సంపాదించుకోవడంలో ఈనాడు నీకు అర్ధాంగి అయిన నాకూతురును నిరాదరించకు. మోసం చేయకు.  అతిక్రమించి వెళ్ళకు.  అలా ఎన్నటికీ చెయ్యనని నాకు మాట ఇవ్వు! అని అంటాడు. దానికి సమాధానంగా, పెండ్లికొడుకు "ఈమెను అతిక్రమించనని మీకు మాట ఇస్తున్నాను" అంటాడు.  జీవితంలో వేసే ప్రతి అడుగులో నిజంగా ఆ మాటను గుర్తు పెట్టుకుని ప్రతివ్యక్తి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ దాంపత్యం ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. 

Wednesday, 20 May 2015

మే 20వ తేదీ పిచ్చుకల దినోత్సవం మరియు మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా...

www.onenandyala.com

నేడు అంతర్జాతీయ 'జీవవైవిధ్య దినోత్సవం'. మే నెల 20వ తేదీన 'పిచ్చుకల దినోత్సవం' కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో 'జీవవైవిధ్యం' గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం.  ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి.
తమ అమృతధ్వనులతో మనల్ని నిద్రలేపి, తిరిగి సాయంసంధ్యవేళకల్లా గూళ్ళకు చేరుకుని తమ కువకువనాదాలతో మనల్ని కుశలమా అని అడుగుతూ మన జీవితంలో భాగంగా  మారిపోయిన మన పిచ్చుక స్నేహితులు ఇప్పుడు ఎక్కడ?  టెక్నాలజీ పెరిగింది ... మనుషుల మధ్య అంతరాలు పెరిగాయి.. ఒకే ఇంట్లో ఉంటూ మొబైల్ లో మాట్లాడుకునే రోజులు వస్తున్నాయి.  సెల్ టవర్ల రేడియేషన్ ధాటికి మన పిచ్చుక స్నేహితులు మనకి దూరమైపోయాయి. చివరికి పిచ్చుక జాతే అంతరించిపోయే స్థితికి వచ్చింది. అంతరించిపోయే పక్షుల జాబితాలో పిచ్చుకలను కూడా చేర్చాల్సి వస్తోంది. 

జీవ వైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.  

ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.

విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు(గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగాను ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం,అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


సృష్టిలో జీవరాశుల ఏకత్వం

ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్దతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగితా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవమనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాసులు అంతరించిపోతున్నాయి.


ప్రకృతి హితంగా భారతీయ ఆచారాలు
భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిది అని భావించి విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు. వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్చమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది.

భూ కాలుష్యం

రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్తనాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.
కాపాడుకొనే విధానం

మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
నేపధ్యం

·                 2013 - నీరు మరియు జీవ వైవిద్యం

·                 2012 - సముద్ర జీవ వైవిద్యం

·                 2011 - అటవీ జీవవైవిద్యం.

·                 2010 - జీవ వైవిద్యం, అభివృద్ధి మరియు పేదరికం నియంత్రణ

·                 2009 - బలమైన విదేశీ జాతులు (Invasive Alien Species)

·                 2008 - జీవ వైవిద్యం మరియు వ్యవసాయం.

·                 2007 - జీవ వైవిద్యం అంరియు వాతావరణ మార్పు

·                 2006 - డై లాండ్స్ లో జీవ వైవిద్యాన్ని రక్షించుట

·                 2005 - Biodiversity: Life Insurance for our Changing World

·                 2004 - Biodiversity: Food, Water and Health for All

·                 2003 - Biodiversity and poverty alleviation - challenges for sustainable development

·                 2002 - Dedicated to forest biodiversity