తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday 27 May 2015

అది చూసి, అమ్మ మొహం మీది నవ్వు మాయమైంది. ఆ చిన్న వయసులో తన కూతురి స్వార్థం చూసి, ఆ తల్లి మనసు గాయపడింది.

www.onenandyala.com


ఒక చిన్న పాప తన రెండు చేతులలో రెండు ఆపిల్సు పట్టుకుని
ఉంది.
.
.
అది చూసిన ఆ పాప అమ్మ,, నవ్వుతూ "నాకు కూడా ఒక ఆపిల్
ఇవ్వు తల్లీ....!!!" అని గారాభం గా అడిగింది.
.
.
అది విన్న ఆ పాప, వెంటనే ఒక ఆపిల్ ను కొరికి ఎంగిలి చేసింది. రెండో
ఆపిల్ ఇస్తుందనుకొనేలా, ఆ పాప రెండవ ఆపిల్ ను కూడా ఎంగిలి
చేసింది.
.
.
అది చూసి, అమ్మ మొహం మీది నవ్వు మాయమైంది. ఆ చిన్న
వయసులో తన కూతురి స్వార్థం చూసి, ఆ తల్లి మనసు
గాయపడింది. మారు మాడ్లాడక, అక్కడ నుండి పోబోయింది.
.
అంతలో, ఆ పాప ఒక చేయి ముందుకు చాచి "అమ్మా..! ఈ ఆపిల్
తీయగా ఉంది. ఇది తీసకో" అంది......
.
.
.
జీవితం లో కూడా మనలో చాలా మంది, ఎదుటి వారి భావనలను అర్థం
చేసుకోక, తొందరపాటు నిర్ణయాలు తీస్కుంటాం...!! మంచి
స్నేహితులను, సంభంధాలను కోల్పోతాం....!

2 comments:

  1. తొందరపాటును గూర్చి చక్కగా వివరించిన ఈ పొట్టి కథ బాగుంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ. మీ వంటి పెద్దల దీవెనలు మాతో ఉంటే అదే మాకు మహాభాగ్యం.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.