"భూవో ఘ్రాణన్వయ సంది " అంటే నాశిక పై బాగం, భ్రుకుటి మధ్యబాగం కలుసుకునే చోట కుంకుమను ధరించాలి అని అర్ధం . ఇక్కడ ఇడ, పింగళ, సుషమ్నఅనే మూడు నాడులు కలుస్తాయి . దీనినే " త్రివేణీ సంగమం " అని కూడా అంటారు. ఇది వియూష గ్రంధికి అనుబంధ స్థానం . ఇదే జ్ఞానగంధి. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులుగా భాసిల్లుతారనేది నిరూపించబడింది కదా ! మనం ధరించే బొట్టు ప్రభావం "పిట్యూటరీ గ్లాండ్" పై ఉంటుంది. "కేనన్" అనే ప్రఖ్యాత పాశ్చాత్య శాస్త్రవేత్త బృకుటి స్థానాన్ని మానవ ధన (+), మెడ వెనుక బాగాన్ని రుణ (-) విద్యుత్త్ కేంద్రాలు అని అన్నారు . ఇవి రెండు మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణను చేస్తూ ఉంటాయి . బృకుటి వద్ద ఉన్న నాడులు చాలా సున్నితం గా ఉంటాయి . అందుకే తేప , జ్వరం వంటివి వచ్చినప్పుడు పెద్దలు , వైద్యులు కూడా చల్లని బట్టను వేయమని చెపుతారు. పైన పేర్కొన్న సున్నిత మైన, కీలకమైన నాడులను సూర్యకిరణాల తాకిడి, వేడిమి , వత్తిడి నుండి రక్షించుకోడానికి తప్పని సరిగా బొట్టును ధరించాలి. సాయంకాలం , రాత్రి సమయాలలో విభూతిని ధరించాలి. విభూధిని ధరించడం వలన చల్లగా ఉండి, రక్తప్రసరణ చక్కగా జరిగి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తేజస్సు వృద్ది చెందడమే కాకుండా, చర్మ రోగాలను కూడా అంటకుండా కాపాడుతుంది. కుంకుమ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను పీల్చుకుని, జథర, శ్వాశ, కేశములకు తగినంత ఉష్ణోగ్రతను అందిస్తూ ఉంటుంది.
మనం నేరుగా సూర్యుణ్ణి చూడలేము కదా? రంగుల కళ్ళద్దాలు ద్వారా కాని , ఏదైనా రంగుల గాజు ద్వారా కాని చూడడం సాధ్యం అవుతుంది . ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దం పై పడి తిరిగి పరావర్తనం చెందడం వలన కళ్ళకు ఏ విధమైన హానీ జరుగదు. అదే విధముగా బొట్టును ధరించడం వలన బృకుటి వద్ద ఉన్న జ్ఞాన నేత్రం పై సూర్యుని కిరణాలు తాకి పరావర్తనం చెందడం జరుగుతుంది. జ్ఞాన నాడికి ఏ విధమైన హనీ కలుగదు. పూర్వకాలం లో ప్రకృతి నుండి లభించే వస్తువులతో స్వయం గా కుంకుమను తయారు చేసుకుని ధరించి ఆరోగ్యం గా ఉండేవారు. కాని ఇప్పుడు కొన్ని రసాయనాల కలియికతో తయారౌతున్న స్టిక్కర్లను ధరించడం వలన ఆడవారు ఎన్నో చర్మవ్యాధులకు గురై అసలు బొట్టునే ధరించే వీలు లేకుండా పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి .
బొట్టు ధరించినవారు అందరూ మేధావులే అయితే మరి మన పూర్వీకులంతా మేధావులై ఉండాలనో, లేక మేధావులైన వారందరూ బొట్టునే ధరించారా అనో , మన హిందూసంప్రదాయం లోనే ఈ కుంకుమ ధరించే పద్దతి ఉంది , మిగిలిన ముస్లిం , క్రిస్టియన్ , సిక్కు వంటి మతాలలో లేదు కదా ? మరి వారిలో మేధావులు లేరా అంటే నేను చెప్పలేను కాని, బొట్టు ధరించడం వలన ఇటువంటి ఆరోగ్య పరమైన విషయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించదు మనకు ఈ కుంకుమను ధరించే సంప్రదాయం. కాని మన హిందూ సంప్రదాయంలో పెద్దలు ఇంత నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలను ఏ పరిజ్ఞానంతో కనిపెట్టగాలిగారో ఏ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాని ఆ రోజుల్లో అనే విష్యం మాత్రం ఇప్పటికీ అచ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది కదా ?..హృదయ పూర్వక ధన్యవాదములతో..................