తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 27 August 2015

సర్పనాగబంధం గురించి మీకు తెలుసా..!?

www.onenandyala.com
సర్పనాగబంధం గురించి మీకు తెలుసా..!?


వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం ఇది.

“అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో…” కశ్యపునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్ఠ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు. తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు.

హారంగా, పడకగా…
ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి.

తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం, ఈవ్‌లను దేవుడు ఈడెను తోట నుంచి బహిస్కరించి వారిని అందుకు పురికొల్పిన సాతాను సర్పాన్ని… నీవు నీ పొట్టపై పాకుతూ, మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులగుదురు గాక! నీవు వారి కాలిపై కాటు వేస్తావు, వారు నీ తలపై గాయపరుస్తారు అని ఆజ్ఞాపించారు.

సర్పం-సప్త ప్రతీకలు
ప్రాచీన కాలం నుంచి సర్పం (సర్పెంట్) సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.
1. దేవునిగా- తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.
2. తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు ‘కెకూలే’ ఈ చిహ్నాన్ని కల గని ‘బెంజిన్’ అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని చెబుతారు.
3. పునరుజ్జీవనానికి, పునర్ యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతిపాత్రమై, సర్పం వైద్యరంగానికి చిహ్నమైంది.
4. గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం.
5. జ్ఞానానికి
6. సైతానుకు కూడా సర్పాలే గుర్తు.

తొలి మానవుల పతనం
ఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కాననైట్లకు, మధ్యధరా ప్రాంతం వారికి, ఉగ్రాయిట్లు, సుమేరియన్లకు సర్పాలు సరప్ (మంట పుట్టించేవి), నాహాస్, పెటెన్, బెటెన్, నాగులుగా సుపరిచితమే. గిల్గామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవనీ లతను సర్పం అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పని సరి చేస్తుంది. ఉదంకుని దగ్గరి కుండలాలపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణ భూతుడవుతాడు.

జ్ఞాన ఫలాన్ని ఈవ్, ఆదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈజిప్షియన్లకు నాగ దేవతలున్నారు. యురియస్ సర్పం రక్షణకు, ఎపెప్ కీడుకు, ఎనెప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్‌లు ఎక్కువ. నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండగ. ఓహియో దేశంలో ప్రసిద్ధి కెక్కిన మహా సర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది. దీని పొడవు అరకిలోమీటరు.

మహారాజయోగం
జూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. మార్క్ ఏంటోని క్లియోపాత్రను ముద్దుగా ‘ద సర్పెంట్ ఆఫ్ ఓ ల్డ్ నైల్’ నైలు నదీ సర్పంగా పిలిచేవారట. క్లియో పాత్ర మరణించేప్పుడు ‘ఏస్ప్’ సర్పాలను పెదాలకు, హృదయంపై కాటు వేయించు కొని నిశ్శబ్దంగా నిష్క్రమించడం మనకు తెలుసు. మొదలయిన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు. సర్ప బంధ కవిత్వం మనకు తెలుసు.

సర్పజాతులు
ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు ఇంద్రధనుస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కలలోకి రావడం శృంగారానికి, కామేచ్ఛకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు. సంవత్సరానికి లక్షమందిని మృతుల్ని చేసే విష జాతి సర్పాలు 600 ఉంటే, మొత్తం 3,000 రకాల పాముల ఉన్నాయని ఒక అంచనా అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగ్‌కోర్ రాజ వంశీకులు తాము బ్రహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను, శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే. అందుకే భగవానుడిలా వాక్రుచ్చినాడు.
“సర్పాణా మస్మి వాసుకిః అనంత శ్చాస్మి నాగానాం…”

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు...

www.onenandyala.com

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు...


ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

* గాయత్రి మంత్రాక్షరాలు

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

Wednesday, 19 August 2015

చరిత్రలో నేటి (August 19th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (August  19th ప్రాముఖ్యత
ప్రపంచ మానవత్వపు దినము (ప్రపంచ వ్యాప్తంగా)
ప్రపంచ ఫోటో దినము
0014 : ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణం (జ.63 బి.సి). ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
1918 : భారత స్వాతంత్ర్య సమరయోథుడు, పండితుడు మరియు భారత 9 వ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ జననం (మ.1999).
1919 : ఆఫ్ఘనిస్తాన్ పూర్వ బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం పొందినది.
1987 : తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.

1991 : సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. సెలవులో ఉన్న సోవియెట్ ప్రెసిడెంట్ మిఖయిల్ గోర్బచెవ్ను గృహ నిర్బంధంలో ఉంచారు.

Tuesday, 18 August 2015

అంధుల పాఠశాలలో విద్యార్ధులకు మంచాలకు నవార్లు, క్రికెట్‌బాట్లు, ఫలహారాలు ..

 15.8.2015 న నంద్యాలలోని అంధుల పాఠశాలలో విద్యార్ధులకు మంచాలకు నవార్లు, క్రికెట్‌బాట్లు, ఫలహారాలు అందజేయడం జరిగింది.





Friday, 7 August 2015

చరిత్రలో నేటి (August 7th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (August  7th ప్రాముఖ్యత
1890 : గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు, 'గ్రంధాలయ పితామహుడు'గా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జననం (మ.1979).
1907: స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం (మ.1997).
1925: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ జననం.
1941: భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మరణం (జ.1861).

1960: ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యదినోత్సవము.

Thursday, 6 August 2015

చరిత్రలో నేటి (August 6th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (August  6th ప్రాముఖ్యత
1881 : నోబెల్ బహుమతి గ్రహీత, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం.(మ.1955).
1925 : తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించిన సురేంద్రనాథ్ బెనర్జీ మరణం.(జ.1848).
1934 : తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌ జననం (మ.2011).
1945 : రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికా , జపాను లోని హిరోషిమా నగరం మీద అణుబాంబు ప్రయోగించింది. “హిరోషిమా రోజు (Hiroshima Day" గా పాటిస్తారు.

1991 : వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇంటర్‌నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి సర్ టిమ్ బెర్నెర్స్ లీ.