తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday, 10 July 2018

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..



ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే... చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కాని పటాలు కానీ ఏ దేవాలయం చెట్టు క్రిందో ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు.
కానీ ఇలా చేయడంకన్నా ఉత్తమమైన మార్గం ఏంటంటే అటువంటి పటాలను అగ్నికి
ఆహుతి ఇవ్వడం మంచిది. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా
ఎక్కడైనా ? అన్న సందేహం ఎంత మాత్రం అవసరం లేదు.
అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా
నీరు కలుషితం కాదు.
అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో
వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్పూర్తిగా నమస్కరించి
గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.
ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ సమాచారం
ఇవ్వండి. ధర్మ ఆచరణ చేయండి.ధర్మాన్ని కాపాడండి.

Wednesday, 4 July 2018

సృష్టి రహస్య విశేషాలు


1 సృష్టి ఎలా ఏర్పడ్డది
.
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
.
3 మనిషిలో ఎన్ని తత్వంలున్నాయి
.
( సృష్ఠి ) ఆవిర్బావము
.
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాదం
4 నాదం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృద్వీ.
పృద్వీ యందు ఓషధులు
17 ఓషదుల వలన అన్నం
18 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.
.
( సృష్ఠి ) కాల చక్రం
.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వాచ్చరు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి .
1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్ఫంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పంలకు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.
.
సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది
.
దేవతలు జీవులలో చేట్లు అన్ని వర్గలలో మూడే గుణములు ఉంటాయి
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
( పంచ భూతంలు అవిర్బావాం )
,
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
.
5 ఙ్ఞానింద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
.
1 ( ఆకాశ పంచికరణంలు )
.
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( ఙ్ఞాణం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచికరణంలు )
.
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
3 ( అగ్ని పంచికరణములు )
.
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.
4 ( జలం పంచికరణంలు )
.
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.
5 ( భూమి పంచికరణంలు )
.
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.
.
( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు
.
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
.
5 ( పంచ తన్మాత్రలు )
.
1 చేవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
.
5 ( పంచ ప్రాణంలు )
,
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
.
5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )
,
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 ఙ్ఞాణం
5 ఆహంకారం
.
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
.
6 ( అరిషడ్వర్గంలు )
,
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం
.
3 ( శరీరంలు )
,
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
.
3 ( అవస్తలు )
,
1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త
.
6 ( షడ్బావ వికారంలు )
,
1 ఉండుట
2 పుట్టుట
3 పేరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
.
6 ( షడ్ముర్ములు )
,
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం
.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
,
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
.
3 ( జీవి త్రయంలు )
,
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు
.
3 ( కర్మత్రయంలు )
,
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
.
5 ( కర్మలు )
,
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
.
3 ( గుణంలు )
,
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
9 ( చతుష్ఠయములు )
,
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
.
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
.
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
.
14 మంది ( అవస్థ దేవతలు )
,
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రఙ్ఞాడు
14 ఈశానుడు
.
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
,
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
,
10 ( వాయువులు )
,
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా
.
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
.
7 ( షట్ చక్రంలు )
,
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
.
( మనిషి ప్రమాణంలు )
,
96 అంగళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 మురల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం
.
( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7
,
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
.
అధోలోకలు 7
.
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
.
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
,
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చేమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షిర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
.
( పంచాగ్నులు )
,
1 కాలగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభీలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
.
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
,
1 జంబు ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుప
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో
.
10 ( నాధంలు )
,
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం
#ఓం #శివోహం

Tuesday, 3 July 2018

కుంకుమను ధరించే సంప్రదాయం లో నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలు

 పూర్వకాలంలో మగ, ఆడ తేడా లేకుండా నుదుటి పై కుంకుమను ధరించాలి అని పెద్దలు చెప్పేవారు . అది ఎందుకో నేను చదివిన కొన్ని విషయాలను మీకు తెలిచేస్తున్నాన్ను ప్రియ నేస్తాలు ..మీకు తెలిసిన విషయాలను కూడా మీ స్పందనల ద్వారా తెలియచేస్తే మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాసం ఉంది కదా ? 


 "భూవో ఘ్రాణన్వయ సంది " అంటే నాశిక పై బాగం, భ్రుకుటి మధ్యబాగం కలుసుకునే చోట కుంకుమను ధరించాలి అని అర్ధం . ఇక్కడ ఇడ, పింగళ, సుషమ్నఅనే మూడు నాడులు కలుస్తాయి . దీనినే " త్రివేణీ సంగమం " అని కూడా అంటారు. ఇది వియూష గ్రంధికి అనుబంధ స్థానం . ఇదే జ్ఞానగంధి. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులుగా భాసిల్లుతారనేది నిరూపించబడింది కదా ! మనం ధరించే బొట్టు ప్రభావం "పిట్యూటరీ గ్లాండ్" పై ఉంటుంది. "కేనన్" అనే ప్రఖ్యాత పాశ్చాత్య శాస్త్రవేత్త బృకుటి స్థానాన్ని మానవ ధన (+), మెడ వెనుక బాగాన్ని రుణ (-) విద్యుత్త్ కేంద్రాలు అని అన్నారు . ఇవి రెండు మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణను చేస్తూ ఉంటాయి . బృకుటి వద్ద ఉన్న నాడులు చాలా సున్నితం గా ఉంటాయి . అందుకే తేప , జ్వరం వంటివి వచ్చినప్పుడు పెద్దలు , వైద్యులు కూడా చల్లని బట్టను వేయమని చెపుతారు. పైన పేర్కొన్న సున్నిత మైన, కీలకమైన నాడులను సూర్యకిరణాల తాకిడి, వేడిమి , వత్తిడి నుండి రక్షించుకోడానికి తప్పని సరిగా బొట్టును ధరించాలి. సాయంకాలం , రాత్రి సమయాలలో విభూతిని ధరించాలి. విభూధిని ధరించడం వలన చల్లగా ఉండి, రక్తప్రసరణ చక్కగా జరిగి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తేజస్సు వృద్ది చెందడమే కాకుండా, చర్మ రోగాలను కూడా అంటకుండా కాపాడుతుంది. కుంకుమ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను పీల్చుకుని, జథర, శ్వాశ, కేశములకు తగినంత ఉష్ణోగ్రతను అందిస్తూ ఉంటుంది. 

 మనం నేరుగా సూర్యుణ్ణి చూడలేము కదా? రంగుల కళ్ళద్దాలు ద్వారా కాని , ఏదైనా రంగుల గాజు ద్వారా కాని చూడడం సాధ్యం అవుతుంది . ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దం పై పడి తిరిగి పరావర్తనం చెందడం వలన కళ్ళకు ఏ విధమైన హానీ జరుగదు. అదే విధముగా బొట్టును ధరించడం వలన బృకుటి వద్ద ఉన్న జ్ఞాన నేత్రం పై సూర్యుని కిరణాలు తాకి పరావర్తనం చెందడం జరుగుతుంది. జ్ఞాన నాడికి ఏ విధమైన హనీ కలుగదు. పూర్వకాలం లో ప్రకృతి నుండి లభించే వస్తువులతో స్వయం గా కుంకుమను తయారు చేసుకుని ధరించి ఆరోగ్యం గా ఉండేవారు. కాని ఇప్పుడు కొన్ని రసాయనాల కలియికతో తయారౌతున్న స్టిక్కర్లను ధరించడం వలన ఆడవారు ఎన్నో చర్మవ్యాధులకు గురై అసలు బొట్టునే ధరించే వీలు లేకుండా పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి . 

 బొట్టు ధరించినవారు అందరూ మేధావులే అయితే మరి మన పూర్వీకులంతా మేధావులై ఉండాలనో, లేక మేధావులైన వారందరూ బొట్టునే ధరించారా అనో , మన హిందూసంప్రదాయం లోనే ఈ కుంకుమ ధరించే పద్దతి ఉంది , మిగిలిన ముస్లిం , క్రిస్టియన్ , సిక్కు వంటి మతాలలో లేదు కదా ? మరి వారిలో మేధావులు లేరా అంటే నేను చెప్పలేను కాని, బొట్టు ధరించడం వలన ఇటువంటి ఆరోగ్య పరమైన విషయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించదు మనకు ఈ కుంకుమను ధరించే సంప్రదాయం. కాని మన హిందూ సంప్రదాయంలో పెద్దలు ఇంత నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలను ఏ పరిజ్ఞానంతో కనిపెట్టగాలిగారో ఏ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాని ఆ రోజుల్లో అనే విష్యం మాత్రం ఇప్పటికీ అచ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది కదా ?..హృదయ పూర్వక ధన్యవాదములతో..................

Saturday, 30 June 2018

మీరు కూడా మీ చిన్నప్పుడు మీ వేసవి సెలవులు ఇలాగే గడిపారా?..


నా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళేవాళ్ళం. నాకు చాలా బాగా గుర్తు. మిద్దె మీద పడుకునే వాళ్ళం. మా ఇంటి చుట్టూ జామచెట్లు, కొబ్బరిచెట్లు, ఇంటి ముందర బాగా అల్లుకున్న సన్నజాజి తీగె ఉండేవి. ఉదయాన్నే నిద్ర లేచేసరికి, పక్షుల కిలకిలా రావాల తో చల్లగా వీచే గాలి లో విరిసీ విరియని సన్నజాజుల పరిమళాలు ఏవో మధురలోకాలలోకి తీసుకెళ్ళేవి. పొద్దున గ్లాసుడు పాలు తాగి, ఇడ్లీ నో, చద్దన్నమో తిని తాతయ్య తో పాటు తోటకు వెళ్ళే వాళ్ళం. అక్కడ మామిడిచెట్లకు ఉయ్యాలలు కట్టుకుని ఊగి ఆడుకుని, మామిడిపళ్ళు, తాటిముంజెలు తిని వచ్చేసేవాళ్ళం. నందివర్దనం చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వేళ కి పక్షులన్నీ గూటికి చేరుకునేవి. సరిగ్గా అదే సమయానికి మా ఊరి సినిమా హాల్ లో "నమో వెంకటేశా, నమో తిరుమలేశా" అనే పాట రికార్డ్ వేసేవాళ్ళు. ఆ సాయం సంధ్య వేళ పిచ్చుకల కిలకిలలు, పావురాళ్ళ కువకువలు, దూరంగా గుడిలో నుండి వినబడుతున్న ఘంటసాల పాడిన భక్తి పాటలు వినడం నాకు చాలా చాలా ఇష్టం.  సాయంత్రం పూట స్నానం చేసి,  అమ్మమ్మ తో శివాలయానికి వెళ్ళేవాడిని. రాత్రి భోంచేసాక మిద్దె మీద పక్కలు వేసేవాళ్ళు. ఆ చల్లని రాత్రుల్లో అమ్మమ్మ ఒడిలో పడుకుని చెప్పే రాజుల కధలు వింటూ, ఆకాశంలోని చందమామ ను, నక్షత్రాలను చూస్తూ మెల్లగా నిద్ర లోకి జారుకునేవాడిని....


అలా నా చిన్నపుడు చాలా మధురంగా గడిచింది.


ఇప్పుడు కాలం మారిపోయింది. బహుశా ఇప్పటి పిల్లలకు అంత తీరిక లేదనుకుంటా. ఆటలు లేవు పాటలు లేవు. ఎంట్రన్స్ టెస్ట్ లకు ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతూ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారనిపిస్తుంది. కిలోల కొద్దీ బాగ్ లు, ఊపిరి సలపనివ్వని హోమ్‍వర్క్ లు, ట్యూషన్ లు, బిజీబిజీ లైఫ్ లు, వాళ్ళ చిన్న అందమైన మనసుల్ని ఈ వయసులోనే కలుషితం చేయడానికి రకరకాల ప్రోగ్రామ్ లతో ఎప్పుడు కవ్వించే మాజిక్ పెట్టె (టి.వి.) ... ఇక వాళ్ళకి కధలు వినే టైమ్ ఎక్కడ పాపం.....

Tuesday, 27 March 2018

కారుచీకటిని విడిచి కరియ వర్ణం నీ కురులలో దాగెనా,



కుసుమ కోమల కుసుమాలతో
సుకుమారి తనువు మేళవించెనా, 
మేఘమాలికలే నీ ఉడుపులాయెనా, 
హిమం కరిగి నీ మేనిఛాయగా మారెనా, 
కారుచీకటిని విడిచి కరియ వర్ణం 
నీ కురులలో దాగెనా,
సందెపొద్దు సూరీడు నీ పాపిట
సింధూరమాయెనా,
ఇంద్రధనుస్సు నీ కంఠాభరణమాయెనా,
శశికాంతుడు నీ కాంతులీనేకళ్ళలో దాగెనా,
ఓ నా భారతీయ వనితా, వనదేవతా..
అందుకో నా అభినందన మందారమాల.