తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday 24 August 2023

ఇంటికి ఆభరణం!! భార్య

 

భరించేది భార్య...

బ్రతుకు నిచ్చేది భార్య....

చెలిమి నిచ్చేది భార్య....

చేరదీసేది భార్య.....

 ఆకాశాన సూర్యుడు లేకపోయినా... ఇంట్లో  భార్య లేకపోయినా... అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. భర్త  వంశానికి సృష్టికర్త, మొగుడి అంశానికి మూలకర్త, కొంగు తీసి ముందుకేగినా...  చెంగు తీసి మూతి తుడిచినా... ముడిచినా.. తనకు లేరు ఎవరు సాటి.

 ఇలలో తను లేని ఇల్లు... కలలో.... ఊహకందని భావన. బిడ్డల నాదరించి... పెద్దల సేవలో తరించి భర్తని మురిపించి.. మైమరపించి...  బ్రతుకు మీద ఆశలు పెంచి... చెడు ఆలోచనలు త్రుంచి...  భ్రమరంలా ఎగురుతూ...  భర్తను భ్రమల నుండి క్రిందకు దించుతూ...  కళ్ళు కాయలు కాచేలా...  భర్త  జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి.   జీవితాన్ని అందించే మన మనిషి ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం  ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.  అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం. 

2 comments:

  1. యేమిచ్చిన ఆవిడ రుణం తీర్చుకోలేము

    ReplyDelete
    Replies
    1. జీవితాంతం మనమే తనకి రుణ పడి ఉంటాము...

      Delete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.