తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 21 July 2011

అగ్రిగోల్డ్ హాయ్‍లాండ్..ఎంజాయ్....హాయ్‍లాండ్మిత్రులకు శుభోదయం.

 హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే నేను, నా శ్రీమతి ఇద్దరం అగ్రిగోల్డ్ హాయ్‍లాండ్ కి వెళ్ళి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది. విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని మరుసటి రోజు విజయవాడ నుండి హాయ్‍లాండ్ కి వెళ్లాము. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే చాలా ఎంజాయ్ చేసాము. వాటర్‍రైడ్స్ అన్నింటికన్నా చాలా బాగా నచ్చాయి. స్లైడ్ టవర్, వేవ్‍పూల్, లేజీపార్క్, రెయిన్‍డాన్స్... వాటర్ కి సంబధించిన గేమ్స్. చాలా సూపర్ గా ఉన్నాయి.

మధ్యాహ్నం వరకు వాటిలో ఎంజాయ్ చేసి, అక్కడే ఫుడ్‍కోర్ట్ లో భోజనం చేసి, మిగతా రైడ్స్ కి వెళ్ళాము.
దాదాపు అన్నీ రైడ్స్ చేశాము. వాటిలో ఎక్కువగా నచ్చింది.... బంపింగ్ కార్స్, ఘోస్ట్ హంటర్, గో కార్టింగ్, రైల్ ఛేజ్ రైడ్... ఇవి చాలా బాగా ఎంజాయ్ చేశాము.

తరువాత షాపింగ్ చేశాము.  ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. తరువాత అగ్రిగోల్డ్ వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుంది. మూజికల్ నైట్ లాగా మూజికల్ సాయంత్రం అన్నమాట. వాళ్ళు పాడిన పాటలు, డాన్సులు చాలా బాగున్నాయి.  మాజిక్ షో చాలా బాగుంది.
అది అయ్యాక తిరిగి వచ్చేశాము.

మీరుకూడా వెళ్ళండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

లోపలికి ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ తీసుకుపోనివ్వరు. కనీసం బిస్కట్ పాకెట్ కూడా తీసుకెళ్లనివ్వరు.
ఒక బాగ్ వరకు లగేజ్ అక్కడ లగేజ్ రూమ్ లో పెట్టవచ్చు.
ప్రారంభ టికెట్ తీసుకోండి. లోపల నచ్చిన ఐటెమ్స్ వద్ద సెపరేట్ గా టిక్కెట్ తీసుకోవచ్చు.
ఇంటి దగ్గరనుండే మగవారు షార్ట్స్, లేడీస్ ఐతే కంఫర్ట్ గా ఉండే డ్రస్ తెచ్చుకోండి.(అక్కడ వాళ్ళు రెంట్ కి డ్రస్ లు ఇస్తారు).
వాటర్ లోకి ఎంటర్ అయ్యేముందు మీ లగేజ్ ని అక్కడే రెంట్ కి ఇచ్చే లాకర్లలో భద్ర పరుచుకోండి.
వాటర్ రైడ్స్ అయ్యాక స్నానం చేసి డ్రస్ ఛేంజ్ చేసుకోండి.
పిల్లలను వాటర్ లోకి తీసుకెళ్ళినపుడు జాగ్రత్తగా చూసుకోండి.
విజయవాడనుండి 47H బస్ ఎక్కితే డైరెక్ట్ గా హాయ్‍లాండ్ కి వెళ్తారు.
సో.... ఎంజాయ్....హాయ్‍లాండ్...

1 comment:

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.