తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 30 May 2014

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి వంతెన దాటుతున్నారు. తండ్రి, తన పాప ఎక్కడ పడిపోతుందో నని, పాపతో ఇలా అన్నారు,'చిన్న తల్లి, నా చెయ్యి పట్టుకో, అప్పుడు నువ్వు, నదిలో పడిపోకుండా ఉంటావు.'
అప్పుడు ఆ పాప ఇలా అంది,'లేదు నాన్నగారు, మీరే నా చెయ్యి పట్టుకోండి'.
'ఏమిటి తేడా' అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేరు.
'చాలా తేడా ఉంది నాన్నగారు' అని పాప సమాధానం చెప్పింది.
'నేను మీ చెయ్యి పట్టుకుని, నాకు ఏమైన అయితే, నేను మీ చెయ్యి వొదిలెయచ్చు కదా. కాని మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుసు, ఏది ఏమైన, మీరు నా చెయ్యి వొదలరు అని'.
నీతి :-
భగవంతుడు మనందరికి తండ్రి. భగవంతుడిని మనం వదులుకోవాలి అని అనుకున్నాఆయన మనల్ని వదలరు.
భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో, భక్తి తో కట్టెయ్యాలి.

ఒక తండ్రి, ఒక కొడుకు.....

రోజూ కొడుకు చెయ్యి పట్టుకుని కబుర్లు చెబుతూ..
కొడుకేమో తండ్రి చెప్పే మాటలు వింటూ ఊ కొడుతూ..
బాబుని ఆ రోజు కూడా స్కూల్లో వదిలి వచ్చాడు తండ్రి రోజులానే...
ఉన్నట్టుండి మూడంతస్థుల స్కూల్ భవనం కూలిపోయింది,పిల్లల్లో ఈ కొడుకు,
ఇంకా కొంతమంది భవన శిధిలాల మధ్య ఏమీ కాలేదు కానీ,చుట్టూరా పడిపోయిన
గోడల మధ్యన చిక్కుకుపొయ్యారు,ఆ కొడుకు నాన్న,నాన్న అని అరుస్తూనే ఉన్నాడు..
కొంత సేపటివరకు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు పిల్లలకి..కాసేపటికి విషయాన్ని
అర్ధం చేసుకున్న పిల్లలు ఆ బాబు దగ్గరికి వచ్చి 'ఎందుకురా,అంతలా అరుస్తున్నావు,ఎవ్వరికీ ఏమీ వినిపించదు అని ఏడుపు గొంతులతో,దిగులు ముఖాలతో అడిగారు..అప్పుడు ఆ బాబు చెప్పాడు "మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు,నీకు భయం వేసినా,బాధ కలిగినా..నాన్న అని తలుచుకో, లేదా నన్ను పిలు , నేను తప్పక నీ దగ్గరికి వస్తాను,ఆలస్యంగానైనా నిన్ను వెతుక్కుంటూ నేను ఎక్కడికైనా వస్తాను, అని చెప్పి , మళ్ళీ గట్టిగా నాన్నా,నాన్నా అని అరవటం మొదలు పెట్టాడు...ఇంతలో చుట్టూ ఉన్న పడిపోయిన గోడల శిధిలాల నుంచి ఏవో శబ్దాలు రాసాగాయి..పిల్లలకి భయం పెరిగి గట్టిగా ఏడ్చేస్తున్నారు,బాబు మాత్రం ఒకటే మాట "నాన్నా,నాన్నా..అంటూ ఒకటే పిలుపు....కొంతసేపయిన తర్వాత శిధిలాలు తొలగించి బయటినుంచి ఆ బాబు తండ్రి,కొంతమంది సహాయక సిబ్బంది చేతులు అందించి ఆ పిల్లల్ని,బాబుని బయటికి తీసారు....ఆ మిగిలిన పిల్లల తల్లితండ్రులు,ఆ తండ్రిని ఒకటే మాట అడిగారు,మీకెలా తెలుసు, మీ బాబు పిలుస్తాడని,కొన్ని శిధిలాలు తొలిగించేదాకా మాకెవ్వరికీ వినిపించని పిలుపు మీకెలా వినిపించింది, అప్పుడు తండ్రి చెప్పాడు "నా బాబుకి నా మాటల మీద నమ్మకం ఎక్కువ,వాడు ఏ కష్టం వచ్చినా నాన్న అంటూ నన్నే పిలిచి,నేను వాడి దగ్గరికి వెళ్ళే వరకు ధైర్యం కోల్పోడు,మా బాబుకున్న ఆ నమ్మకమే వాడిని ఏ సంఘటన అయినా పోరాడేలా చేస్తుంది,నేను వాడికి సహాయహస్తం అందించేవరకు, అని చెప్పాడు....ఆ తండ్రికి,కొడుక్కి మధ్య ఉన్న కనపడని,కూలిపోని గట్టి వారధి ఆ నమ్మకమే....ఆ నమ్మకమే ఆ బాబుతో పాటూ ఇంకో నలుగురు పిల్లలకు ధైర్యాన్ని,ప్రాణాన్ని పోసింది....నమ్మకమే జీవితం,నమ్మకమే అనుబంధం,నమ్మకం శాశ్వతం.......

Saturday, 17 May 2014

మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కాని బంధాన్ని కాదు"

"గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం,


వెళ్ళను కాదు కదా!


అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు


కోపతాపాలను కత్తిరించాలి కాని 


బంధాన్ని కాదు"

Saturday, 3 May 2014

కుంకుమను ధరించే సంప్రదాయం లో నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలు

పూర్వకాలంలో మగ, ఆడ తేడా లేకుండా నుదుటి పై కుంకుమను ధరించాలి అని పెద్దలు చెప్పేవారు . అది ఎందుకో నేను చదివిన కొన్ని విషయాలను మీకు తెలిచేస్తున్నాన్ను ప్రియ నేస్తాలు ..మీకు తెలిసిన విషయాలను కూడా మీ స్పందనల ద్వారా తెలియచేస్తే మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాసం ఉంది కదా ? 

 "భూవో ఘ్రాణన్వయ సంది " అంటే నాశిక పై బాగం, భ్రుకుటి మధ్యబాగం కలుసుకునే చోట కుంకుమను ధరించాలి అని అర్ధం . ఇక్కడ ఇడ, పింగళ, సుషమ్నఅనే మూడు నాడులు కలుస్తాయి . దీనినే " త్రివేణీ సంగమం " అని కూడా అంటారు. ఇది వియూష గ్రంధికి అనుబంధ స్థానం . ఇదే జ్ఞానగంధి. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులుగా భాసిల్లుతారనేది నిరూపించబడింది కదా ! మనం ధరించే బొట్టు ప్రభావం "పిట్యూటరీ గ్లాండ్" పై ఉంటుంది. "కేనన్" అనే ప్రఖ్యాత పాశ్చాత్య శాస్త్రవేత్త బృకుటి స్థానాన్ని మానవ ధన (+), మెడ వెనుక బాగాన్ని రుణ (-) విద్యుత్త్ కేంద్రాలు అని అన్నారు . ఇవి రెండు మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణను చేస్తూ ఉంటాయి . బృకుటి వద్ద ఉన్న నాడులు చాలా సున్నితం గా ఉంటాయి . అందుకే తేప , జ్వరం వంటివి వచ్చినప్పుడు పెద్దలు , వైద్యులు కూడా చల్లని బట్టను వేయమని చెపుతారు. పైన పేర్కొన్న సున్నిత మైన, కీలకమైన నాడులను సూర్యకిరణాల తాకిడి, వేడిమి , వత్తిడి నుండి రక్షించుకోడానికి తప్పని సరిగా బొట్టును ధరించాలి. సాయంకాలం , రాత్రి సమయాలలో విభూతిని ధరించాలి. విభూధిని ధరించడం వలన చల్లగా ఉండి, రక్తప్రసరణ చక్కగా జరిగి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తేజస్సు వృద్ది చెందడమే కాకుండా, చర్మ రోగాలను కూడా అంటకుండా కాపాడుతుంది. కుంకుమ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను పీల్చుకుని, జథర, శ్వాశ, కేశములకు తగినంత ఉష్ణోగ్రతను అందిస్తూ ఉంటుంది. 

 మనం నేరుగా సూర్యుణ్ణి చూడలేము కదా? రంగుల కళ్ళద్దాలు ద్వారా కాని , ఏదైనా రంగుల గాజు ద్వారా కాని చూడడం సాధ్యం అవుతుంది . ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దం పై పడి తిరిగి పరావర్తనం చెందడం వలన కళ్ళకు ఏ విధమైన హానీ జరుగదు. అదే విధముగా బొట్టును ధరించడం వలన బృకుటి వద్ద ఉన్న జ్ఞాన నేత్రం పై సూర్యుని కిరణాలు తాకి పరావర్తనం చెందడం జరుగుతుంది. జ్ఞాన నాడికి ఏ విధమైన హనీ కలుగదు. పూర్వకాలం లో ప్రకృతి నుండి లభించే వస్తువులతో స్వయం గా కుంకుమను తయారు చేసుకుని ధరించి ఆరోగ్యం గా ఉండేవారు. కాని ఇప్పుడు కొన్ని రసాయనాల కలియికతో తయారౌతున్న స్టిక్కర్లను ధరించడం వలన ఆడవారు ఎన్నో చర్మవ్యాధులకు గురై అసలు బొట్టునే ధరించే వీలు లేకుండా పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి . 

 బొట్టు ధరించినవారు అందరూ మేధావులే అయితే మరి మన పూర్వీకులంతా మేధావులై ఉండాలనో, లేక మేధావులైన వారందరూ బొట్టునే ధరించారా అనో , మన హిందూసంప్రదాయం లోనే ఈ కుంకుమ ధరించే పద్దతి ఉంది , మిగిలిన ముస్లిం , క్రిస్టియన్ , సిక్కు వంటి మతాలలో లేదు కదా ? మరి వారిలో మేధావులు లేరా అంటే నేను చెప్పలేను కాని, బొట్టు ధరించడం వలన ఇటువంటి ఆరోగ్య పరమైన విషయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించదు మనకు ఈ కుంకుమను ధరించే సంప్రదాయం. కాని మన హిందూ సంప్రదాయంలో పెద్దలు ఇంత నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలను ఏ పరిజ్ఞానంతో కనిపెట్టగాలిగారో ఏ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాని ఆ రోజుల్లో అనే విష్యం మాత్రం ఇప్పటికీ అచ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది కదా ?..హృదయ పూర్వక ధన్యవాదములతో..................

చీ చీ.... ఈ అబ్బాయికి అస్సలు సిగ్గు లేదు.

ఈ ఫోటోని చూస్తే మీకేమనిపిస్తోంది.....

Friday, 2 May 2014

అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను...

చనిపోతున్న వ్యక్తి యొక్క భావాలను ఎవరో ఇలా వ్రాసారు. అమ్మా,... నేనొక పార్టీకి వెళ్ళాను... నువ్వు చెప్పిన మాటను గుర్తుంచుకున్నాను. నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను. నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది. నువ్వెప్పుడూ నామంచి కోరే చెప్తావు. నాకు తెలుసు. ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్చెయ్యొచ్చు” అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోవచ్చింది..త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్చేస్తున్నారు, నేనూ నా బండి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను. ఆరెండో కారు నన్ను గమనించలేదు “ఢాం”అని నన్ను డీకొట్టింది, పేవ్మెంట్ మీద నేను పడి ఉన్నాను. పోలీసులు వచ్చారు. ఆ రెండో డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు.. ఆంబులెన్స్ వచ్చింది. నేను కొద్దిసేపట్లో మరణిస్తాననివారన్నారు. అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను...చుట్టూ రక్తం.. నా రక్తం, అమ్మా, నేను త్రాగలేదు, తక్కిన వాళ్ళు త్రాగారు, వాళ్ళకు సరైన ఆలోచన లేదు, నువ్వు నాకు చెప్పినట్లుగా వాళ్ళకు ఎవ్వరూ హితం చెప్పలేదా? చెప్పి ఉండి ఉంటే నాకీ భయంకర అకాల మరణం తప్పేదిగా.. నేను భరించలేని నొప్పి, బాధ, యమయాతన అనుభవిస్తున్నాను. నన్ను కొట్టినవాడు ఊరికే నిలబడి చూస్తూ ఉన్నాడు.. నేను చచ్చిపోతూ ఉంటే అతడు నడుస్తున్నాడు... అమ్మా ఇదేమి న్యాయం? నాకు సమాధానం చెప్పమ్మా... నాకు భయం వేస్తోంది... నా ఊపిరి ఆగిపోతున్నది....నా కోసం నువ్వు ఏడవకమ్మా...... ...... దీనిని మీకు తెలిసినవారందరికీ పంచండి. మనుష్యులలో ఇది మార్పు తేవాలి. త్రాగేసి డ్రైవ్ చెయ్యకూడదనే ఇంగితజ్ఞానం అందరికీ రావాలి

శుక్రవారం గుడికి వెళ్తున్నారా ? అయితే ఇది చదవండి.

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..? దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. జీన్స్ టీ షర్టులు వంటి ఆధునిక వస్త్రాలు ధరించరాదు.పురుషులైతే పంచ కండువా లేదా కుర్తా పైజామా వంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు. ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి. ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుభమస్తు.