తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 16 April 2016

బరువు తగ్గాలనుకునే వారు..ఈ రైస్ డ్రింక్ ను ఓసారి ట్రై చేసి చూడండి.!

www.onenandyala.com :: బరువు తగ్గాలనుకునే వారు..ఈ రైస్ డ్రింక్ ను ఓసారి ట్రై చేసి చూడండి.!

పెరిగిన బరువుతో నడవడం కాసింత కష్టమైపోతుందా? జిమ్ ల చుట్టూ తిరిగినా ఫలితం లేదా? టివీ లో యాడ్స్ చూసి మరీ ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్ కూడా మీ బరువును తగ్గించలేకపోయాయా? అయితే ఒక్కసారి ఇది ట్రై చేయండి. పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్ ఇది. మనం ప్రతిరోజూ తినే భియ్యాన్నే ప్రధాన వస్తువుగా తీసుకొనే ఈ పానీయాన్ని సేవిస్తే గనక బరువు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట… ఈ రైస్ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చట!.. రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.

రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు.:
బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు
నీరు – తగినంత
జీలకర – తగినంత
ఎండిన అల్లం పొడి – తగినంత
మిరియాల పొడి- తగినంత

తయారు చేసే విధానం:

జీరా, అల్లం పొడి, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్‌ను వేసి డికాషన్‌లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. సూప్స్‌కు బదులుగా దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొంత ద్రవం తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.