తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 24 July 2015

చరిత్రలో నేటి (July 24th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  24th   ప్రాముఖ్యత
1974 : పరమాణువు లోని మౌలిక కణం న్యూట్రాన్ ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రము లో నోబుల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్ మరణం (జ.1891).
1890 : గ్రంథాలయోద్యమ పితామహ, పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జననం (మ.1989).
1899 : గోదావరి పై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మరణం (జ.1803).
1932 : రామకృష్ణ మిషన్ ప్రారంభమయ్యింది.
1945 : గుజరాత్ కు చెందిన ప్రముఖ ఇంజనీరు, మరియు పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీ జననం.
1953 : ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి శ్రీవిద్య జననం (మ.2006).

1971: ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన మహాకవి గుర్రం జాషువా మరణం (జ.1895).

Wednesday, 22 July 2015

"ఆపరేషన్ శక్తి(Operation Shakti)"

www.onenandyala.com

ప్రపంచం లో ఏదేశంలోనైనా జరుగుతున్నవి , జరగబోయేవి అందరికన్నా ముందే పసిగట్టేసే అమెరికా గూఢచారి సంస్థ CIA
ఒక్క విషయంలో మాత్రం ఇది బకరా అయింది...కాదు చేశారు... CIA చరిత్రలో ఘోరమైన వైఫల్యం "1998 పోఖ్రాన్ లో భారత్ అణు పరీక్షలు " పసిగట్టలేకపోవడం...
పోఖ్రాన్ లో 1982 లోనే మొదటి అణుపరీక్షలు జరిగాయి . అప్పటినుండీ పోఖ్రాన్ చుట్టూ రహస్య ఉపగ్రహాలను మోహరించింది అగ్రరాజ్యం . అవి ఎంత శక్తిమంతవైనవి అంటే పోఖ్రాన్ లో ఒక వ్యక్తి నడుస్తూంటే ఆ వ్యక్తి చేతిగడియారంలోని సెకన్ల ముల్లు కుడా స్పష్టంగా పసిగట్టేంత . కొంతమంది మనుషులను కుడా పెట్టుకుంది అక్కడ.
అత్యంత రహస్యంగా చేసిన ఈ మొత్తం కార్యక్రమానికి "ఆపరేషన్ శక్తి(Operation Shakti)" అని నామకరణం చేశారు. ఇది చేసిన రోజు 11th May . దీనినే National Technology Day లేదా National Resurgence Day అంటారు... Resurgence అంటే "పునరుత్తేజం " అని అర్థం. ఈ మొత్తం ఆపరేషన్ కి పితామహులు శ్రీ రాజగోపాల చిదంబరం.ఈయన ఎటామిక్ ఎనర్జీ కమీషన్ చైర్మెన్ గా పనిచేశారు.మారు పేర్లతో కధ నడిపించారు
హైడ్రోజెన్ బాంబ్ పరీక్షచేయాల్సిన కందకానికి "వైట్ హౌస్" అని "విస్కీ" అని
అణు బాంబు పరీక్షచేయాల్సిన కందకానికి "తాజ్ మహల్" అని
మూడో అణుపరీక్ష కందకానికి "కుంభకర్ణ" అని ...నామకరణాలు చేశారు . సైంటిష్ట్లని "సియర్రా" అనేవారు.
ఇంకో మూడు కందకాలు కలిపి మొత్తం ఆరు కందకాలలో పరీక్షలకు అంచనా వేశారు...ఆఖరు మూడు కందకాలకు "నవతళ 1,2,3" అని పిలుచుకున్నారు...ఐతే 5 మాత్రమే పరీక్ష చేశారు.6వది భవిష్యత్తుకోసం అట్టేయపెడదాము అనుకున్నారు.
ఢిల్లీ నుండీ పని ఎంతవరకూ జరుగుతోంది అని అడగాలంటే "Is Sierra serving whisky in the white house?" అని అడిగేవారు...అంటే సైంటిష్ట్లు వైట్ హౌస్ అనే కందకంలో పని మొదలుపెట్టారా అని...ఇలా అమెరికా పేర్లు పెట్టడానికి కారణం ...ఒకవేళ ఈ మాటలు అమెరికా గూఢచారులకు తెలిసినా వారికి అవి మామూలు మాటల్లాగా అనిపించేలాగా వీళ్ళు ఇక్కడ పేర్లు పెట్టుకున్నారు.
ఈ మొత్తం ఆపరేషన్ కి రాజగోపాల చిదంబరం గారికి కుడి భుజంలాగా పనిచేసింది అప్పటి DRDO అధినేత డా.అబ్దుల్ కలాం గారు. ఇంకా వీరి టీం లో ముఖ్యులు ...కె.సంతానం గారు , లెఫ్ట్నెంట్ జెనరల్ ఇంద్ర వర్మ గారు.
"ఈ పని" కి సంబంధించి సంతానం గారి మారుపేరు "కలనల్ శ్రీనివాస్" ... ఈ పాత్రని నిజం అని నమ్మించడానికి ఈయన పలు పేపర్లలో కలనల్ శ్రీనివాస్ పరుతో కధనాలు రాసేవారు .
DRDO నుండీ అబ్దుల్ కలాం గారి మారుపేరు "చార్లీ" . లెఫ్ట్నెంట్ జెనరల్ ఇంద్ర వర్మ మారుపేరు "మైక్ ". Bhabha Atomic Research Centre(BARC)నుండీ పనిచేసే టీం కు "బ్రేవో" అని మారుపేరు పెట్టారు.
ఒకరోజు ఢిల్లీ నుండీ మెసేజ్ వచ్చింది "Has Charlie gone to the zoo? And is Bravo saying prayers? Mike is on." అని అంటే............. చార్లీ(కలాం గారు) జూ(Control room) కి వెళ్ళారా ? Bravo(BARC team) ప్రేయర్ హాల్( అణూపరీక్షలు చేసే చోటుకు) వెళ్ళాడా లేదా? Mike is ON ( నేను ఇంద్ర వర్మను మాట్లాడుతున్నాను) .
లెఫ్ట్నెంట్ ఇంద్ర వర్మ గారి పని మూడోకంటికి తెలియకుండా కందకాలను సిధ్ధం చేయడం. అదికుడా పదిరోజుల ముందు చెప్తారు చడీ చప్పుడు కాకుండా సిధ్ధం చేయాలి...ఇక్కడే విషయం రక్తి కట్టేది....రెండు కందకాలు తవ్వమన్నారు 50మీటర్లు లోతున...చుట్టూ ఉపగ్రహాల నిఘా . ఎలా.......?
“మైనింగ్ చేసే ప్రదేశం”... అని బోర్డు పెట్టారు.అందులో మంచినీటి బావి అని రెండు చోట్ల బోర్డులు పెట్టారు.అక్కడ గుడారాలు వేసి పనోళ్ళు ఉన్నట్టు నమ్మించారు ..మైనింగ్ అని చెప్పి మంచినీటిబావి ఒక్కటే తవ్వితే అనుమానం వస్తుందని మైనింగ్ చేస్తున్నట్టు నటించారు...ఒక చోట ట్రైనింగ్ అని బోర్డు పెట్టి ఉంచారు. భారతీయ నిఘా వర్గాలు..విదేశీ నిఘావర్గాల్లో దీని ప్రసక్తి ఉందేమో గమనించాయి... ఏమీ పట్టించుకోలేదు అని అనుకున్నాకా కందకాలౌ గుట్టు చప్పుడు కాకుండా రడీ చేసేశారు.
1995 లో ఒకసారి కందకాలు తవ్వడం మొదలుపెట్తగానే తవ్వాకా ఇసక కప్పిన తీరు బట్టి ఇక్కడ ఏదో జరుగుతోందని విదేశీ గూఢచారి వర్గాలు కనిపెట్తేశాయి...దీన్ని పరిగణలోకి తీసుకున్న వర్మ బృందం కందకాలు తవ్వాకా గాలి వీచే డప్పుడు ఎటువైపు ఇసక మేట వేస్తుందో అదేవేపుకు మేటలు వేసి పని పూర్తి చేశారు.
1998 జనవరి... ట్రక్కులో 20 మంది జనం వచ్చారు శాలువాలు కప్పుకుని అక్కడ ఇసక బస్తాలతో కప్పి ఉన్న నుయ్యిల దగ్గరకు వెళ్ళారు.ఆ ఇసక బస్తాలను లోపల పడేశారు.ఇసక మేటలుగా కప్పేశారు. టైర్లు ,కేబుళ్ళతో ఆ మేటలని చుట్తేశారు.తరువాత అంటించేశారు...ఆ ప్రాంత ఆకాశంలో దట్టమైన పొగ... " దమ్ముంటే పట్టుకోండి"....అంటూ ఆ ఇరవై మంది గాల్లోకి చూసి నవ్వులు, కేరింతలు .ఉలిక్కి పడిన అమెరికా గూఢచారి సంస్థ ఈ ఫొటోలను చూసి ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పీక్కున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు CIA కి...ఇలా చాలా సార్లు...ఆఖరుకి ఎవరో పోకిరీలు అనుకుని లైట్ తీసుకుంది.
అలా ఇసక కప్పేయడం టైర్లు , ట్యూబులు పెట్టి కాల్చడం చేస్తూ చేస్తూనే అందులోకి సామాగ్రిని ఒక్కొక్కటే చేరవేశారు.
...మే నెల 11వ తారీకు...."ఖేతోలై" అనే గ్రామం. పోఖ్రాన్ కి దగ్గర ఉన్న పల్లె.అక్కడ ఉన్న ఏకైక స్కూల్ కి సోహన్రాం విష్ట్నొఇ ప్రిన్సిపాల్. ఆరోజు తెల్లారకుండానే మేజర్ మోహన్ కుమార్ శర్మా ఈయన ఇంటికి వచ్చి "మీ స్కూల్ పిల్లల్ని ఒక మూడు రోజుల పాటు ఎక్కడికైనా బయటకి తీసుకువెళ్ళండి" అని అడిగారు...విషయం అర్థమయింది సోహన్ రాం విష్ట్నొఇ కి.గత కొంత కాలంగా కొత్త మొహాలని చూస్తున్నడు...1982 లో ఇక్కడ మొదటి అణుపరీక్షలు చేసినప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి. అలాగే తప్పకుండా అన్నారు...CIA కి అర్థం కానిది సోహన్ రాం కి అర్థమయింది.

మూడురోజుల్లో 5 అణు పరీక్షలు ... భారతదేశం సత్తా ప్రపంచానికి తెలిసింది . ఐదు పరీక్షలూ విజయవంతం . అది కుడా భారత ప్రధాని "భారత దేశం అణు సామర్ధ్యం ఉన్న దేశం " అని ప్రకటించాకా ప్రపంచానికి విషయం తెలిసింది. అగ్ర రాజ్యం అమెరికా తో సహా.

Monday, 20 July 2015

చరిత్రలో నేటి (July 20th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  20th   ప్రాముఖ్యత
క్రీ.పూ 356 : గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు అలెగ్జాండర్ జననం (మరణం. క్రీ.పూ.323).
1837 : ఇటలీ దేశమునకు చెందిన ఆవిష్కర్త. ఇతడు సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధిచేయుటలో పితామహుడుగా ప్రసిద్ది చెందిన గూగ్లి ఎల్మో మార్కోని మరణం (జ.1874).
1892 : ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత కవికొండల వెంకటరావు జననం (మ.1969).
1919 : న్యూజిలాండుకు చెందిన పర్వతారోహకుడు మరియు అన్వేషకుడు, షెర్పా టెన్సింగ్ నార్గే తో కలసి మొట్టమొదట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ జననం (మ.2008).
1969 : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపిన రోజు

1973 : అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు మరియు నటుడు బ్రూస్ లీ మరణం (జ.1940).

Sunday, 19 July 2015

చరిత్రలో నేటి (July 19th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  19th   ప్రాముఖ్యత
1827 : , ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంటునందు ఒక సిపాయి, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు మంగళ్ పాండే జననం (మ.1857).
1905 : అప్పటి భారత వైస్రాయి అయినటువంటి లార్డ్ కర్జన్ చే బెంగాల్ విభజన యొక్క నిర్ణయం ప్రకటించబడింది.
1955 : పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ జననం.
1969 : కేంద్ర ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
1985 : ముమ్మిడివరం బాలయోగి కైవల్య సిద్ధి (మరణించిన రోజు).

1993 : భారత్ ఇన్‌సాట్ -II బి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

Friday, 17 July 2015

చరిత్రలో నేటి (July 17th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  17th   ప్రాముఖ్యత
1918 : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు నెల్సన్ మండేలా జననం.(మ.2013)
1931 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ జననం (మ.2002).
1972 : ప్రముఖ సినీనటి సౌందర్య జననం (మ.2004).
1974 : నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించిన ఘనుడు ఎస్వీ రంగారావు మరణం (జ.1918).

1982 : భారతీయ నటి మరియు మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా జననం.

Thursday, 16 July 2015

చరిత్రలో నేటి (July 16th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  16th   ప్రాముఖ్యత
1896: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ జననం (మ.1968).
1909 : ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు అరుణా అసఫ్ అలీ జననం (మ.1996).
1924 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ జననం (మ.2007).
1945 : ప్రప్రధమ అణుపరీక్ష అమెరికా "ట్రినిటీ సైట్" అనే చోట చేపట్టింది.
1968 : ఒక ఫీల్డ్ హాకీ ఆటగాడు మరియు భారత హాకీ జట్టు యొక్క మాజీ సారథి ధనరాజ్ పిళ్ళై జననం.

1984 : ఒక బ్రిటిష్-భారతీయ నటి మరియు మోడల్ కత్రినా కైఫ్ జననం.

Wednesday, 15 July 2015

చరిత్రలో నేటి (July 15th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  15th   ప్రాముఖ్యత
1901 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు చెలికాని రామారావు జననం (మ.1985).
1902 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు జననం (మ.1976).
1903 : తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు, భారత రత్న పురస్కార గ్రహీత కె.కామరాజ్ జననం (మ.1975).
1909 : భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి దుర్గాబాయి దేశ్‌ముఖ్ జననం (మ.1981).
1920 : సినీ కథా రచయిత డి.వి.నరసరాజు జననం (మ.2006).

2013 : భారత దేశం లో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడినది.

Tuesday, 14 July 2015

చరిత్రలో నేటి (July 14th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  14th   ) ప్రాముఖ్యత
1893 : స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత మా కొద్దీ తెల్ల దొరతనం .... పాటతో సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించిన గరిమెళ్ల సత్యనారాయణ జననం (మ.1952).
1904 : ప్రజావైద్యుడు, గాంధేయవాది, వినోబాభావే సర్వోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని రెండు లక్షల కంటి శస్త్రచికిత్సలు, ఉచిత వైద్యసేవ చేసిన వెంపటి సూర్యనారాయణ జననం (మ.1993).
1954 : భారతీయ పాత్రికేయుడు, చలనచిత్ర నటుడు, రాజకీయ నేత్త, బాడీ బిల్డర్ మరియు ప్రస్తుతం దక్షిణ భారతీయ చిత్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ జననం.
1956 : తెలుగు సినిమా నటుడు, రచయత, తెలుగు భాషాభిమాని తనికెళ్ళ భరణి జననం.

Can Diabetics eat mangoes? ... a good news to diabetics patients who loves mangoes...

www.onenandyala.com

Can Diabetics eat mangoes?

... a good news to diabetics patients who loves mango...

By Dr. Pankaj Aggarwal, M.D., D.M. (Endocrinology)

Yes, diabetes patients can enjoy mangoes, provided it’s done in moderation.

Mangoes are rich in Iron, Vitamin C, Vitamin A, Vitamin B6, Potassium and folic acid.
One mango has calories equivalent to those of 1-1.5 rotis.
Eating one mango does not increase blood sugar too much (it has a Glycemic index of only 40-60).
Avoid having mangoes right after meals.
Replace intermeal snacks with half a mango. It will prevent hike in your blood sugar as well as preserve energy balance.
You can eat limited amounts of mango at regular intervals each day.
Munch on roasted chana or roasted moong dal with mangoes. They are rich sources of proteins and fibers that also lower the risk of increase in blood sugar after eating mangoes.

Monday, 13 July 2015

చరిత్రలో నేటి (July 13th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  13th   ప్రాముఖ్యత
క్రీ.పూ. 100 : రోమన్ నియంత జూలియస్ సీజర్ జననం (మ.44 క్రీ.పూ.).
1643 : ఆంగ్లేయుల అంతర్యుద్ధం.
1964: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జననం.

2004 : భారతదేశములో మొదటిదైన గ్రామీణ సమాచార కేంద్రము, జనరల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్సెమినేషన్ (గ్రిడ్) సెంటర్ యొక్క తొలి కేంద్రమును గుమ్మడిదల లో ప్రారంభించారు.

Saturday, 11 July 2015

చరిత్రలో నేటి (July 11th ) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (July  11th   ప్రాముఖ్యత
మంగోలియా జాతీయదినోత్సవం
1907 : ప్రముఖ రంగస్థల నటుడు, తెలుగు సినీ నటుడు సి.యస్.ఆర్. ఆంజనేయులు జననం (మ.1963).
1964 : ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ జననం.

1987 : ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. అందుకే, ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవం గా 1987 నుంచి జరుపు కుంటున్నారు

Wednesday, 8 July 2015

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది.

www.onenandyala.com

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది.


         1.ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
           ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం.. లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
           రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు...
           2.ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది. ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
            ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా? శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి. విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...
            3.రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా.. మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు.. శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది..
            ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది. మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
            4.రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి.. తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది. కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...
             ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.
              రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో ............................. కాలమే సమాధానం
              రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి... లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం..
               మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది.. రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్‌ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్‌ తోటలోని తన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
               లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్‌ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్‌ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు.. అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్‌ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రెユ అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది.... ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్‌ వుమెన్‌ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్‌ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది... ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..
                లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి... లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు.. రావణుడి కొడుకు ఇంద్రజిత్‌.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి. రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్‌లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.
                తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్‌.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్‌ హౌస్‌ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్‌ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్‌ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్‌ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు.. రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి..
రావణుడు ఆర్కిటెక్ట్‌
రావణుడు ఏరోనాటికల్‌ ఇంజనీర్‌
రావణుడు డాక్టర్‌
రావణుడు వార్‌ఫేర్‌ టెక్నాలజిస్ట్‌
రావణుడు నిత్య పరిశోధకుడు
రావణుడు గొప్ప సంగీతవేత్త
                ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్‌ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం. రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.
               లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్‌ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్‌ కలిపే నెట్‌వర్క్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి, ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..
              పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్‌ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు.. పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్‌ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్‌లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్‌వెయిట్‌ స్టోన్స్‌, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది..
                శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్‌ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది.. నీలవరై పుత్తుర్‌ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్‌ రాక్‌ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎతెユ్తన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్‌ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్‌ చేసేవాడు..
              ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు...
              రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు.