తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 3 July 2015

పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివిస్తే, వారు పెద్దయ్యాక తల్లి తండ్రులను వృద్దాశ్రమంలో ఉంచుతారా?

www.onenandyala.com

Whatsapp No.  9490883666

www.facebook.com/onenandyal

తల్లి: "ఏరా! చిన్నప్పటినుండి కష్టపడి మిమ్మల్ని చదివించి,జీవితంలో వృద్ధిలోనికితీసుకువచ్చినందుకు వృద్ధాశ్రమంలోచేర్పించి మాకు బానే బుద్ధిచెప్పారు .ఒకే కొడుకువి మాకుమీదగ్గర ఉండాలని ,శేషజీవితం గడపాలని ఉంటుంది కదా"


కొడుకు: "ఏం నెలనెలా డబ్బు నేనేకదా పంపుతున్నది మీకు. అదీగాక మీరు నన్ను చూడాలనిఅనినప్పుడలా నేనువస్తూనే ఉన్నాకదా. మీతో గడుపుతున్నాకదా"


తల్లి: అలా డబ్బు పంపడం కాదు. మాకు మీదగ్గర ఉండాలని, మనవడిని ఆడించాలని ఉంటుంది కదా"


కొడుకు : చూడమ్మా. నువ్వు,నాన్న నాకు మిగతా బంధువుల కన్నా ఏమంత ఎక్కువకాదు. తేడాఏంటంటే మీరుకష్టపడి మీ డబ్బుతో నన్ను చదివించారు.అంతే. అసలు నన్ను 2వ తరగతిలోనేహాస్టల్లో వేసి చదివించారు. అప్పటినుండి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లల్లోనే జరిగింది. అప్పుడప్పుడునెలకొకసారి వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఇంటికొచ్చి చదువుకుంటానంటే నీ భవిష్యత్తు కోసమే కదామేము ఇద్దరమూ కష్టపడుతూ చదివిస్తున్నాము అన్నారు. ఏం నాకు మాత్రం మీవద్ద ఉండాలనిఅప్పుడు ఎంతబాధపడ్డానో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఐనఈ విషయంఎన్నిసార్లు చెప్పాలి. మీలాగే నేను కూడా డబ్బు పంపుతున్నా కదా. మీరన్నా అప్పుడునెలకుఒకటిరెండుసార్లే వచ్చే వారు చూడడానికి.నేను మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నా కదా. ఇక ఈటాపిక్ ఎప్పుడూమాట్లాడకు.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.