తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday, 22 July 2015

"ఆపరేషన్ శక్తి(Operation Shakti)"

www.onenandyala.com

ప్రపంచం లో ఏదేశంలోనైనా జరుగుతున్నవి , జరగబోయేవి అందరికన్నా ముందే పసిగట్టేసే అమెరికా గూఢచారి సంస్థ CIA
ఒక్క విషయంలో మాత్రం ఇది బకరా అయింది...కాదు చేశారు... CIA చరిత్రలో ఘోరమైన వైఫల్యం "1998 పోఖ్రాన్ లో భారత్ అణు పరీక్షలు " పసిగట్టలేకపోవడం...
పోఖ్రాన్ లో 1982 లోనే మొదటి అణుపరీక్షలు జరిగాయి . అప్పటినుండీ పోఖ్రాన్ చుట్టూ రహస్య ఉపగ్రహాలను మోహరించింది అగ్రరాజ్యం . అవి ఎంత శక్తిమంతవైనవి అంటే పోఖ్రాన్ లో ఒక వ్యక్తి నడుస్తూంటే ఆ వ్యక్తి చేతిగడియారంలోని సెకన్ల ముల్లు కుడా స్పష్టంగా పసిగట్టేంత . కొంతమంది మనుషులను కుడా పెట్టుకుంది అక్కడ.
అత్యంత రహస్యంగా చేసిన ఈ మొత్తం కార్యక్రమానికి "ఆపరేషన్ శక్తి(Operation Shakti)" అని నామకరణం చేశారు. ఇది చేసిన రోజు 11th May . దీనినే National Technology Day లేదా National Resurgence Day అంటారు... Resurgence అంటే "పునరుత్తేజం " అని అర్థం. ఈ మొత్తం ఆపరేషన్ కి పితామహులు శ్రీ రాజగోపాల చిదంబరం.ఈయన ఎటామిక్ ఎనర్జీ కమీషన్ చైర్మెన్ గా పనిచేశారు.మారు పేర్లతో కధ నడిపించారు
హైడ్రోజెన్ బాంబ్ పరీక్షచేయాల్సిన కందకానికి "వైట్ హౌస్" అని "విస్కీ" అని
అణు బాంబు పరీక్షచేయాల్సిన కందకానికి "తాజ్ మహల్" అని
మూడో అణుపరీక్ష కందకానికి "కుంభకర్ణ" అని ...నామకరణాలు చేశారు . సైంటిష్ట్లని "సియర్రా" అనేవారు.
ఇంకో మూడు కందకాలు కలిపి మొత్తం ఆరు కందకాలలో పరీక్షలకు అంచనా వేశారు...ఆఖరు మూడు కందకాలకు "నవతళ 1,2,3" అని పిలుచుకున్నారు...ఐతే 5 మాత్రమే పరీక్ష చేశారు.6వది భవిష్యత్తుకోసం అట్టేయపెడదాము అనుకున్నారు.
ఢిల్లీ నుండీ పని ఎంతవరకూ జరుగుతోంది అని అడగాలంటే "Is Sierra serving whisky in the white house?" అని అడిగేవారు...అంటే సైంటిష్ట్లు వైట్ హౌస్ అనే కందకంలో పని మొదలుపెట్టారా అని...ఇలా అమెరికా పేర్లు పెట్టడానికి కారణం ...ఒకవేళ ఈ మాటలు అమెరికా గూఢచారులకు తెలిసినా వారికి అవి మామూలు మాటల్లాగా అనిపించేలాగా వీళ్ళు ఇక్కడ పేర్లు పెట్టుకున్నారు.
ఈ మొత్తం ఆపరేషన్ కి రాజగోపాల చిదంబరం గారికి కుడి భుజంలాగా పనిచేసింది అప్పటి DRDO అధినేత డా.అబ్దుల్ కలాం గారు. ఇంకా వీరి టీం లో ముఖ్యులు ...కె.సంతానం గారు , లెఫ్ట్నెంట్ జెనరల్ ఇంద్ర వర్మ గారు.
"ఈ పని" కి సంబంధించి సంతానం గారి మారుపేరు "కలనల్ శ్రీనివాస్" ... ఈ పాత్రని నిజం అని నమ్మించడానికి ఈయన పలు పేపర్లలో కలనల్ శ్రీనివాస్ పరుతో కధనాలు రాసేవారు .
DRDO నుండీ అబ్దుల్ కలాం గారి మారుపేరు "చార్లీ" . లెఫ్ట్నెంట్ జెనరల్ ఇంద్ర వర్మ మారుపేరు "మైక్ ". Bhabha Atomic Research Centre(BARC)నుండీ పనిచేసే టీం కు "బ్రేవో" అని మారుపేరు పెట్టారు.
ఒకరోజు ఢిల్లీ నుండీ మెసేజ్ వచ్చింది "Has Charlie gone to the zoo? And is Bravo saying prayers? Mike is on." అని అంటే............. చార్లీ(కలాం గారు) జూ(Control room) కి వెళ్ళారా ? Bravo(BARC team) ప్రేయర్ హాల్( అణూపరీక్షలు చేసే చోటుకు) వెళ్ళాడా లేదా? Mike is ON ( నేను ఇంద్ర వర్మను మాట్లాడుతున్నాను) .
లెఫ్ట్నెంట్ ఇంద్ర వర్మ గారి పని మూడోకంటికి తెలియకుండా కందకాలను సిధ్ధం చేయడం. అదికుడా పదిరోజుల ముందు చెప్తారు చడీ చప్పుడు కాకుండా సిధ్ధం చేయాలి...ఇక్కడే విషయం రక్తి కట్టేది....రెండు కందకాలు తవ్వమన్నారు 50మీటర్లు లోతున...చుట్టూ ఉపగ్రహాల నిఘా . ఎలా.......?
“మైనింగ్ చేసే ప్రదేశం”... అని బోర్డు పెట్టారు.అందులో మంచినీటి బావి అని రెండు చోట్ల బోర్డులు పెట్టారు.అక్కడ గుడారాలు వేసి పనోళ్ళు ఉన్నట్టు నమ్మించారు ..మైనింగ్ అని చెప్పి మంచినీటిబావి ఒక్కటే తవ్వితే అనుమానం వస్తుందని మైనింగ్ చేస్తున్నట్టు నటించారు...ఒక చోట ట్రైనింగ్ అని బోర్డు పెట్టి ఉంచారు. భారతీయ నిఘా వర్గాలు..విదేశీ నిఘావర్గాల్లో దీని ప్రసక్తి ఉందేమో గమనించాయి... ఏమీ పట్టించుకోలేదు అని అనుకున్నాకా కందకాలౌ గుట్టు చప్పుడు కాకుండా రడీ చేసేశారు.
1995 లో ఒకసారి కందకాలు తవ్వడం మొదలుపెట్తగానే తవ్వాకా ఇసక కప్పిన తీరు బట్టి ఇక్కడ ఏదో జరుగుతోందని విదేశీ గూఢచారి వర్గాలు కనిపెట్తేశాయి...దీన్ని పరిగణలోకి తీసుకున్న వర్మ బృందం కందకాలు తవ్వాకా గాలి వీచే డప్పుడు ఎటువైపు ఇసక మేట వేస్తుందో అదేవేపుకు మేటలు వేసి పని పూర్తి చేశారు.
1998 జనవరి... ట్రక్కులో 20 మంది జనం వచ్చారు శాలువాలు కప్పుకుని అక్కడ ఇసక బస్తాలతో కప్పి ఉన్న నుయ్యిల దగ్గరకు వెళ్ళారు.ఆ ఇసక బస్తాలను లోపల పడేశారు.ఇసక మేటలుగా కప్పేశారు. టైర్లు ,కేబుళ్ళతో ఆ మేటలని చుట్తేశారు.తరువాత అంటించేశారు...ఆ ప్రాంత ఆకాశంలో దట్టమైన పొగ... " దమ్ముంటే పట్టుకోండి"....అంటూ ఆ ఇరవై మంది గాల్లోకి చూసి నవ్వులు, కేరింతలు .ఉలిక్కి పడిన అమెరికా గూఢచారి సంస్థ ఈ ఫొటోలను చూసి ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పీక్కున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు CIA కి...ఇలా చాలా సార్లు...ఆఖరుకి ఎవరో పోకిరీలు అనుకుని లైట్ తీసుకుంది.
అలా ఇసక కప్పేయడం టైర్లు , ట్యూబులు పెట్టి కాల్చడం చేస్తూ చేస్తూనే అందులోకి సామాగ్రిని ఒక్కొక్కటే చేరవేశారు.
...మే నెల 11వ తారీకు...."ఖేతోలై" అనే గ్రామం. పోఖ్రాన్ కి దగ్గర ఉన్న పల్లె.అక్కడ ఉన్న ఏకైక స్కూల్ కి సోహన్రాం విష్ట్నొఇ ప్రిన్సిపాల్. ఆరోజు తెల్లారకుండానే మేజర్ మోహన్ కుమార్ శర్మా ఈయన ఇంటికి వచ్చి "మీ స్కూల్ పిల్లల్ని ఒక మూడు రోజుల పాటు ఎక్కడికైనా బయటకి తీసుకువెళ్ళండి" అని అడిగారు...విషయం అర్థమయింది సోహన్ రాం విష్ట్నొఇ కి.గత కొంత కాలంగా కొత్త మొహాలని చూస్తున్నడు...1982 లో ఇక్కడ మొదటి అణుపరీక్షలు చేసినప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి. అలాగే తప్పకుండా అన్నారు...CIA కి అర్థం కానిది సోహన్ రాం కి అర్థమయింది.

మూడురోజుల్లో 5 అణు పరీక్షలు ... భారతదేశం సత్తా ప్రపంచానికి తెలిసింది . ఐదు పరీక్షలూ విజయవంతం . అది కుడా భారత ప్రధాని "భారత దేశం అణు సామర్ధ్యం ఉన్న దేశం " అని ప్రకటించాకా ప్రపంచానికి విషయం తెలిసింది. అగ్ర రాజ్యం అమెరికా తో సహా.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.