తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 31 March 2011

సప్తవర్ణాల్ని స్నేహంగా పలుకరించి మేఘాల పొత్తిళ్ళలో...


"సప్తవర్ణాల్ని స్నేహంగా పలుకరించి
 మేఘాల పొత్తిళ్ళలో పడుకున్న
 చందమామ చెక్కిలి మీద నుండి
 గులాబి రంగును..
వాగుల్లోను..వంకల్లోను.. 
నీటి తరంగాలతో దోబూచులాడుతూ..
వయ్యారంగా సాగిపోయే 
చేపపిల్ల కళ్ళలోంచి నీలిరంగును..
వెన్నెల తాకిడికే కందిపోయి
 మంచులో శీతలస్నానం చేసే
 సన్నజాజుల రేకుల్లోంచి తెల్లని తెలుపును..
నక్షత్రాలు ఊసులాడుకుంటున్న వేళ.. 
చెదిరిన చీకటిలో నుండి నలుపును..
ముగ్గులకు రంగులద్దే తెలుగింటి 
సిగ్గులమొగ్గ బుగ్గల అరుణిమని....
సూర్యుడికన్న ముందే చూసి పట్టుకుని 
అందులోంచి ఎరుపు పసుపుల్ని మిళితం చేసి..
నా మనసులోని భావాలను
కుంచెగా మలిచి.. 

ఒక అందమైన చిత్రరాజాన్ని సృష్టించాను.....

అరే విచిత్రం.... 

అది నా కళ్యాణి  చిత్ర.మే...

......నా జీవితాన్ని నందనవనం..గా...చేసి...కళ్యాణిరాగం లా సాగిపోయేలా చేస్తోన్న...నా....కళ్యాణి..చిత్ర.మే...

నా జీవితాన్ని మార్చిన, నాకు బాగా నచ్చిన ఒక గొప్ప కొటేషన్... మీకు నచ్చిందా.....



అవతలి మనిషి

    విసుగుని... నీ సహనంతోను.........
కోపాన్ని... క్షమతోను...........
తప్పును... నవ్వుతోను..........
బలహీనతను... ప్రేమతోను.......
ఎదుర్కొనే మనిషికి జీవితంలో విషాదం అనేదే ఉండదు.

మీరు కూడా మీ చిన్నప్పుడు మీ వేసవి సెలవులు ఇలాగే గడిపారా?...


నా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళేవాళ్ళం. నాకు చాలా బాగా గుర్తు. మిద్దె మీద పడుకునే వాళ్ళం. మా ఇంటి చుట్టూ జామచెట్లు, కొబ్బరిచెట్లు, ఇంటి ముందర బాగా అల్లుకున్న సన్నజాజి తీగె ఉండేవి. ఉదయాన్నే నిద్ర లేచేసరికి, పక్షుల కిలకిలా రావాల తో చల్లగా వీచే గాలి లో విరిసీ విరియని సన్నజాజుల పరిమళాలు ఏవో మధురలోకాలలోకి తీసుకెళ్ళేవి. పొద్దున గ్లాసుడు పాలు తాగి, ఇడ్లీ నో, చద్దన్నమో తిని తాతయ్య తో పాటు తోటకు వెళ్ళే వాళ్ళం. అక్కడ మామిడిచెట్లకు ఉయ్యాలలు కట్టుకుని ఊగి ఆడుకుని, మామిడిపళ్ళు, తాటిముంజెలు తిని వచ్చేసేవాళ్ళం. నందివర్దనం చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వేళ కి పక్షులన్నీ గూటికి చేరుకునేవి. సరిగ్గా అదే సమయానికి మా ఊరి సినిమా హాల్ లో "నమో వెంకటేశా, నమో తిరుమలేశా" అనే పాట రికార్డ్ వేసేవాళ్ళు. ఆ సాయం సంధ్య వేళ పిచ్చుకల కిలకిలలు, పావురాళ్ళ కువకువలు, దూరంగా గుడిలో నుండి వినబడుతున్న ఘంటసాల పాడిన భక్తి పాటలు వినడం నాకు చాలా చాలా ఇష్టం.  సాయంత్రం పూట స్నానం చేసి,  అమ్మమ్మ తో శివాలయానికి వెళ్ళేవాడిని. రాత్రి భోంచేసాక మిద్దె మీద పక్కలు వేసేవాళ్ళు. ఆ చల్లని రాత్రుల్లో అమ్మమ్మ ఒడిలో పడుకుని చెప్పే రాజుల కధలు వింటూ, ఆకాశంలోని చందమామ ను, నక్షత్రాలను చూస్తూ మెల్లగా నిద్ర లోకి జారుకునేవాడిని....


అలా నా చిన్నపుడు చాలా మధురంగా గడిచింది.


ఇప్పుడు కాలం మారిపోయింది. బహుశా ఇప్పటి పిల్లలకు అంత తీరిక లేదనుకుంటా. ఆటలు లేవు పాటలు లేవు. ఎంట్రన్స్ టెస్ట్ లకు ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతూ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నారనిపిస్తుంది. కిలోల కొద్దీ బాగ్ లు, ఊపిరి సలపనివ్వని హోమ్‍వర్క్ లు, ట్యూషన్ లు, బిజీబిజీ లైఫ్ లు, వాళ్ళ చిన్న అందమైన మనసుల్ని ఈ వయసులోనే కలుషితం చేయడానికి రకరకాల ప్రోగ్రామ్ లతో ఎప్పుడు కవ్వించే మాజిక్ పెట్టె (టి.వి.) ... ఇక వాళ్ళకి కధలు వినే టైమ్ ఎక్కడ పాపం.....

Wednesday, 30 March 2011

మన ఎమ్మెల్యే లకు జీతాలు సరిపోవడం లేదోచ్.......


మన ఎమ్మెల్యే లకు జీతాలు సరిపోవడం లేదండి.  ఏం చేస్తాం మరి పాపం అసలే చాలా చాలా బీదవాళ్ళు. రైలెక్కడానికి కూడా డబ్బుల్లేవు. వాళ్ళకు ఫోన్ లు లేవు. కంప్యూటర్ లు లేవు. నడవడానికి సైకిల్ లు లేవు.  అందుకే  పాపం మన దయ కలిగిన ప్రభుత్వం వాళ్ళ మీద దయ తో, జాలి తో, వాళ్ళకు కార్లు, నడపడానికి డ్రైవర్లు, మాట్లాడడానికి ఐ ఫోన్ లు, వినడానికి గెలాక్సీ ఐ పాడ్ లు, కంప్యూటర్, ప్రింటర్ లు, స్కానర్లు, దేశంలో తిరగడానికి రైల్వే టికెట్ లు, గన్‍మెన్ లు, ఇవన్నీ సరిపోవు కాబట్టి, వాళ్ళకు ఖర్చులకు సరదాలకు మరి మన ప్రభుత్వమే కదండీ డబ్బులివ్వాల్సింది. 


ఉద్యోగులకు జీతాలు పెంచాలంటే సవాలక్ష కారణాలు చెబుతారు. పెంచినా కూడా గొర్రెకు తోక బెత్తెడు అన్నట్టు, వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి అన్నట్టు అలా ఇస్తారు. ఇలా తీసుకుంటారు. బస్సు టికెట్ల రేట్ లు, కరెంటు చార్జీలు, నీళ్ళ చార్జీలు, ఇంటిపన్ను, ఒకటేమిటి సర్వం పెరుగుతాయి. ఏం చేస్తాం. చూస్తూ ఉంటాం. అంతే.....

Tuesday, 29 March 2011

భార్యాభర్తల మధ్య ప్రేమ వయసు పెరిగే కొద్దీ పెరుగుతుందా?


భార్యాభర్తల మధ్య ప్రేమ వాళ్ళ వయసు పెరిగే కొద్దీ మరింతగా పెరుగుతుందేమో అనిపించింది ఈరోజు నాకు ఎదురైన ఒక అనుభవం ద్వారా.


మా ఆవిడకు ఒక ఫ్రెండ్ ఉంది. నా భార్య వయసు 22 ఐతే ఆమె వయసు 55 ఉండొచ్చు. ఆమె భర్త రోజూ తాగుతాడు. ఆమెను తిడుతూనే ఉంటాడు. ఆయన మా కాలనీలో నీళ్ళు వదిలే జాబ్ చేస్తాడు.


  ఆమె ఏదో పని మీద ఈరోజు మా ఇంటికి వచ్చింది. సరిగ్గా అదే టైమ్ కి మేము దోశలు తింటున్నాము. ఆమె కి కూడా నా భార్య తినమని ౩ దోశలు ప్లేట్ లో పెట్టి ఇచ్చింది. ఆమె ఒక్క నిమిషం ఆలోచించి, ఆ దోశలు తీసుకుని వెళ్ళబోయింది. తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు అవ్వా?  అని నా భార్య అడిగితే.. ఆమె, " మా ఆయన కు పెడుతానమ్మా ఇవి. ఆయన తింటే నేను తిన్నట్టే".  ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం వేసింది.  నువ్వు తినమ్మా. తిన్నాక తీసుకెళ్దువు గాని అన్నా కూడా వినక పోయే సరికి, మరికొన్ని దోశలు ఒక బాక్స్ లో ఇద్దరికి వేసి ఇచ్చింది మా అమ్మ.


మనదేశంలో భార్యాభర్తల మధ్య ఇంత ప్రేమ, అనురాగం ఉన్నాయి కబట్టే మన వివాహవ్యవస్థను ప్రపంచం అంతా గౌరవిస్తుంది.


నేను ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నాను. 


 దేవుడా, ఈ ప్రపంచంలో అందరికి ఇంతగా ప్రేమించే మంచి మనసులనివ్వు.  అప్పుడు హత్యలుండవు, అత్యాచారాలుండవు. వరకట్న హత్యలుండవు. అమ్మాయిలపై ఆసిడ్ దాడులుండవు..... 

Friday, 25 March 2011

నీ తలపులు... నా గుండె తలుపుల్ని తీసుకుని చాలా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి.


గాలి తన చేతులతో అలవోకగా నదీ కెరటాలను నిద్ర లేపినట్టు నీ జ్నాపకం నా పెదవుల మీద నవ్వు తెరల్ని కదుపుతోంది.


నీకు తెలుసా?


    నేను నీ గురించి అలోచిస్తూ ఒక అలౌకికమైన స్తితి లో ఋష్యత్వాన్ని పొందుతాను.  
    నాకు తపోభంగం కలిగిస్తూ అక్కడ కూడా నువ్వు నాకు గోచరిస్తావు.


    గులాబీ మీది మంచుబిందువు తన మీద ఎప్పుడు రాలుతుందా.. అని రాత్రంతా ఎదురుచూసే గడ్డి పరకలా నేను నీకోసం ఎదురుచూస్తాను.


    నీ తలపులు.. నా గుండె తలుపుల్ని తీసుకుని చాలా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి.


    వసంతాలన్నీ వర్షాలు గా, వర్షాలన్నీ శిశిరాలు గా, శిశిరాలన్నీ  వసంతాలు గా మారిపోతున్నాయి.


    ఆనందాలు అరవిందాలవుతున్నాయి.


    నా కనులు నీకోసం వేచి వేచి అరమోడ్పులవుతున్నాయి. అరమోడ్పులైన కళ్ళతో అహర్నిశం నీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను.

Thursday, 24 March 2011

భావి పౌరుడి ఆవేదన....



నేను పెరిగి పెద్దవాడినయ్యే వరకు ఈ అందమైన ప్రకృతి ఇలాగే ఉంటుందా?


ఇంత అందమైన ప్రకృతి ని మనిషి తన స్వార్దంతో పాడు చేస్తూ సకల మానవాళి కి ముప్పు తెస్తున్నాడు.

Saturday, 19 March 2011

మంచి చెడు అనేదేది లేదు. కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.

At the close of LIFE....., the question will be....

... Not how much you have GOT...
      But how much you have GIVEN.
... Not how much you WON...
      But how much you have DONE.
... Not how much you have SAVED...
      But how much you have SACRIFICED.
... Not how much you were honoured...
      But how much you LOVED and SERVED.
... Not how much you have CRITICISED...
      But how much you have APPRECIATED.
... Not how many years you have LIVED...
      But .. know in how many HEARTS YOU HAVE LIVED.

Friday, 18 March 2011

నీకు కనబడిందంతా నిజమని నమ్మకు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాఇ.
మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల. అత్యంత హీనమైన గుణం పగ. ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగ కోసం ఉపయోగించడం అనవసరం.
ఎక్కడైతే అసంతృప్తి ఉన్నదో అక్కడ ఆనందం ఉండదు. అసంతృప్తి అనేది మనిషి కి దేనివల్లనైనా రావచ్చు. అది తీరని కోరిక వల్ల కావచ్చు. తీరని కామము వల్ల కావచ్చు. తెగని క్రోధము వల్ల కావచ్చు... వాటిని జ‍ఇస్తే జీవితమంతా తృప్తే ఉంటుంది.

Thursday, 17 March 2011

Old Telugu Music

some cute wall papers












Anaganaga Oka Dheerudu

Ala Modalindi

Chukkalanti Ammai Chakkanina Abbai

Shakthi

Prema kavali

Vishnu Sahasranamam

Venkateswara suprabhatam and Vishnu Sahasranamam

for Telugu novels and Detective books


Wednesday, 16 March 2011

Be...SMILE...

Be.. Smile always..
Be.. happy always..
You look beautiful... when your smile beautiful..
Sooooooooooo Keep smiling....
ఇలా ఉన్దాలని నువ్వు అనుకున్టావు కాని నిన్నెలా ఉంచాలో ఆ దేవుడు నిర్ణ ఇస్తాడు