మన ఎమ్మెల్యే లకు జీతాలు సరిపోవడం లేదండి. ఏం చేస్తాం మరి పాపం అసలే చాలా చాలా బీదవాళ్ళు. రైలెక్కడానికి కూడా డబ్బుల్లేవు. వాళ్ళకు ఫోన్ లు లేవు. కంప్యూటర్ లు లేవు. నడవడానికి సైకిల్ లు లేవు. అందుకే పాపం మన దయ కలిగిన ప్రభుత్వం వాళ్ళ మీద దయ తో, జాలి తో, వాళ్ళకు కార్లు, నడపడానికి డ్రైవర్లు, మాట్లాడడానికి ఐ ఫోన్ లు, వినడానికి గెలాక్సీ ఐ పాడ్ లు, కంప్యూటర్, ప్రింటర్ లు, స్కానర్లు, దేశంలో తిరగడానికి రైల్వే టికెట్ లు, గన్‍మెన్ లు, ఇవన్నీ సరిపోవు కాబట్టి, వాళ్ళకు ఖర్చులకు సరదాలకు మరి మన ప్రభుత్వమే కదండీ డబ్బులివ్వాల్సింది.
ఉద్యోగులకు జీతాలు పెంచాలంటే సవాలక్ష కారణాలు చెబుతారు. పెంచినా కూడా గొర్రెకు తోక బెత్తెడు అన్నట్టు, వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి అన్నట్టు అలా ఇస్తారు. ఇలా తీసుకుంటారు. బస్సు టికెట్ల రేట్ లు, కరెంటు చార్జీలు, నీళ్ళ చార్జీలు, ఇంటిపన్ను, ఒకటేమిటి సర్వం పెరుగుతాయి. ఏం చేస్తాం. చూస్తూ ఉంటాం. అంతే.....
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.