తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday 31 March 2011

సప్తవర్ణాల్ని స్నేహంగా పలుకరించి మేఘాల పొత్తిళ్ళలో...


"సప్తవర్ణాల్ని స్నేహంగా పలుకరించి
 మేఘాల పొత్తిళ్ళలో పడుకున్న
 చందమామ చెక్కిలి మీద నుండి
 గులాబి రంగును..
వాగుల్లోను..వంకల్లోను.. 
నీటి తరంగాలతో దోబూచులాడుతూ..
వయ్యారంగా సాగిపోయే 
చేపపిల్ల కళ్ళలోంచి నీలిరంగును..
వెన్నెల తాకిడికే కందిపోయి
 మంచులో శీతలస్నానం చేసే
 సన్నజాజుల రేకుల్లోంచి తెల్లని తెలుపును..
నక్షత్రాలు ఊసులాడుకుంటున్న వేళ.. 
చెదిరిన చీకటిలో నుండి నలుపును..
ముగ్గులకు రంగులద్దే తెలుగింటి 
సిగ్గులమొగ్గ బుగ్గల అరుణిమని....
సూర్యుడికన్న ముందే చూసి పట్టుకుని 
అందులోంచి ఎరుపు పసుపుల్ని మిళితం చేసి..
నా మనసులోని భావాలను
కుంచెగా మలిచి.. 

ఒక అందమైన చిత్రరాజాన్ని సృష్టించాను.....

అరే విచిత్రం.... 

అది నా కళ్యాణి  చిత్ర.మే...

......నా జీవితాన్ని నందనవనం..గా...చేసి...కళ్యాణిరాగం లా సాగిపోయేలా చేస్తోన్న...నా....కళ్యాణి..చిత్ర.మే...

2 comments:

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.