తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 2 April 2011

ఎదుటివారు ఇలా ఉండాలి అని కోరుకుంటామే కాని,


విసుగు, తప్పులు, కోపాలు అన్నీ పుట్టేది మన మనసులోనే. 


మనం మనస్పూర్తిగా నిజాయితీ గా ఉండగలిగితే అవేవి మన మీద ఆధిపత్యం చెలాయించలేవు. 


మన విసుగును మన సహనంతోనే పోగొట్టుకోవాలి.
నిజాయితీ గా ఉండి మన అంతరాత్మ చెప్పినట్టు వింటే ఎలాంటి తప్పులు చెయ్యము.
మనం మన స్వార్దాన్ని కొంచెం వీడి, మనకు చేతనయిన సహాయం ఇతరులకు చెయ్యగలిగితే అంతకు మించి మనం సాధించాల్సింది ఏమీ లేదు.


ఒక చిన్న సంఘటన చెబుతాను.


ఒక మనిషి రోడ్ మీద నడుస్తున్నాడు. నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. ఎదురుగా ఒక నల్లటి కుక్క కోరలు బయటకు సాచి కరవడానికి సిద్దంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. అతనికి భయంవేసి పరిగెత్తాలనిపించింది. కానీ అతనికి అనిపించింది. తనని అది ఎందుకు కరుస్తుంది. తను దానిని ఏమీ చెయ్యలేదు కదా. 


మళ్ళీ అతనికే అనిపించింది.... తనని ఆ కుక్క ఎందుకు కరవకూడదు?... 
తనెప్పుడైనా ఆ కుక్క కి ఏదైనా సాయం చేశాడా.  తను తినేది ఏమైనా దానికి పెట్టాడా? లేదే. దానికి ఏరోజూ ఎలాంటి ఉపకారము చెయ్యలేదు. కాబట్టి దానిని కరవొద్దు అనే హక్కు తనకి లేదు....
అతను ఇలా అలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు. 
ఏమనుకుందో ఏమో ఆ కుక్క ... అతనికేసి ఒకలాగ చూసి...వెళ్ళిపోయింది..


మనము ఎవ్వరికీ ఏమీ ఇవ్వనపుడు మనకు ఒకరినుండి ఆశించే హక్కు లేదు...


ఎదుటివారు ఇలా ఉండాలి అని కోరుకుంటామే కాని, మనం అలా మంచిగా తాయారుకావడానికి ప్రయత్నించము.


ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఏమైనా తప్పులుంటే చెప్పండి....

1 comment:

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.