తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday, 11 April 2011

అమృతవాక్యాలు.....

మంచి చెడు అనేదేది లేదు. కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.


నీకు కనబడిందంతా నిజమని నమ్మకు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి.


మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల. అత్యంత హీనమైన గుణం పగ. ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగ కోసం ఉపయోగించడం అనవసరం.


ఎక్కడైతే అసంతృప్తి ఉన్నదో అక్కడ ఆనందం ఉండదు. అసంతృప్తి అనేది మనిషి కి దేనివల్లనైనా రావచ్చు. అది తీరని కోరిక వల్ల కావచ్చు. తీరని కామము వల్ల కావచ్చు. తెగని క్రోధము వల్ల కావచ్చు... వాటిని  జయిస్తే జీవితమంతా తృప్తే ఉంటుంది.


ఇలా ఉండాలని నువ్వు అనుకుంటావు. కాని నిన్నెలా ఉంచాలో ఆ దేవుడు నిర్ణ ఇస్తాడు  

2 comments:

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.