తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 14 April 2011

నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా......?


నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా......?


ఎక్కడ నీలివర్ణపు మేఘాలు పవిత్రంగా...
చిరునవ్వులొలికిస్తూ... 
వర్షాక్షితల దీవెనలు కురిపిస్తాయో....


ఎక్కడ మమతల నునులేత కెరటాలు
తల్లిపాలకి మల్లే..
స్వచ్చంగా పొంగిపొర్లుతాయో...


ఎక్కడ పావురాళ్ళ రెక్కల నీడల్లో..
మనిషి ప్రశాంతంగా బ్రతుకగలడో...


అక్కడ.....


అక్కడే...ఉంటుంది..... నిజమైన 
అనుభవైకవేద్యమైన.... ఆనందానికి నిర్వచనం.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.