తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 18 April 2011

ఎవరు పేదవారు, ఎవరు లేనివారు.... ఇది చదివి మీరే చెప్పండి


ఎవరు పేదవారు, ఎవరు లేనివారు.... ఇది చదివి మీరే చెప్పండి.




ఒక సంపన్నుడైన ఒక వ్యక్తి తన కొడుకుని తీసుకుని ఒక పల్లెటూరికి వెళ్ళాడు.
పేదరికం అంటే ఎలా ఉంటుందో, పేదరికంలో ఎలా బ్రతుకుతారో చూపెట్టడం అతని ఉద్దేశ్యం.
ఊరిబయట ఒక పొలంలో రెండు పగళ్ళు, రెండు రాత్రుళ్ళు ఉన్నారు.  ఒక పేద జంట అక్కడే కాపురం ఉంటోంది ఆ పొలంలోనే పని చేసుకుంటూ.


తిరిగి వచ్చేటపుడు తండ్రి కొడుకును అడిగాడు ఎలాఉంది ఇక్కడికి రావడం అని..


ఆ కొడుకు "చాలా చాలా బాగుంది నాన్నా" అని బదులిచ్చాడు.


పేదవాళ్ళు పేదరికంలో ఎలా బ్రతుకుతారో చూశావా.... అడిగాడు తండ్రి.


"చూశాను నాన్నా" చెప్పాడు కొడుకు.


"అయితే దీని వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు" అడిగాడు తండ్రి.


కొడుకు ఇలా చెప్పాడు....


మనకు ఒకేఒక కుక్క ఉంది.... వాళ్లకు నాలుగున్నాయి.
మన గార్డెన్ మధ్యలో చిన్న స్విమ్మింగ్‍పూల్ ఉంది.  వాళ్లకైతే కళ్ళు చూసినంత దూరం పెద్ద నది ఉంది.
మనం రాత్రిళ్ళు మన తోటలో చిన్న చిన్న దీపాలు వెలిగించుకుంటాం.  వాళ్లకి రాత్రిళ్లు ఆకాశంలో లెక్కలేనన్ని చుక్కలను వెలిగించుకుంటారు.
మనకు కొంచెం భూమి మాత్రమే ఉంది బ్రతకడానికి. వాళ్ళకి అంతులేనంత భూమి ఉంది.
మనం వేరేవాళ్ళ ద్వారా సహాయం పొందేస్తితిలో ఉన్నాం.  కాని వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తున్నారు.
మనం మన తిండి కొనుక్కొని తింటున్నాం.  వాళ్ళు కష్టపడి పండించుకుని మనకు కూడా పెడుతున్నారు.
మనం మనల్ని కాపాడడానికి మన ఇంటి చుట్టూ గోడ కట్టుకున్నాం.   కానీ వాళ్ళ చుట్టూ వారికోసం ప్రాణమిచ్చే స్నేహితులున్నారు.
మనదగ్గర ఉన్నది ఎవరు దోచుకుపోతారో అని మనం క్షణక్షణం నరకంలా భయపడుతూ బ్రతుకుతున్నాం.  వాళ్ళు ఎటువంటి భయాలు లేకుండా ప్రతిక్షణం సంతోషంగా నవ్వుతూ గడుపుతున్నారు.
.........


ఆ తండ్రికి మాటలు రాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు..... కొడుకు మాటల్లోని వాస్తవాలకు.


మనం ఎంత పేదరికంలో ఉన్నమో తెలియజేసినందుకు థాంక్స్ నాన్నా...అన్నాడు కొడుకు.




మనదగ్గర లేని వాటి వాటి గురించి బాధ పడకుండా, మన దగ్గర ఉన్నవాటితో సంతృప్తి గా బ్రతకడమే మేలు.

2 comments:

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.