తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday 28 April 2011

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై మీ కామెంట్...ప్లీజ్...


నేను సాధారణంగా టి.వి. లొ ఎటువంటి సీరియల్ చూడను. కానీ ఈ మధ్య మా ఆవిడ బలవంతం మీద  బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ చూస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఇంట్లోను, ప్రతి భార్యా భర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు సహజం.  సర్దుకుపోతేనే సంసారం బాగుటుంది.  భార్య, భర్త ఇద్దరు పట్టింపులకు, పంతాలకు పోతే వారి మధ్య దూరం పెరగడమే కాకుండా అది ఇంకా చాలా దూరం వెళ్తుంది.

గొడవలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  జీవితంలో ఒక్కోసారి రాజీ పడడం అనేది తప్పనిసరి. మరీ జీవితమే రాజీ అంటే కష్టమే.  చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఎలా పెద్దవై ఎంత దూరం వెళ్తున్నాయో, ఎంతమంది జీవితాలు నాశనమవుతున్నాయో మన కళ్ళెదురుగా ఆ ప్రోగ్రామ్ లో చూపెడుతున్నారు.  ఒక సైకాలజిస్ట్ ని, ఒక లాయర్ ని కూర్చోబెట్టి అందరికి అర్దమయ్యేలా వివరిస్తున్నారు.  చాలామంది జీవితాలు ఈ ప్రోగ్రామ్ వల్ల బాగుపడుతున్నాయి.
సుమలత గారిది చాలా మంచి ప్రయత్నం.  ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ చూడండి. అందరికి చూడమని చెప్పండి.
దీనివల్ల కొంతమేలు జరిగినా మంచిదే కదా. నా అభిప్రాయం చెప్పాను. మీ అభిప్రాయం చెప్పండి.

జి తెలుగు  వారి ప్రయత్నానికి హ్యాట్సాఫ్.......

4 comments:

  1. అవును ఈ ప్రోగ్రాం ఉద్దేశ్యం మంచిది.
    సైకాలజిస్ట్, లాయర్, లాంటి నిపుణులతో కౌన్సిలింగ్ చేయించి పరిష్కారం సూచించటం కూడా బాగుంది,
    కానీ నేను చూసిన కొన్ని ఎపిసోడ్స్ లో వచ్చిన వ్యక్తులు సుమలతకు (వయస్సు తో సంబంధం లేకుండా) పాద నమస్కారం చేయటం (చేయించు కోవటం) ఎబ్బెట్టు గా ఉంది.
    ఉద్వేగం ఆపుకోలేక వాళ్ళు చేసినా ఎడిట్ చెయ్యొచ్చు !!

    ReplyDelete
  2. మధ్య తరగతి కుటుంబాలు, ధనిక కుటుంబాలలో జరిగే ఈ కుటుంబ తగాదాలు కూడ చూపిస్తే బాగుంటుంది. కాని పూర్తి బీద వారి కుటుంబాల నుండి వచ్చిన తగాదాలనే చూపిస్తున్నారు. పై తరగతి వారు ఇలా రోడ్డెక్కటానికి ఇష్టపడటం లేదేమో.

    ReplyDelete
  3. THE MOST SADISTIC PROGRAMME I EVER SEEN ON TV.THE DISPUTE BTWN COUPLES IS EXCLUSIVELY THEIR PERSANAL THING.BY SHOWING THIS,THE ORGANISERS UNIVERALISED THEIR PROBLEMS.THE DISPUTE WHICH WAS CONFINED TO A HOUSE WAS BROUGHT TO PUBLIC...

    ReplyDelete
  4. మొదటగా ఆత్రేయ గారికి, శివరామ ప్రసాద్ గారికి, గారికి ధన్యవాదాలు. ఆత్రేయ గారు చెప్పినట్టు అది చాలా ఎబ్బెట్టు గానే ఉంది. తనకన్నా వయసులో పెద్దవారితో పాదనమస్కారం చేయించుకోవడం బాలేదు. కుటుంబ సమస్యలతో బాధ పడే వారు చాలా మంది ఉన్నారు. అత్తింట్లో ఆరళ్ళకు, భర్త పెట్టే బాధలకు తట్టుకోలేక నరకయాతన పడేవారు చాలామంది ఉన్నారు. అసలు నూటికి 90 శాతం మహిళలకు law గురించి తెలియదు. అటువంటి వారికి గురించి, మహిళలకు ఉన్న హక్కుల గురించి కొంత తెలియజేసే ప్రయత్నం అభినందించదగ్గదే. అదేవిధంగా ప్రసాద్ గారు చెప్పినట్టు సంపన్నులను, మధ్యతరగతి వారిని వదిలేసి కేవలం బీదవారిని మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి పిలుస్తున్నారేమో అనిపించినా ఈ మధ్య వచ్చిన కొన్ని ఎపిసోడ్స్ లో మధ్య తరగతి వారు కూడా ఉన్నారు.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.