సైనా నెహ్వాల్....
దేశానికి గర్వకారణం.... కానీ... ఆమెకు ఇస్తున్న ప్రోత్సాహం ఏ పాటిది? చాలా తక్కువ. క్రికెటర్ల తో పోలిస్తే చాలా చాలా తక్కువ. సూపర్ సీరిస్ లు గెలిచి దేశానికి తిరిగి వస్తే కనీసం స్వాగతం చెప్పడానికి కూడా విమానాశ్రయం లో ఎవరూ లేరంటే.. మన బాడ్మింటన్ అసోసియేషన్ ఎందుకు అసలు. వరల్డ్ కప్ గెలిచినందుకు క్రికెట్ వీరులకు కోట్లు కోట్లు డబ్బు, కార్లు, బంగళాలు, రకరకాల ఆఫర్లు పోటీలు పడి మరీ ప్రకటిస్తూంటే.. మన సర్కారు మాత్రం కనీసం ఆమె ను అభినందిచాలి అన్న విషయం కూడా మరచి పోవడం చాలా బాధాకరం. చైనా క్రీడాకారిణులను ఓడించి దేశానికి వన్నె తెచ్చిన ఆమె ను విస్మరించడం గర్హనీయం.
మిత్రులారా ఆమెకు మనం అందరం మన సంఘీభావం తెలియచేద్దాం రండి. మన తోబుట్టువు సాధించిన విజయాలకు గర్విస్తూ మన సోదరికి అభినందనలు తెలియజేద్దాం. మీ అభినందనలు, మీ స్పందనలు తెలియజేయండి...
జయహో.... సైనా....... మరిన్ని కప్పులు గెలిచి దేశ మువ్వన్నెల పతాకాన్ని విను వీధిలో రెపరెపలాడేలా.. మరిన్ని విజయాలు సాధించు....
వందేమాతరం.....
సైనాకు అభినందనలు.
ReplyDelete