పల్లవి: తల్లి పాలకి మల్లే స్వచ్చమైన దేశం.. మనదేశం
మృదుమురళి రవళిస్తే తియ్యని తెలుగుదనం
చరణం : హిమశిఖరాల్లో పల్లవించిన కులకూజితాలు
ఓం.. ఓం.. అని ఓంకారనాదంతో ప్రభవించిన దివ్యహర్మ్యాలు
దేవళాల గోపురాల్లో కువకువలాడిన ధర్మపదాలు
పవిత్ర కోనేళ్ళలో వికసించిన అధ్యాత్మిక పుష్పాలు "పల్లవి"
చరణం : భూదేవిపై ప్రత్యూషం మన భారతం
విచ్చుకున్న కావ్యపుష్పం మనవేదం
నీలివర్ణపు మేఘమాలే మన సంస్కృతి
తారల్లో ధృవతారే మన సంప్రదాయం "పల్లవి"
paata baagaa raasaaru ..
ReplyDeletetune link koodaa iste chaalaa baavumtumdi anedi naa openian ..
very gud
ReplyDeleteహిమశిఖరాల్లో పల్లవించిన కులకూజితాలు...వాక్యం చూడండి. కల కూజితాలు కదూ..కరెక్టు చెయ్యండి.
ReplyDeleteహితుడు గారు, సత్య గారు... మీ స్పందనకు నా కృతజ్ఞతలు.
ReplyDeleteస్వామి గారు, ట్యూన్ లింక్ అంటే .. "అందగాడు" అనే కమల్‍హాసన్ సినిమా లో "నన్ను రారా బాబు రాజా అంది లోకం" అని ఒక సాంగ్ ఉంది. ఆ ట్యూన్ లో ఈ సాంగ్ ని పాడుకుంటూ ఉంటాను. మీరేదైనా ట్యూన్ చేస్తే చాలా సంతోషం.
సుధ గారు, మీ సూచన పాటిస్తాను. మీ స్పందన కు ధన్యవాదాలు.