తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 23 April 2011

మామిడి పండ్లు కొనే ముందు తస్మాత్ జాగ్రత్త.....

వ్యాపారస్తులు లాభాల కోసం మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి గాను, మామిడి పండ్ల మీద కార్బైడ్ అనే ఒక కెమికల్ చల్లి వాటిని కృత్రిమంగా  రంగు తెప్పిస్తున్నారు.  ఇలా కార్బైడ్ తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.  ఈ కార్బైడ్  తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల కడుపు నొప్పి, అతిసారం, వాంతులు, కడుపులో వికారంగా ఉండడం మొదలైన రోగాల బారిన పడాల్సి వస్తుంది.  


కొంచెం జాగ్రత్తగా కొనడం మంచిది.  కొంచెం పచ్చిగా ఉన్న కాయల్ని తీసుకుని మనమే బియ్యం డబ్బాలోనో లేకపోతే మరేదాంట్లోనో ఉంచి పండించుకోవడం మంచిది.


ఆపిల్ పండ్లు మరి కొన్ని పండ్లు మెరవడానికి వాటి మీద మైనం వేస్తున్నారట.  అలాగే పుచ్చకాయలు తియ్యగా ఉండడానికి "సచ్చారిన్" అనే కెమికల్ కలుపుతున్నారట. .... 


కాబట్టి, మిత్రులారా ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే....... ఏమీ లేదు.... నాకు తెలిసిందంతా చెప్పేసాను.  మన కుటుంబాల గురించి మనమే శ్రద్ద తీసుకోవాలి కాబట్టి....... కొనేముందు మంచివి చూసి కొనండి....

1 comment:

  1. Good info.
    Calcium Carbide when mixed with water gives out Acetylene(C2H2). Acetylene is not especially toxic but when generated from calcium carbide it can contain toxic impurities such as traces of phosphine and arsine.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.