తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday, 29 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 3


చందన అలోచనలు కొన్ని సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను తిరగేసాయి. 

అప్పుడు మాధవి, చందనలు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్.  కార్తీక్ ఐ.ఐ.టి. లో M.Tech. పూర్తిచేసి సివిల్స్ రాస్తున్నాడు. చందనకు కార్తీక్ అన్నయ్య వరుస అవుతాడు. 

         మాధవి పట్టు పరికిణీలో పదహారణాల స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి లా ఉండేది.  అందం, తెలివి, అణకువ,  పెద్దలంటే వినయ విధేయతలు కలబోసిన మధ్యతరగతి అమ్మాయి.

          కానీ కార్తీక్ కొన్ని వందల కోట్ల సంపదకు వారసుడు. మృదుస్వభావి. చక్కగా ఉంటాడు. కానీ అతనిలో తాను ధనవంతుడు అన్న భావన ఎక్కడా కనబడదు. సేవాభావం ఎక్కువ.  వీలైనంత ఎక్కువ మంది సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం అతనిది. ఒక ఆఫీసర్ గా ఎక్కువమంది సేవ చెయ్యవచ్చుననే  అలోచనతోనే అతను సివిల్స్ రాస్తున్నాడు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు.

          ఐ.ఐ.టి. లో చేరిన కొత్తలో చందన పుట్టినరోజు పార్టీలో మాధవిని చూశాడు.
చూడగానే తనని తాను మర్చిపోయాడు. "ఈ అమ్మాయి తన భార్య అయితే తనంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనిపించింది. మాధవి కు కూడా కార్తీక్ ని చూడగానే గుండె ఝల్లుమంది. చూడగానే అతని పట్ల అభిమానం ఏర్పడింది. ఒకరినొకరు మౌనంగా అభిమానంగా చూసుకునేవారు. ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఏర్పడింది.
కానీ ఎవ్వరూ బయటపడలేదు.  

          అలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. మాధవి ఇంజనీరింగ్ పూర్తికావచ్చింది.
కార్తీకి సివిల్స్ లో దేశం మొత్తానికి టాపర్ గా నిలిచి అత్యున్నత సర్వీస్ ఐ.ఎ.ఎస్. కి సెలెక్ట్ అయ్యాడు. 

                                                                                                   ఇంకా వుంది......

1 comment:

  1. నమస్కారమండీ !
    టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
    తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
    ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
    ముందుమాట
    అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
    మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
    -మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.