తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 21 April 2011

నవ్వుల జల్లు


అదేంటిరా...?
రవి: అరే సురేష్‌! 'ఐయామ్‌ గోయింగ్‌' అంటే అర్థం చెప్పరా?
సురేష్‌: 'నే వెళుతున్నా!'
రవి: అదేంటిరా? ఒక్క ఇంగ్లీషు వాక్యానికి అర్థం చెప్పమని అడిగితే నే వెళుతున్నా అంటావేంటిరా? ఎంత నీకు ఇంగ్లీషు వస్తే మాత్రం మరీ అంత ఇది పనికిరాదురా? నాలాంటి తెలియనవాళ్లకు చెప్పాలి కదరా?
సురేష్‌: ఆఁ.......!

దీపం కదా.!
సుబ్బారావు: ఏంటిరా? కరెంటు పోయినా చీకట్లోనే ఉన్నారు. దీపమన్నా వెలిగించుకోకుండా?
రామారావు: మా ఆవిడ చదువుకుంటోందిరా!
సుబ్బారావు : అయితే తప్పకుండా వెలిగించాలిగా మరి..?!
రామారావు: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కదరా!
సుబ్బారావు : ఆఁ.......!

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.