రెండవ భాగం......
రెండడుగులు వేసే సరికి కార్తీక్ క్రింద పడిపోయాడు. అతన్ని జాగ్రత్తగా పట్టుకుని, అందంగా పెంచబడి ఉన్న పూలమొక్కల మధ్య ఉన్న ఒక పాలరాతి మందిరం దగ్గరకు అతన్ని తీసుకెళ్ళారు. దాని మధ్య లో పాలరాతి తో నిర్మించబడిన ఒక సమాధి ఉంది. దానిని చూడగానే చందన కళ్ళు జలపాతాలయ్యాయి.
కార్తీక్ నెమ్మదిగా ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దానిని తడిమి "ఇక మీరు వెళ్ళండి" ఆన్నట్టు సైగ చేసి ఆ సమాధి మీద తల పెట్టుకుని కూర్చున్నాడు.
"ఇంటికి రా కార్తీక్" దీనంగా అడిగింది చందన.
అతను రానన్నట్టు తల ఊపి వెళ్ళిపోమన్నాడు.
ఇక చేసేదేమీ లేక అక్కడే ఉండి ఆ పూలమొక్కలను, సమాధి ని జాగ్రత్తగా చూసుకునే కాపరికి డబ్బిచ్చి, అవసరమైతే వెంటనే ఫోన్ చెయ్యమని ఫోన్ నంబర్ ఇచ్చి, కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇద్దరూ అక్కడ్నించి వచ్చేశారు.
కుమార్ కు అంతా పజిల్ గా ఉంది. అసలేమీ అర్దం కావడం లేదు.
చందన ఏమీ మాట్లాడలేదు.
కుమార్ రెట్టించి అడిగాడు. చందనా అతనెవరు? అసలేమిటిదంతా?
వారిద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.
కాసేపటికి మెల్లగా గొంతి విప్పింది చందన.
మాధవి కాన్సర్ ట్రస్ట్ ని నెలకొల్పింది అతనే మెల్లగా చెప్పింది.
తలమీద పిడుగు పడ్డట్టు అదిరిపోయాడు కుమార్.
ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయలను కాన్సర్ బాధితులకు అందజేసే కార్తీక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఒకటైన మాధవి కాన్సర్ ట్రస్ట్ ను స్థాపించింది అతనే అంటే నమ్మలేకపోతున్నాడు.
చందనతో అదే అన్నాడు.
అంతే కాదండీ! కార్తీక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అధినేతే అతను.
అతనే కార్తీక్. చెప్పింది చందన.
ఒక నమ్మలేని నిజాన్ని వింటున్నట్టుగా ఉందతనికి. దానితో పాటే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత నిమిష నిమిషానికి అధికమవసాగింది.
ఇంకా వుంది......
baagaa rastunnaaru keep it up...next part please...
ReplyDeletechalaa chaala thanx andi. I will try to make my level best. చాలా కష్టపడి రాస్తున్నానే ఎవరు చదవట్లేదు అని బాధ పడుతున్నా. మీ ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మీ మెయిల్ అడ్రస్ ని సబ్‍స్క్రైబ్ చెయ్యండి.
ReplyDelete