తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 30 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 4.... కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..


           కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..
కార్తీక్ ని అభినందించడానికి మాధవి, చందన ఇద్దరు వచ్చారు. "కంగ్రాట్స్ అన్నయ్యా! పార్టీ ఎప్పుడు" అడిగింది చందన.

          మీరెప్పుడంటే అప్పుడే.... చెప్పాడు కార్తీక్.  "కంగ్రాట్స్ అండి" ఎంతో అభిమానంతో చెప్పింది మాధవి.
తనే ఐ.ఎ.ఎస్. పాస్ అయినంత సంతోషంగా ఉందామెకు. అలా కాసేపు మాట్లాడుకున్నారు. 
మాట్లాడుకున్నంతసేపు ఒకరి వైపు ఒకరు ఎంతో ఆర్తిగా చూసుకుంటున్నారు.
కార్తీక్, మాధవి లు ఇద్దరూ ఒకరంటే ఒకరికి మనసులో ఉన్న  ప్రేమను  బయటపెట్టుకోలేక
తల్లడిల్లిపోతున్నారు. 

     రాత్రంతా తనతో గడిపిన హిమబిందువు సూర్యకిరణాల వేడికి కరిగి, తనను వీడలేక వేడే వేళ చిగురుటాకు పడే మనోవేదన వారిద్దరి హృదయాలను అవరించుకుని ఉంది.

          "సరే ఇంక వెళ్తా కార్తీక్ గారు" చెప్పింది మాధవి.

          సరేనండి ఒకింత బాధగా అన్నాడు కార్తీక్.

          చందన గేటు వరకు వెళ్ళి మాధవి ని సాగనంపి వచ్చి, అన్నయ్యా! నీకు, మధు కి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం అని నాకు తెలుసు. ఎవరికి ఎవరు చెప్పు కోవడం లేదు. తనకి నువ్వంటే చాల ఇష్టం. నీకు చెప్పలేక, ఒకవేళ చెప్తే దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే ఎలా అని నలిగిపోతోంది. నువ్వు మాధవి కి ప్రపోజ్ చెయ్యడం కంటే వాళ్ళనాన్న గారితో మాట్లాడు. తను వాళ్ళ అమ్మా, నాన్న మాటను కాదని ఏదీ చెయ్యదు అని చెప్పింది చందన.

          అదేమంచిది అనిపించింది కార్తీక్ కి కూడా.
         ఒకరోజు మాధవి వాళ్ళ ఇంటికి వచ్చాడు కార్తీక్. సమయానికి వాళ్ళ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు.


                                                                                                                                    ఇంకా వుంది......

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.