ఒక కన్నీటి చుక్క కను చివరనుండి చెక్కిలి మీదకు జారి నాతో ఇలా అన్నది.....
"ప్రియతమా! ఇన్నాళ్ళూ నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయాను.
ఎన్నో అనుభవాల్ని నీతో పంచుకుంటూ వచ్చాను. విషాదమైనా, ఆనందం మరీ ఎక్కువైనా
బయటకు రావడానికి ప్రయత్నించాను. కానీ నిన్ను వదలి మాత్రం వెళ్లలేకపోయాను.
స్నేహితుడా! ఈ రోజు నీ గుండెల్లో ఉబుకుతున్న ఈ వేదన్న తరంగం నన్ను కుదిపి వేస్తోంది.
బైటకు తోసేస్తోంది. నేను కదిలి - కారి - జారి - ఆవిరై పోతాను.
నేనలా వెళ్ళిపోవడం
నీ మనసుకేమాతం ఊరటనిచ్చినా........
మిత్రమా... నాకంతకన్నా కావల్సిందేమున్నది...!
(ఇది యండమూరి రాసిన వెన్నెల్లో ఆడపిల్ల లోనిది. నాకు బాగా నచ్చిన వాక్యాలు)
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.