తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday, 23 April 2011

ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి జ్వరంతో హాస్పిటల్ కి వెళ్తే అతని రెండు కిడ్నీ లు తీసేశారు.


రాహుల్ అనే కర్షక్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధి జ్వరంతో హాస్పిటల్  29.10.2006 తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని ఒక పేరు మోసిన హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.  డాక్టర్లు కండిషన్ సీరియస్ అని చెప్పి అతన్ని  I.C.U.   లో ఉంచి మొత్తం అన్ని వైపులా మూసేశారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు.


రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్ తన తండ్రిని పిలిచి, "డాక్టర్లు తన కిడ్నీలు తీసేయడం గురించి మాట్లాడుకుంటున్నారు" అని చెప్పాడు. కానీ పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళ నాన్న అది నమ్మలేదు. కొడుకు భయపడి అలా చెప్తున్నాడు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు.


కానీ ఆ రాత్రే ఆ అబ్బాయి రెండు కిడ్నీలు తీసేసి అతన్ని చంపేశారు.


మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకున్న విద్యార్దులు చాలా తీవ్రంగా స్పందించారు.  వారిని లోపలికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకునేసరికి ప్రెస్ ని టి.వి. చానల్స్ వారిని పిలిపించేసరికి, అప్పుడు ఆ విద్యార్దులను లోపలికి పోనిచ్చారు.


వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి కిడ్నీలు ఉండాల్సిన చోట కుట్లు వేసి ఉన్నాయి. రెండు కిడ్నీలు తీసేసినట్టు అందరికి అర్దమైంది.


కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ అబ్బాయి బంధువు ఒకడికి డబ్బు ఆశ చూపించి అతన్ని లొంగతీసుకున్నారు.  దురాశాపరుడైన అతను వారికి దాసోహమైపోయి ఆధారాలేవీ లేకుండా ఆ అబ్బాయి శవాన్ని తీసుకెళ్ళి కాల్చేశాడు.  ఆ అబ్బాయి కుటుంబం మొత్తం షాక్ లో ఉండడం వల్ల వారు ఏమీ చెయ్యలేకపోయారు.


కొందరు దుర్మార్గుల వల్ల ఒక నిండుప్రాణం పోయింది.


మిత్రులారా, ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్లకు అందరికి చెప్పండి.  ఈ విధంగా మరో ప్రాణం పోకుండా కాపాడండి.


ఇది కూడా నిజంగా జరిగిన విషయమే. దీని లింక్ కింద ఇస్తున్నాను చదవండి.


2 comments:

  1. ఇప్పుడు ఈ విషయాన్ని మీ బ్లాగ్ లొ Register.com web site ప్రకటన కొసం వాడుకుంటున్నారా ?

    ReplyDelete
  2. Sathyaarthi garu, Register.com website గురించే నాకు అస్సలు తెలీదు. అలాంటప్పుడు దానికోసం నేనెలా వాడుకుంటాను. నేను రాసింది, ఇది చదివిన వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశ్యం మాత్రమే. అంతేకాని, ఇందులో ఎటువంటి దురుద్దేశము లేదు.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.