తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday, 29 March 2011

భార్యాభర్తల మధ్య ప్రేమ వయసు పెరిగే కొద్దీ పెరుగుతుందా?


భార్యాభర్తల మధ్య ప్రేమ వాళ్ళ వయసు పెరిగే కొద్దీ మరింతగా పెరుగుతుందేమో అనిపించింది ఈరోజు నాకు ఎదురైన ఒక అనుభవం ద్వారా.


మా ఆవిడకు ఒక ఫ్రెండ్ ఉంది. నా భార్య వయసు 22 ఐతే ఆమె వయసు 55 ఉండొచ్చు. ఆమె భర్త రోజూ తాగుతాడు. ఆమెను తిడుతూనే ఉంటాడు. ఆయన మా కాలనీలో నీళ్ళు వదిలే జాబ్ చేస్తాడు.


  ఆమె ఏదో పని మీద ఈరోజు మా ఇంటికి వచ్చింది. సరిగ్గా అదే టైమ్ కి మేము దోశలు తింటున్నాము. ఆమె కి కూడా నా భార్య తినమని ౩ దోశలు ప్లేట్ లో పెట్టి ఇచ్చింది. ఆమె ఒక్క నిమిషం ఆలోచించి, ఆ దోశలు తీసుకుని వెళ్ళబోయింది. తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు అవ్వా?  అని నా భార్య అడిగితే.. ఆమె, " మా ఆయన కు పెడుతానమ్మా ఇవి. ఆయన తింటే నేను తిన్నట్టే".  ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం వేసింది.  నువ్వు తినమ్మా. తిన్నాక తీసుకెళ్దువు గాని అన్నా కూడా వినక పోయే సరికి, మరికొన్ని దోశలు ఒక బాక్స్ లో ఇద్దరికి వేసి ఇచ్చింది మా అమ్మ.


మనదేశంలో భార్యాభర్తల మధ్య ఇంత ప్రేమ, అనురాగం ఉన్నాయి కబట్టే మన వివాహవ్యవస్థను ప్రపంచం అంతా గౌరవిస్తుంది.


నేను ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నాను. 


 దేవుడా, ఈ ప్రపంచంలో అందరికి ఇంతగా ప్రేమించే మంచి మనసులనివ్వు.  అప్పుడు హత్యలుండవు, అత్యాచారాలుండవు. వరకట్న హత్యలుండవు. అమ్మాయిలపై ఆసిడ్ దాడులుండవు..... 

7 comments:

  1. there was a lot in ur small post,let me share my thoughts on it frnd-దీనిని ప్రేమ అనరు ..అవగాహనతోకూడిన భాద్యత అనాలి..ప్రేమ అనే పదం ఎక్కడపడితే అక్కడ వాడుతున్నందున అసలు దాని రూపమే మారిపోతోంది.ఒకరకంగా ఆమెది త్యాగం అనికూడా అనోచ్చునేమోకూడాను.ఇద్దరు బద్ధ్హ మనస్తత్వాలుకలిగిన ఇద్దరు స్త్రీ/పురుషుడు ఒకే చోటులో దీర్ఘకాలం నివసించడం జరిగితే ..వారిలోని మనస్తత్వాల్లో మార్పుకలిగి ..ఒకరిపైన మరొకరికి తెలియకుండానే భంధం ఏర్పడుతుంది.ఇది ఒకరిపై మరొకరికి ఏర్పడిన జాలె తప్ప ప్రేమ కాదు.

    ReplyDelete
  2. hav u touch wth -"సైకాలజీ"?

    ReplyDelete
  3. సరే అలాగే అనుకుందాం..
    అసలు మీదృష్టిలో ప్రేమంటే ఏమిటి astrojoyd గారు ??

    ReplyDelete
  4. astrojoyd గారు, మీ స్పందనకు నా ధన్యవాదాలు. నా దృష్టి లో ప్రేమంటే ఇచ్చిపుచ్చుకోవడం కాదు. అది ప్రేమ అవదు. అవతలి వారి నుండి ఏమీ ఆశించకుండా ఇవ్వడమే ప్రేమంటే. అది ఏ ప్రేమ ఐనా కావచ్చు. ఆమె మొదట తాను తిని, తరువాత తన భర్తకు తీసికెళ్ళి ఉంటే, దాన్ని మీరు చెప్పినట్టు బాధ్యత అనుకోవచ్చు. కానీ ఆమె, ఆమె భర్త కు పెట్టాలని ఆరాటపడడమే ప్రేమంటే. ఇందులో ఏ స్వార్దమూ లేదు. జాలీ లేదు. నిజంగా ప్రేమ ఉన్న చోట జాలి, స్వార్దము... లాంటి వాటికి చోటుండదు. మానవ సంబంధాలన్నీ స్వార్దపూరితాలు కావు. త్యాగం కావచ్చు అన్నారు. ప్రేమకి పరాకాష్ట త్యాగమే అండి. తను తినడానికి లేక పోయినా, తన బిడ్డకి పెట్టి తాను పస్తులుంటుంది అమ్మ. అది త్యాగం కాదు. ఆ బిడ్డ పై ఆ తల్లికున్న అంతులేని ప్రేమ. తనకి ప్రాణాపాయం అని తెలిసికూడా బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. ఇదంతా ప్రేమేనండి. ప్రేమంటే, పార్కుల్లో, సినిమాహాళ్ళల్లో మొదలై హోటల్ రూముల్లో ముగిసేది కాదు. మీరు చెప్పినట్టు గానే ప్రేమ అనే పదం ఎక్కడ పడితే అక్కడ వాడుతుండడం వల్ల దాని అర్దమే మారిపోయింది. కాని నిజమైన ప్రేమ ఎప్పటికి నిలిచివుంటుంది.

    ReplyDelete
  5. @Naidu garu

    Good Post,

    and I also respect 'astrojoyd' sir opinions at same level in this case. 'love' might be user defined word..other way the same sharing can happen among hostel friends, college, work etc..

    marriage one of those relations. but, the same can be observed at almost all relations with such long companionship is what I personally felt with his comment:) he gave us another angle.

    Your blog looks Interesting.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.