తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 25 March 2011

నీ తలపులు... నా గుండె తలుపుల్ని తీసుకుని చాలా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి.


గాలి తన చేతులతో అలవోకగా నదీ కెరటాలను నిద్ర లేపినట్టు నీ జ్నాపకం నా పెదవుల మీద నవ్వు తెరల్ని కదుపుతోంది.


నీకు తెలుసా?


    నేను నీ గురించి అలోచిస్తూ ఒక అలౌకికమైన స్తితి లో ఋష్యత్వాన్ని పొందుతాను.  
    నాకు తపోభంగం కలిగిస్తూ అక్కడ కూడా నువ్వు నాకు గోచరిస్తావు.


    గులాబీ మీది మంచుబిందువు తన మీద ఎప్పుడు రాలుతుందా.. అని రాత్రంతా ఎదురుచూసే గడ్డి పరకలా నేను నీకోసం ఎదురుచూస్తాను.


    నీ తలపులు.. నా గుండె తలుపుల్ని తీసుకుని చాలా స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి.


    వసంతాలన్నీ వర్షాలు గా, వర్షాలన్నీ శిశిరాలు గా, శిశిరాలన్నీ  వసంతాలు గా మారిపోతున్నాయి.


    ఆనందాలు అరవిందాలవుతున్నాయి.


    నా కనులు నీకోసం వేచి వేచి అరమోడ్పులవుతున్నాయి. అరమోడ్పులైన కళ్ళతో అహర్నిశం నీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను.

2 comments:

  1. అందమైన భావాలకు మరింత అందమైన పదచిత్రాలు...
    మీ చిట్టి కవితలో తొంగిచూస్తున్న అలౌకికమయిన ఆనందానుభూతి మీకు శాశ్వతంగా ఉండాలని కోరుతున్నా.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.