తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday, 16 June 2015

భారతీయ అద్భుతాలు - మిస్టరీ నగరం - శంబాలా నగరం

www.onenandyala.com


హిమాలయాలు భారత దేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని
రక్షిస్తున్నాయి. అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి
.అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన
హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడువులు ఇంతవరకు ఈ
ప్రపంచం లో ని ఏ వ్యక్తి కూడా పూర్తి గా వాటిలో ప్రవేశించ లేక
పోయారు.వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంగ టనులు
జరుగుతాయి అని పెద్ద వాళ్ళు చెబుతారు.అటువంటి వాటిలో చాలా
ప్రముఖమైనది "శంబాలా " నగరం. మన పురాణాలు
తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో "యతి
"రూపం లొ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు
అయితే కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంధాలూ, బౌద్ధ
గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని
లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే " శంబాలా "
దీనినే పాశ్చాత్యులు " హిడెన్ సిటీ" అంటారు.ఎందుకంటే
వందలు, వేల మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న హిమాలయాలలొ ఎక్కడో
మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరకి
కనిపించదు. అది కనిపించాలన్న ,చేరుకోవాలి అన్నా మనం ఇంతో
శ్రమించాలి. మానసికం గా శారీరకం గా కష్టపడాలి. అంతో ఇంతో
యోగం కుడా ఉండాలంట ఆ నగరాన్ని వీక్షించాలి అంటే
ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని , ఎవరికి పడితె వారికి
కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని ,
ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.
ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలం అయిన ఆ నగరం గురించి
కొంత మంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు
మాత్రం సేకరించగలిగారు.
సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు
దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని , ఆ
ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని
ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలా
ను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుందని
చెబుతారు. బౌద్ద గ్రందాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన
చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ,సంతోషాలతో
ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని "ది
ఫర్బిడెన్ ల్యాండ్" అని " ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని
అంటారు. చైనీయులకు కుడా శంబాలా గురించి తెలుసు.
లోకం లొ పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న
సమయం లొ శంబాలా లో ని పుణ్య పురుషులు లోకాన్ని తమ
చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పుడమి పైన
కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంధాలు
చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు
ఇప్పటికే తెలియచేశాయి.ఈ శంబాలా లొ నివసించేవారు ఏలాంటి
రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని వారి ఆయువు మామూలు
ప్రజలు కంటె రెట్టింపు ఉంటుందని వారు మహిమాన్వితులు
విషయాలు అనేక గ్రంథాలు,యెగులు,పుణ్య పురుషులు
ద్వారా తెలుసుకున్న రష్యా 1920 లొ శంబాలా రహస్యాన్ని
తెలుసుకొవడానికి తన మిలటరి ఫోర్సు ని పంపి పరిశొధనలు
చేయించింది.అప్పుడు శంబాలా కి చేరుకున్న రష్యా మిలటరీ
అధికారులకు అనేక ఆశ్చర్య కరమైన విషయాలు తెలిసాయి.అక్కడ
యెగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు.ఈ
విషయాన్ని తెలుసుకున్న నాజి నేత హిట్లర్ 1930 లొ శంబాలా
గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక
బృందాలని పంపించాడు.ఆ బృందానికి నాయకత్వం వహించిన
హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు
సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని
నాజినేత హిట్లర్ కి చెప్పాడు .అంతే కాక హిమ్లర్ శంబాలా లొ మరెన్నో
వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని
గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు.
గోభి ఎడారికి దగ్గరిలోని ఉన్న శంబాలానే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని
పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో
రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు "plaanets of head center
" అంటారు .శంబాలా గురించి ఫ్రాన్స్ కి సంభందించిన చారిత్రక
పరిశోధకురాలు , ఆద్యాత్మిక వేత్త, బౌద్ద మత అభిమాని,రచయత్రి
alexandra devid neel పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె
తనకు 56 ఏళ్ళ వయస్సులొ ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి
లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి
తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు
తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 years బ్రతికింది అని
అంటారు.ఆమె oct 24 1868 లొ జన్మించి సెప్టెంబర్ 8 , 1969 లొ
మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి
టిబెట్ లొ కాలుమోపిన తొలి europe వనిత ఆమె .
అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా
శంబాలా పై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశొధన గురించి
చెబుతూ శంబాలా అనేది భుమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన
అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచం లొ ఏ ఇతర
ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు telipathi
తో ప్రపంచం లొని ఎక్కడి వారితొ నైనా సంభాషించ గలరు అని , ఎ
క్కడ జరుగుతున్న అభివృద్ది అయినా, విధ్వంసం అయినా
క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. శంబాలా ఎనిమిది
రేఖుల భారి కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారం లొ ఆ
నగరం ఉంటుందని తెలిపాడు. హిట్లర్ తన ఆర్మీ ని అక్కడకు
పంపి చాలా విషయాలు సేకరించాడు.అతనికి అద్బుతాలు అంటే చాలా
ఇష్టం.అందుకే అతను వియన్నా లొ మంత్ర,యోగా విద్యలు
నేర్చుకున్నాడు.ఆ ఆసక్తి తోనే అతను కొంత సంస్కృత కుడా
నేర్చుకున్నాడు.అని అంటారు.శంబాలా గురించి పెక్కు
సంఖ్యలో రాయబడిన సంస్కృత గ్రంథాలు ను అధ్యయనం
చేయడానికి కుడా అతను సంస్కృత ం నేర్చుకున్నట్టు ,ఆ
కారణం గానే అతను తరువాత స్వస్తిక్ ముద్రను వాడేవాడు
అంటారు.
ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనం లొ తెచ్చుకోవాలి అనుకున్న
హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంభాలా కు
పయనం కట్టాడు అని అక్కడి ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి
సహయం తో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు
ప్రయత్నించాడు అంటారు.పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త
blavetski ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వ
మానవులు అంతా షాక్ తిన్నారు.అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబాలా
అధ్యాత్మిక వేత్తలు పడనివ్వలేదు.దానితో చేసేది ఏమీ లేక హిట్లర్
వట్టి చేతులతో వెనకకి తిరిగాడు.
వెనకటి కాలానికి చెందిన లామా మింగ్యుర్ డో న్డప్ చెప్పిన దాని
ప్రకారం శంబాలా వయస్సు అర మిలియన్ సంవస్తరాలు .అక్కడ
దేవతలు దిగే వారు .ఆ ప్రాంతం లొ విహరించేవారు . శంబాలా
ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారు.
విష్ణువు కుడా తన పదోవ అవతారం అయిన కల్కి కుడా శంబాలా
నుంచే వస్తాడు అని తెలిపాడు.
మాములుగా కనిపించని శంబాలాకి చేరుకోవడానికి బౌద్ద గ్రంథాలలో
కొన్ని ఆధారాలు ఇవ్వబడ్డాయి.దాని ప్రకారం హిమలయాలలొ ఎ క్కడ
ఉందో తెలియని శంబాలా నగరం చేరుకొవడానికి చాలా ప్రయాసపడాలి. అలా
ప్రయాణం సాగిస్తుండగా తొలుత అంతు దరి లేని ఎడారి
వస్తుంది. (అదె గొభి ఎడారి ) దాన్ని కుడా దాటిన తరువాత పర్వతాలు
ఎదురు అవుతాయి.వాటిని కుడా దాటి హిమాలయాల నడిబోడ్డుకి రావాలి.
అప్పుడు కుడా శంభాలా కనిపిస్తుంది అని చెప్పలేము.ఎందుక
ంటే అధ్యాత్మిక ధోరణి లేని వారు ,పాప కర్మల ఫలం
అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం
మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే
కనిపిస్తాయి. అక్కడి ఆసధారణమైన వాత వరణం వలన శంబాలా సంగతి
అటుంచి మృత్యువు సంభవిస్తుంది అని బౌద్ద గ్రంథాలు
తెలుపుతున్నాయి. కొంతమంది పరిశొధకులు, చరిత్రకారుల
అభిప్రాయం వరకు శంభాలా టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత
సమూహం తో కలిసి ఉండొచ్చని అంటారు. శంభాలానే " శ్వేత
దీపం" అని ద్రువ లొకం అంటారు

3 comments:

  1. దీన్ని బట్టి, హిట్లర్ ఒక ధర్మపరాయణుడని అర్ధమైంది. ఇక చరిత్రని మార్చుకుందాం.

    ReplyDelete
  2. hello,
    above information is correct.
    stil shambala is there.give me full info about this article

    ReplyDelete
  3. చాల అద్చుతంగ ఉంది.అనటం సర్వసాధారణం.మూలశక్తి
    పరాశక్తిని ఉపాసీంచె వారికి, ఈ విషయం ఎంతగానో ఉపకరిస్తాయి.అందుకు మీకు దన్యావాదములు.

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.