తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా...........?
హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.
తిరుమలకు చేరుకోవాలంటే కొందరు భక్తులు బస్సుల్లోనూ,టాక్సీలలోనూ,
నడుచుకుంటూ వెళ్తుంటారు. అందరికీ తెలిసిన నడక దారి ఒక్కటే అదే అలిపిరి.
కాని ఎంతమందికి తెలుసు తిరుమల చేరుకోవాలంటే ఇంకా కొన్ని దారులు
ఉన్నాయని.......?
మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం............
శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి.
అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి. అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది.
అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి
గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా
కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు.
తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు
కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఇక్కడి నుండి శ్రీ కృష్ణదేవరాయలు
నడిచి శ్రీవారిని దర్శించుకునే వారు.
ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు
బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున
కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట,
కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది.
ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని
ప్రాంతాల రేనాడు వారు ఈ దారి మీదుగానే తిరుమల చేరుకునేవారు.
కడప జిల్లా
సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలా దొడ్డి నుండి తుంబురు
తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడినుండి తిరుమలకు దారి వుంది. దీన్ని
తుంబుర తీర్థం అంటారు.
అవ్వాచారి కొండ నుండి కూడా ఒక దారి ఉంది. దీన్నే
అవ్వాచారి కోనదారి అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో
అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి
కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో
నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది.
ఇవేకాక ఏనుగుల దారి
కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి
అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన
మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. కాబట్టి
దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు.
తలకోన నుండి కూడా తిరుమలకు
మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల
వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు
తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు,
ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు
వస్తుంటారు.
hello my dear friends
ReplyDelete