www.onenandyala.com
'రంజాన్' ఉపవాసపు నిబంధనలు -
వివిధ రకముల ఉపవాసములు (Types of Fasting)
విధి ఉపవాసములు
విధి ఉపవాసములు
- రమదాన్ ఉపవాసములు
- పరిహారపు ఉపవాసములు
- మొక్కుకున్న ఉపవాసములు
విధి కాని ఉపవాసములు
- సున్నహ్ ఉపవాసములు
- అయిష్టపు ఉపవాసములు
- నిషిద్ధింపబడిన ఉపవాసములు
సున్నహ్ ఉపవాసములు :-
- హజ్ కి వెళ్ళని వారు 9 జిల్ హజ్ అరఫా రోజు ఉపవాసము ఉండుట
- షవ్వాల్ మాసములో 6 రోజులు ఉపవాసము ఉండుట
- ముహర్రంలో ఆషురా రోజు ఉపవాసముండుట
- దిల్ హజ్ యొక్క మొదటి 9 రోజులు ఉపవాసము ఉండుట
- ప్రతి నెల 13,14,15 తారీఖులలో ఉపవాసముండుట
- ప్రతి వారంలో సోమవారం మరియు గురువారం రోజు ఉపవాసము ఉండుట
- దావుద్ అలైహిస్సలాం లాగా ఒక రోజు విడిచి ఒక రోజు ఉపవాసము ఉండుట
- ఎవరికైతే పెళ్ళి చేసుకొనే స్థోమత లేదో వారు ఉపవాసములు ఉండి తన మనోవాంఛలను తగ్గించుకో వచ్చును
ఈ క్రింది తెలుపబడిన రోజులలో ఉపవాసముండుట – మకరూహ్:-
- హజ్ చేసే వారు అరాఫ్ రోజు ఉపవాసము ఉండుట
- జుమహ్ రోజు, శనివారం రోజు, ఆదివారం రోజు ప్రత్యేకించి ఉపవాసము ఉండుట
- ఎడతెరిపి లేకుండా ఉపవాసములుండుట (అకారణముగా)
- షాబాన్ చివరి రోజు అనుమానం కొద్ది ఉపవాసముండుట (మొడటి రమదాన్ అవ్వచ్చు అనుకొని)
- భర్త అంగీకరం లేకుండా భార్య (నఫీల్) ఉపవాసములుండుట
- ఎప్పుడూ ఉపవాసములుండుట
ఈ క్రింది తెలుపబడిన రోజులలో ఉపవాసముండుట నిషిధ్ధించబడినది:-
- రెండు పండగల రోజులలో ఉపవాసముండుట
- బహిష్టు స్త్రీ లేదా ప్రసవించిన స్త్రీ, పరిశుభ్రం కాక ముందు ఉపవాసముండుట
- ఉపవాసము కారణంగా మరణం సంభవించే ప్రమాదమున్న ఎడల
- అయ్యామ్ తష్రీఖ్ జిల్ హజ్ 11,12,13 రోజులలో ఉపవాసముండుట
Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.