తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday, 18 June 2015

రామ నామము యొక్క ఇంకొక విశేషమేమంటే ....

www.onenandyala.com


 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే!! ఈ పాదాలకు అర్థం శ్రీరామ అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే అది వేయి సార్లు జపించిన దానికి సమానమని అర్థం.. అది ఎలా అంటే పూర్వం మన పదాలకు గణాలనీ.. ప్రతి అక్షరానికి ఒక విలువను కెటాయించి వాటిని సరైన క్రమంలో అమర్చి వ్యాకరణాన్ని, శాస్త్రాలను తయారు చేసారు.. దీనినే కటపయాది సూత్రం అంటారు..‘ పై ’విలువ కూడా ఈ పద్ధతి ద్వారానే కనుగొన్నారు.. ఇది ఎంత ఖచ్చితమైన దంటే దశాంశం ప్రక్కన ఇరవై మూడు అంకెలను కూడా గుర్తించదగినంత ఖచ్చితమైన సూత్రం.. అందుకే రామ నామ విలువను అంత గొప్పగా వివరించగలిగారు...
రామ నామము యొక్క ఇంకొక విశేషమేమంటే ఈ పదం నారాయణ మంత్రంలో ‘నారాయణ’ లోని రెండవ అక్షరం .. పరమ శివుని పంచాక్షరీ మంత్రం నమఃశివాయ లోని రెండవ అక్షరం రెండింటి కూర్పే.. రామ మంత్రం.. సాధారణంగా ఒక పద్యం లో వాక్యంలోని రెండవ అక్షరాన్ని యతి అంటారు... నారాయణ మంత్రం లోని యతి.. నమఃశివాయ మంత్రం లోని యతి ల కూర్పే.. రామ మంత్రం.. సాక్షాత్తూ పరమ శివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన మంత్రంగా దీనిని చెపుతారు.. అందుకే అన్ని మంత్రాలలోకెల్లా రామ మంత్రం చాలా బలమైనది అని చెపుతారు.. ధ్యానమును ప్రారంభించే వారికి మొదట మంత్ర జపాన్ని కానీ నామ జపాన్ని కానీ అదీ శ్రీరామ మంత్రం తోనే ప్రారంభించే విధంగా గురుదేవులు ఉపదేశిస్తారు.. అందరికీ శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తుః (పరిపూర్ణానంద స్వామి వారి ప్రవచనములలోచెప్పబడిన రహస్యమిది!!)

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.