www.onenandyala.com
'రంజాన్' ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting
ఉపవాసపు నిబంధనలు:-
- ముస్లిం అయి వుండాలి.
- యుక్త వయసుకు చేరి వుండాలి.
- బుద్ధి గలవాడై ఉండాలి (పిచ్చి వాడుగాని మతి స్థిమితము లేని వాడై వుండారాదు.)
- బాటసారి కోసం ఉపవాసం తప్పని సరికాదు.
- ఇది స్త్రీలకు పరిమితము – బహిష్టు వచ్చిన సమయమున ఉపవాసము ఉండరాదు.
ఉపవాసము సరియగునకు నిబంధనలు:-
- ఇస్లాం స్వీకరించుట
- ముందు నుంచే (వాజిబ్) ఉపవాసములు సంకల్పము చేయుట
- బుద్ది కలిగి ఉండుట.
- ఉపవాసము భంగపరిచే వాటి గురించి తెలిసి ఉండుట.
- బహిష్టు రాకుండా ఉండుట మరియు ప్రసవించిన తర్వాత శుభ్రతపొందుట.
ఉపవాసపు విధానం మరియు సున్నతులు :- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆలైహి వసల్లం ఇలా ఉద్బోదించారు “ ప్రజలు ఇఫ్ తార్ తొందరగా చేయుట వలన శుభాలు పొందుతారు. (బుఖారి & ముస్లిం)
ఇఫ్ తార్ ముందు దుఆ చేయుట:-ఉపవాసము ఉన్నవారు ఇఫ్ తార్ కి ముందు చేసే దుఆ రద్దు చేయబడదు.
రమదాన్ ప్రత్యేకంగా శ్రద్ధగా చేయవలసిన శుభకార్యాలు:-
- సహరీ చివరి ఘడియలలో చేయవలెను.
- అధికంగా నఫిల్ సలాహ్ చేయవలెను
- ఖుర్ ఆన్ పఠనము చాలా ఎక్కువగా చేయవలెను
- ఉమ్రా చేయవలెను
- తరావీహ్ సలాహ్ చేయవలెను
- ఎతెకాఫ్ లో కూర్చో వలెను.
- పుణ్యకార్యములు చాలా ఎక్కువగా చేయవలెను
ఉపవాసములో చేయకూడని పనులు:-
- గర్ గరా చేయుట గొంతు వరకూ నీళ్ళు వెళ్ళ నివ్వుట లేదా ముక్కులు నీరు లోపలకు పీల్చుట.
- అబద్ధము చెప్పుట, చాడీలు చెప్పుట, అశ్లీల మాటలు మాట్లాడుట.
- అశ్లీల పనులను ప్రోత్సహించుట ఉదా: టివి చూడుట, పాటలు వినుట మొదలైనవి.
పైన తెలిపిన వాటి నుండి మిమ్మల్ని మీరు తప్పక కాపాడుకోవలెను.
ఎలాంటి పరిస్థితులలో ఉపవాసము లేకుండా ఉండవచ్చును :-
- ప్రయాణము కారణముగా
- అనారోగ్యము కారణముగా
- ఎవరినైనా ప్రాణాపాయము నుండి కాపాడుట కొరకు, గర్భిణి స్త్ర్రీ లేదా పాలు ఇచ్చే తల్లి. (వీరు తమ ఉపవాసములను తర్వాత పూర్తి చేసూకోవలెను.)
ఉపవాసమును భంగపరిచేవి :-
- తినుట, త్రాగుట, ఇటువంటి ఏ పనైనా
- భార్యతో కలియుట
- బలవంతంగా వాంతి చేయుట
- అశ్లీల మాటలు, లేదా చేష్టలు లేదా టివి చూచుట వలన మనీ వెలువడుట
- స్త్రీకి మాసపు నెత్తురు లేదా గర్భిణీ స్త్రీకి నెత్తురు రావడంవలన
- ఎక్కువగా నెత్తురు పొవుట లేదా తీయుట
- ఉపవాసాన్ని ఉపసంహరించుకున్నట్లు సంకల్పము చేసుకొనుట (అతను తినకపొయిన త్రాగకపొయినా కూడా)
పైన తెలుపబడిన ఉపవాసమును భంగపరిచే కార్యములు ప్రతి ముస్లింనకు తెలిసి వుండవలెను.
ఉపవాసములకు బదులు :-
రమదాన్ మాసములో ఒకవేళ ఏవైనా దినములలో ఉపవాసము పాటించని యెడల, ఎన్ని రోజులు ఉపవాసం పాటించలేదో అన్ని రోజుల పాటు ఆ తర్వాత అయినా తప్పక ఉపవాసం ఉండవలెను. ఎవరైనా రమదాన్ మాసములో ఉపవాస సమయంలో భార్యతో కలిసిన యెడల అతను
- ఒక బానిసను విముక్తి చేయాలి.
- లేనిచో ఎకధాటిగా రెండు మాసములు ఉపవాసములు ఉండవలెను.
- లేనిచో అరవై బీద ముస్లింలకు భోజనము పెట్టవలెను
Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
No comments:
Post a Comment
దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.