తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Tuesday, 30 June 2015

మంచుకురిసే వేళలో...మల్లె విరిసేనెందుకో......సుగుణాల మల్లె....నిజంగానే......సిరిమల్లె...పువ్వే..

www.onenandyala.com

పండు వెన్నెల్లో చిరుగాలికి మనసారా నవ్వుతూ తలలూపే విరబూసిన మల్లెపూలను చూస్తే మనసు పులకరించిపోతుంది.
మైమరపించే సువాసన మనల్ని ఎక్కడో విహరించేలా చేస్తుంది.


మగువల మనసు దోచే అపురూప పుష్పం. మల్లెపువ్వును ఇష్టపడని అతివ ఉండదు అంటే అదేం అతిశయోక్తి కాదు.
తెలుపుకే అసూయపుట్టించే శ్వేతవర్ణ పుష్పం మల్లెపువ్వు.
మల్లెపూలు పసిపాపల్లా నవ్వేపువ్వులు. అతి సున్నితమైనవి.
గుండుమల్లె, సెంటుమల్లె, కాగడామల్లె, దొంతరమల్లె, చమేలి, విరజాజి, సన్నజాజి....... ఇలా ఎన్నో పేర్లతో మల్లెపూలను పిలుస్తారు.
మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వు మల్లెపువ్వు.
థయ్‍లాండ్ లో అమ్మకు ప్రతిరూపం గా మల్లెపువ్వును భావిస్తారు.
పాకిస్తాన్, టునీషియా, ఫిలిప్పైన్స్ దేశాల జాతీయపుష్పం మల్లె.
మనసు దోచేయడంలో మల్లెపువ్వు కు సాటిరాగలపువ్వు మరొకటి లేదు.
మల్లెచెట్టు వేరు బీరువాలో ఉంచితే సంపద పెరుగుతుందని ఉత్తరాది వారి నమ్మకం.
భర్త మల్లెపూలు తెస్తే ఆ భార్య మురిసిపోతుంది. జడలో తురుముకుని తన అందం ఇనుమడింపచేసుకుంటుంది.
మల్లెపూలను పసిపాపల్లా పెంచుతారు. చక్కగా పందిరి అల్లిస్తారు.  దీనికి నీరుతడి ముఖ్యం. ఇసుకనేలల్లో మల్లెతోటలు ఎక్కువ.


ప్రతిపెళ్ళిలోను మల్లెలు సందడి చేస్తాయి. అందరిని మురిపిస్తాయి.
అంతేకాదండోయ్...... మల్లెల వల్ల అనేక లాభాలున్నాయి.
మల్లెపూలను అరోమా థెరఫీ లో, ఆయుర్వేదం లో విరివి గా ఉపయోగిస్తారు.
మల్లెలు నరాలపై మంచి ప్రభావం చూపుతాయి.
వేసవిలో మల్లెపూల పరిమళం మనసుకు చాలా ఉపశమనం కల్గిస్తుంది.
కీళ్ళనొప్పులు, చర్మ రోగాల నివారణలోను ఉపయోగపడుతుంది. మల్లెల నుండి తీసిన నూనె తలనొప్పికి మంచి నివారణా మార్గం.
మల్లెపూల ఆకులు డికాషన్ చేసుకుని తాగితే నులిపురుగులు చనిపోతాయ్......


ఇన్ని సుగుణాల మల్లె....నిజంగానే......సిరిమల్లె...పువ్వే................

తెలుగులో టాప్ 10 మెలోడీస్....ఏవి?


నాకు నచ్చిన టాప్ 10 మెలోడీస్....

ఆకులో ఆకునై....
కరిగిపోయాను కర్పూరవీణలా...
మంచుకురిసే వేళలో....
మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు....
వేణువై వచ్చాను ....
తొలిసంధ్య వేళలో.....
చుక్కల్లే తోచావే....
భద్రగిరి రామయ్య...పాదాలు కడగంగ....
ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మా...
వయ్యారి గోదారమ్మా...ఒళ్ళంతా ఎందుకమ్మా...కలవరం


మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక పది  మెలోడీ సాంగ్స్ ని చెప్పండి.

చరిత్రలో నేటి (June 30th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  30thప్రాముఖ్యత
1917: తొలితరం రాజకీయ మరియు సామాజిక నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణం. (జ.1825).
1928 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు జె.వి. సోమయాజులు జననం.
1934 : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత చింతామణి నాగేశ రామచంద్ర రావు జననం.
1969 : శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు సనత్ జయసూర్య జననం.
1982 : తెలుగు సినిమా కథానాయకుడు, హాస్య నటుడు అల్లరి నరేష్ జననం.
1984 : తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు రాయప్రోలు సుబ్బారావు మరణం.

1988 : తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు మామిడిపల్లి వీరభద్ర రావు మరణం.

Monday, 29 June 2015

శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం - యాగంటి

www.onenandyala.com

శ్రీ ఉమా మహేశ్వర దేవాలయం - యాగంటి
కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి
గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి.
ఆహ్లాదకరమైన ప్రకృతి సౌనద్ర్యంతో పరవశింపచేసే
పుణ్యక్షేత్రాలలో యాగంటి.
యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని
లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర
స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని కాని తయారయిన
విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని
విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు
పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి
ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప
భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన
ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో
ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి
నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
* అగస్త్య పుష్కరిణి
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో
ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది.
ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని
అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా
పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం.
ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో
స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం.
పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం
వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి
వున్నది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ
మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ
రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి.
* సహజసిద్ధమైన గుహలు
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు
ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో
అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం
ప్రతిష్టించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల
పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహ లో
బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు
ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని
శంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు.
* కాకులకు శాపం
ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని
కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి
ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన
అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా
ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ
విగ్రహాన్ని మలుస్తూ వుండగా బొటనవేలుకి గాయమైందట.
తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో
వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో
కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి
ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ
శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని
చెబుతుంటారు.
* యాగంటి బసవన్న
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన
బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని
అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ
వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ
చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది.
కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని
బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్థావించబడి ఉంది.
యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి
బసవన్నకు ఉంది.
యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన
పల్లి లో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి
సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది.
కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి
క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

పరశురాముడికి మానవత్వం లేదా? కసాయివాడా? తల్లిని ఎందుకు చంపాడు?

www.onenandyala.com

ప్రపంచంలో తల్లిని మించిన వారు ఉండరు. దైవం తర్వాత మరో దైవం అంటే అది ఖచ్చితంగా కన్నతల్లే.. ఇంకా చెప్పాలంటే, దైవం కంటే 
ఎక్కువ. జన్మనివ్వడంతో ఆమె బాధ్యత పూర్తవదు. ఎన్నెన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేస్తుంది. అందుకే ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేం అంటారు. అలాంటిది, పరశురాముడు కన్నతల్లిని గొడ్డలితో అడ్డంగా నరికేశాడు. 


పరశురాముడికి మానవత్వం లేదా? కసాయివాడా? తల్లిని ఎందుకు చంపాడు? దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి. ఓరోజు జమదగ్ని, పూజ చేసుకునేందుకు, భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా, గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు.
రేణుకాదేవి, భర్త చెప్పినట్లు, నీళ్ళు తెచ్చేందుకు, గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది.
కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక, భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా, వేగంగా ఆశ్రమం చేరింది. ఒనుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామగ్రి దగ్గర ఉంచింది.
జమదగ్ని దివ్యదృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలీగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ "పరశురామా! ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నరికేయి" అని ఆజ్ఞాపించాడు.
పరశురాముడు మరొకర్ని, ఇంకొకర్ని అయితే అలాగే నరికేసేవాడు. కానీ, ఆమె స్వయంగా తల్లి కావడంతో ఆ పని చేయలేకపోయాడు. తండ్రి మాతా విన్నట్లు ఊరుకున్నాడు.
కానీ, జమదగ్ని కోపం తగ్గలేదు. "పరశురామా, చెప్తోంది నీకే.. వెంటనే పరశువు (గొడ్డలి) తీసుకో... మీ అమ్మని, సోదరుల్నీ కూడా నరుకు.. ఇది నా ఆజ్ఞ" అన్నాడు.
పరశురాముడికి తండ్రి తపశ్శక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్నతల్లిని, సోదరులని తన పరశువుతో నరికేశాడు.
జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు. అందుకే, "పరశురామా, నా మాట మన్నించినందుకు సంతోషం.. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.
పరశురాముడు సందేహించకుండా, "నాన్నా, దయచేసి అమ్మని, సోదరులని మళ్ళీ బతికించు.. అంతకంటే ఇంకేం అక్కర్లేదు" అన్నాడు.
జమదగ్ని కోపగించుకోలేదు. "తథాస్తు" అన్నాడు. పరశురాముని తల్లి రేణుకాదేవి, సోదరులు పునర్జీవితులయ్యారు. అయినా పరశురామునికి సంతోషం కలగలేదు. దుఃఖంతో రగిలిపోయాడు.
ఒక స్త్రీని, అందునా కన్నతల్లిని చంపిన తనకు పుట్టగతులు ఉండవనుకున్నాడు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి అన్నీ వదిలేసి, సర్వసంగపరిత్యాగిలా కొండల్లోకి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు.

చాలాకాలం తర్వాత వేయి చేతులున్న కార్తవీర్యార్జునుడు జమదగ్ని హోమధేనువును తీసికెళ్ళిపోయాడు.దాంతో జమదగ్ని కార్తవీర్యార్జునుని వధించాడు. దాంతో కార్తవీర్యార్జునుడి కుమారులు వచ్చి జమదగ్నిని హతమార్చారు. ఇది తెలిసిన పరశురాముడు, తన తండ్రిని చంపినా కార్తవీర్యార్జునుని కొడుకుల్ని చంపాడు.

Sunday, 28 June 2015

స్వామి వారికి జరిగే పూలంగి సేవ ..శుక్రవారం అభిషేకం కి గాల కారణాలు

www.onenandyala.com

స్వామి వారికి జరిగే పూలంగి సేవ ..శుక్రవారం అభిషేకం కి గాల కారణాలు••••

ॐ క్రీ.శ. 966 లో తయారు చేసి శాసనం ప్రకారం ఒక రాజ కుమారి " సమవాయ్ " అనేఆమె ఒక చిన్న భోగ శ్రీనివాసుని విగ్రహాన్ని చెయించి సమర్పించిననది అప్పటి నుండి మూలవరులకు .(శిలావిగ్రహనికి)రోజూ అభిషేక అలకారాలు లేకుండా ఆభోగమంత భోగ శ్రీనివాస విగ్రహానికిజరపడం ప్రారంభం చేశారు..ॐ మూల విగ్రహన్నికి భోగ శ్రీనివాసుని విగ్రహాన్నికి పట్టుదారం తో అనుసంధానం కల్పించే ఏర్పాట్లు చేశామనీ శాసనం .....ॐॐశ్రి మూలవిగ్రహన్నికి వారం లోఒక రోజు అభిషేకం చేయడం అప్పటి నుంచి ఆచరణలోకి వచ్చింది... .అభిషేకంముందు సాయంత్రం అనగా .గురువారం నాడు సడలింపు స్వామి అలంకారాలు తీసేసి-సాయంత్రానికి పూలతో మాత్రం అలంకారం చేసే సంప్రదాయం "దానినే పూలంగి సేవ, పూలంగి దర్శనం" అంటారు.. స్వామివారి కళ్లను కప్పుసే కర్పూరనామం కూడా చాలా వరకు తీసేసి చిన్ననామం మాత్రంఉంచి నేత్రదర్శనానికి సానుకూలం చెస్తారు ఇదంతా శుక్రవారం అభిషేకంకి ఏర్పాటు.. శుక్రవారం ఆ చిన్న నామం,.పూల,అలంకారం,వస్ర్తాలంకారాలు తీసేస్తారు•• చిన్న లంగోటి వస్త్రం మాత్రం స్వామివారు ధరిస్తారు. క్షీరాభిషేకం తర్వాత మొలకు కట్టిన ఆ చిన్నవస్త్రం కూడా తీసేస్తారు అప్పుడు స్వామివారి నిజరూపదర్శన నిజ పాద దర్శనం... పూర్వదేవ గురోర్వారః సమ్ర్పాప్తస్తు గతే దినే తద్దినే వేజ్ఞటేశస్య ప్రశస్త మభిషేచమే! తద్దర్శనార్థం యోః కన్యాః సర్వా జగ్ముర్మహేసుర!" ॐॐ శ్రీ శ్రీనివాసయ నమో నమః ॐॐ...

శ్రీమద్భాగవతం - 32

www.onenandyala.com .


ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. . ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగామునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అంది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టింది. ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు. అంది. అపుడు శంకరుడు ‘దేవీ, నీవు చెప్పినది యథార్తమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. కానీ నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. మాట్లాడరు. వాళ్ళు మనలను చాలా దారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంతగొప్పవాడయినా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు’ అని చెప్పాడు. అపుడు ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అంది. అపుడు శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు.
వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరవారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం వుంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్త బ్రహ్మాండములను కాల్చివేయ గల శక్తి గలది. ప్రమథగణములు చూశాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెపుతున్నాను నీకొక మాట ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారం లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమ పవిత్రుడయిన శంకరునిసాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. అందుకని నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసం వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నితిలోంచి అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పై క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథ గణములకు ఎక్కడలేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్ర గణములను తరిమికోట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడయిపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికే హడలిపోయారు అందరూ. వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడి కి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ, నాకు ఏమి ఆనతి’ అని అడిగాడు. ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు శంకరుడు.
వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ‘ఉపద్రవం వచ్చేసింది’ అనుకుంది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడుసభలో శంకర నిండా జరుగుతుంటే కళ్ళు ఎగుర వేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు. అప్పుడు భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా, నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగ నోరు తెరచి నవ్వావు. ఇప్పుడు నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతమయిపోయి వుంది. ఎలా త్రుంచాలా అని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్న పశువు శరీరమును ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను అని గుండెల మీద కుడి కాలు వేసి తొక్కిపట్టి తోటకూర కాదను తిప్పెసినట్లు కంఠమును తిప్పేసి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారవేశాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించిన వాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి. లేకపోతే పాడైపోతాము. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, పాపకర్మ చేశాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు’ అని అడిగారు.
అపుడు బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం ఉంది. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో వాని దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పదిపొంది. ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళమీద పడిపోతే మరల రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. అపుడు వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వీరిని తీసుకొని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా, తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టిస్థితిలయ ఈ మూడూ నీయందు జరుగుతుంటాయి. తెలియనటువంటివారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు బ్రహ్మగారు.
మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. అందుకని దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగాన్ని పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేతములు ఇస్తాను. కానీ ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపటికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వఛి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ నీవు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక! స్వామీ నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు శంకరుడు. తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అటుఅవంటి గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.

చరిత్రలో నేటి (June 28th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  28thప్రాముఖ్యత
1914 : ఆస్ట్రియా రాజు ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ ను సెర్బియా దేశస్థుడు హత్యచేశాడు. ఈ సంఘటనే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది.
1921 : భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు జననం(మ.2004).
1931: ప్రముఖ తెలుగు చిత్ర రచయిత మరియు నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ జన్మించాడు (మ. 2011).
1972 : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన పి.సి.మహలనోబిస్ మరణం(జ.1893).
1976 : భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.

2005 : భారతీయ పౌరసత్వ చట్టము అమలులోకి వచ్చింది

Saturday, 27 June 2015

"చెల్లీ....ఓ పదిరూపాయలు

www.onenandyala.com


"చెల్లీ....ఓ పదిరూపాయలు దానం
చేయవా ప్లీజ్." -- అడిగాడు బెగ్గర్ .
" ఇదిగో ఈ వెయ్యిరూపాయలుంచుకో !"-- ఇచ్చింది కమల.
" అదేంటే పదిరూపాయలడిగితే వెయ్యిచ్చావ్.కొంపముంచి అదికానీ చెల్లని నోటా!?"-అడిగింది కమల మరదలు రాంసీత.
" నన్ను చెల్లీ అని పిలిచి గుండెకదిలించాడు.వెయ్యి అందుకే ఇచ్చా.లేకుంటే అందరూ మామ్మగారూ.. బామ్మగారూ అంటూ పిలుస్తూ నా మనోభావాలు దెబ్బతీస్తున్నారు"-
అంటూ వాపోయింది 60 ఏళ్ల కమలమ్మ.

Friday, 26 June 2015

శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓడు ( పగిలిన కొత్తకుండ మూకుళ్ల) లో నైవేద్యం ఆచారం-- రహస్యం...ॐ

www.onenandyala.com
శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓడు ( పగిలిన కొత్తకుండ మూకుళ్ల) లో
నైవేద్యం ఆచారం.కీ గాల రహస్యం...ॐॐ
●●●
పూర్వం.కాలం లో శ్రీశ్రీశ్రీనివాససు ఉనికి ని తెలుకోని తోండమాను చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మాణం చెయించె
ప్రతి రోజు తిరుమలలో బంగారు పూలతో స్వామిని స్వయంగా అర్చన పూజచెసెవాడట.....కోంత కాలానికి ఈ ఆంతరంగిక మహభక్తునికి కూడా కోంత గర్వం వచ్చింది. తనంతటీ భక్తులుడె లేడని తానుకట్టీన స్వామివారి ఆలయానికి బ్రహ్మదిదేవతలు కూడ రాత్రి వచ్చి పూజలు చేసి వెళ్తారని భావించేవాడట...•••
••••••••••ॐॐॐ
ఒకనాడు తోండమాను చక్రవర్తి అలా కోత్తగా తెచ్చిన బంగారుపూలతో అర్చనచేయడానికి క్రితంరోజు పుష్ప నిర్మాల్యం
శుభ్రం చేస్తుంటే.....ॐమట్టీతో చేసిన పూలు,బంకమట్టిఅంటుకున్న తులసీదళాలు...కనిపించడం తో
తాను స్వామికి ఆంతరంగిక భక్తుడు అవడం వల్ల స్వామి నే ప్రశ్నంస్తాడు .""ఈమట్టిపూలు బంకమట్టి అంటుకున్న తులసి.ఏమిటి అని?••••

\/...దానికి స్వామి చిరునవ్వుతో'' అవి యిక్కడ అర్పించిన పూలు.కావు నా" ఆప్తభక్తుడు భీమ "*కురవరపునంబి తన గుడిసెలో నాకు సమర్పించిన తులసి అని చెప్పారు...
చక్రవర్తి ఆ గ్రామముని కి వెళ్లెతాడు అక్కడచిన్నపూరిగుడిసె',
కుమ్మరిసారె,చెసిఎండపెట్టిన కుండలు మృకుళ్లు ,ఎవరు కనిపివకపొయెసారికి...గుడిసెకున్న చిన్న తలపు తీసుకోని "వంగి" ప్రవేశిస్తుంటే చూరికి తగిలి తన రత్నకిరిటం పడిపో .యింది.ఆ అలికిడివిన్న భీమ పూజ,చేస్తున్నవాడల్లా లేచి రాజు ని ఆదరంగా ఆహ్వానించారు.కుమ్మరిభీమ ఒక చిన్న చెక్క వేంకటేశ్వరస్వామి మట్టిపూలతో తులసితో అర్చన చేస్తున్నడా ని గ్రహిస్తాడు రాకకు కారణమడిగిన భీమకు,చక్రవర్తి తిరుమలలో జరిగిన.సంగతి చెప్పి !స్వామి నీ పూజ ను కోండపై స్వికరిస్తునారుఅని చెప్పారు ఆ విషయం విన్న భీమ ఆనందంనికి అవధులు లేవు "తండ్రి నా మీద అంత అనుగ్రహమా ?నీ దర్శన భాగ్యం లేదే కొండకు వచ్చి చూసె స్తోమత లేదు అనుకుంటూఉండగా" స్వామి గుడీసె లో ప్రత్యేకమైనాడు".భీమ సంభ్రమాశ్చర్యాలతో సాష్టాంగం చెస్తాడు••
ॐॐॐॐॐॐॐॐॐ
స్వామిఆకలిగా వుంచవయ్యా తింటానికి పెటుకోగలదు భీమ అని అంటాడు అప్పుడు భీమ తన భార్య పిలిచి వేడివేడీగా జొన్న సంచీ చేయించి కొత్త కుండ పగలగొట్టి సగం చేసి ఆ ఓడు
స్వామికి సమర్పించాడు ఆరగించిన స్వామి సంతుష్టుడై మోక్షానికి వెళ్దామని విమానం తెప్పించి ఆ దంపతులకు సాయజ్యమోక్ష సద్గతి కల్గించారు..••••
ఇదంతా ప్రత్యేక్షంగా చూస్తున్న చక్రవర్తి నా సంగతి ఏమిటి ?అని స్వామి ని అడుగుతాడు..స్వామి చిరునవ్వు నవ్వి నీ సాధన ఇంకా పూర్తి కాలేదు ..ని అభిమానం,మాత్సర్యం, గర్వం నీ వింకా జయించలెదు .బ్రహ్మది దేవతలు తాము కట్టించిన
గుడికి తలలు వంచుకొని వస్తాయన్న ఆలోచన రావడం మే భీమ గుడిసెలొ తన కిరీటం చూరికి తగిలీ పడడం ఆ భక్తుడీ గుమ్మం లో తల వండడానికి కారణం..అని స్వామి చెప్పారు
********
ఆ రోజు నుండి "ఓడు నైవేద్యం" ఆచారం లో కి వచ్చింది ఈ ఓడు నైవేద్యం నెరుగా గర్భాశయంలో అర్చకులు స్వామి వారికి
సమర్ధించడం విశేషం....** ఓంనమోశ్రీ వేంకటేశ్వర స్వామి యే నమః

Thursday, 25 June 2015

వివిధ రకాల కూరగాయల నుండి లభించే పోషకాలు


www.onenandyala.com


చరిత్రలో నేటి (June 25th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  25thప్రాముఖ్యత
1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ మైదానం లో ఆడింది.
1945 : ప్రముఖ తెలుగు సినిమా నటి శారద జననం.
1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
1950 : కొరియా యుద్ధం మొదలైనది.
1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.
1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.

2009 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ మరణం (జ.1958).

Wednesday, 24 June 2015

తిరుమలకు మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు

www.onenandyala.com

తిరుమలకు మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు.  నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి. మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు. నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి. * శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదే వారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి.కాని తిరుమల తిరుపతి దేవస్తానము వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు.ఈ దారిలొ వేళ్ళేవారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు దివ్యదర్శనానికి టోకను మంజూరు చేస్తున్నారు,దారి పొడవునా నీటి కుళాయిలను వుంచారు,అలిపిరి లాగా మెట్టు దారి లాగా పైకప్పును కూడా యేర్పాటుచేసారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. Total Steps :: 3550

చరిత్రలో నేటి (June 24th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  24th) ప్రాముఖ్యత
1902 : ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం(మ.1946).
1915 : ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు జననం(మ.1983).
1963 : భారత తంతి తపాళా శాఖవారు టెలెక్స్ సేవలను ప్రారంభించారు.
1964 : దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతి గా వినుతికెక్కిన విజయశాంతి జననం.

Tuesday, 23 June 2015

చరిత్రలో నేటి (June 23th) ప్రాముఖ్యత

www.onenandyala.com

చరిత్రలో నేటి (June  23th) ప్రాముఖ్యత

1696 : ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక 'డాక్స్ న్యూస్' వెలువడింది.
1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు జననం.
1953 : జన సంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లో చెరసాలలో మరణం (జ. 1901).
1980 : భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి మరణం(జ.1894).
1980 : సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణం (జ.1948 ).
1985 : భారతదేశానికి చెందిన చర్మ సాంకేతిక శాస్త్రవేత్త వై.నాయుడమ్మ కనిష్క విమాన ప్రమాదంలో మరణం (జ. 1922).

భారతీయ అద్భుతాలు - అరుణాచలము

www.onenandyala.com

భారతీయ అద్భుతాలు - అరుణాచలము

అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.

ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక .

* పంచభూతలింగక్షేత్రములు

1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము : అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం : జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం : ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి : పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి : వాయు లింగం

* అరుణాచలేశ్వరాలయము

అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు ఉంటాయి .

ఈ గోపురమే చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు. మీకు గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .

* ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు .. సాయంత్రం 3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు.

ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు . గర్బగుడి ఒకటె తెరచి ఉండదు .

కిలి గోపురానికి ఎదురుగా మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి పక్కన ఉంటుంది . మీరు స్వామి ని దర్శించుకుని వచ్చెకుండా .. పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .

* బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి )

* గిరి ప్రదక్షణం (గిరివలం)

ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

శ్రీ రమణులు దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

* గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి. అవి

అగ్ని లింగం రమణాశ్రమానికి వేళ్ళే దారిలో కనిపిస్తుంది..

గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి 2కి.మి దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .

దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..

* శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గళశగుడి అగస్త్యతీర్థం,

* ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం,

* నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం,

* రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల,

* రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం,

* ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం,

* ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం,

* గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమం,

* దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.

* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ..
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .


Monday, 22 June 2015

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..

www.onenandyala.com

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?..

ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే... చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కాని పటాలు కానీ ఏ దేవాలయం చెట్టు క్రిందో ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు.
కానీ ఇలా చేయడంకన్నా ఉత్తమమైన మార్గం ఏంటంటే అటువంటి పటాలను అగ్నికి
ఆహుతి ఇవ్వడం మంచిది. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా
ఎక్కడైనా ? అన్న సందేహం ఎంత మాత్రం అవసరం లేదు.
అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా
నీరు కలుషితం కాదు.
అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో
వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్పూర్తిగా నమస్కరించి
గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.
ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ సమాచారం
ఇవ్వండి. ధర్మ ఆచరణ చేయండి.ధర్మాన్ని కాపాడండి.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా?

 www.onenandyala.com

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా?

స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము.

తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.

అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.

ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు

ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన సంజీవని పర్వతం...

www.onenandyala.com

ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన సంజీవని పర్వతం...

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది.. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు...హిమాలయాలకు లంఘించిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే తోస్తుంది... ఏమి చేయాలో అర్థం కాదు.. ఒక ప్రక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు... ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు...ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళతాడు... తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం..శ్రీరాముల వారు ఆశ్చర్య పోతారు... హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి... అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు... ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉండొ..... అవును..ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది... ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట... చుట్టు ప్రక్కలి గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట... ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు... ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది... మన రామాయణము నిజమేనని చెప్పేదానికి ఇంత కంటే ఇంకేమి ఋజువులు కావాలి...

చరిత్రలో నేటి (June 22th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  22thప్రాముఖ్యత
1932 :ప్రముఖ భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం(మ.2005).
1940 : సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
1952 : విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైనది.

1975 :ప్రముఖ దేశ సేవకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అన్నే అంజయ్య మరణం(జ.1905).

Saturday, 20 June 2015

చరిత్రలో నేటి (June 20th) ప్రాముఖ్యత

www.onenandyala.com
చరిత్రలో నేటి (June  20thప్రాముఖ్యత
ప్రపంచ శరణార్థుల దినోత్సవం.
1876 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు జననం(మ.1956).
1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూక్యీ జననం.
1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ని అంతరిక్షంలోకి పంపింది.
1987: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం (జ.1896).

2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.