తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday 18 June 2015

'రంజాన్' ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting

www.onenandyala.com

'రంజాన్' ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting


ఉపవాసపు నిబంధనలు:-
  1. ముస్లిం అయి వుండాలి.
  2. యుక్త వయసుకు చేరి వుండాలి.
  3. బుద్ధి గలవాడై ఉండాలి (పిచ్చి వాడుగాని మతి స్థిమితము లేని వాడై వుండారాదు.)
  4. బాటసారి కోసం ఉపవాసం తప్పని సరికాదు.
  5. ఇది స్త్రీలకు  పరిమితము – బహిష్టు వచ్చిన సమయమున ఉపవాసము ఉండరాదు.
ఉపవాసము సరియగునకు నిబంధనలు:-
  1. ఇస్లాం స్వీకరించుట
  2. ముందు నుంచే (వాజిబ్) ఉపవాసములు సంకల్పము చేయుట
  3. బుద్ది కలిగి ఉండుట.
  4. ఉపవాసము భంగపరిచే వాటి గురించి తెలిసి ఉండుట.
  5. బహిష్టు రాకుండా ఉండుట మరియు ప్రసవించిన తర్వాత శుభ్రతపొందుట.
ఉపవాసపు విధాన మరియు సున్నతులు :- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆలైహి వసల్లం ఇలా ఉద్బోదించారు “ ప్రజలు ఇఫ్ తార్ తొందరగా చేయుట వలన శుభాలు పొందుతారు. (బుఖారి & ముస్లిం)
ఇఫ్ తార్ ముందు దుఆ చేయుట:-ఉపవాసము ఉన్నవారు ఇఫ్ తార్ కి ముందు చేసే దుఆ రద్దు చేయబడదు.
రమదాన్ ప్రత్యేకంగా శ్రద్ధగా చేయవలసిన శుభకార్యాలు:-
  1. సహరీ చివరి ఘడియలలో చేయవలెను.
  2. అధికంగా నఫిల్ సలాహ్ చేయవలెను
  3. ఖుర్ ఆన్ పఠనము  చాలా ఎక్కువగా చేయవలెను
  4. ఉమ్రా చేయవలెను
  5. తరావీహ్ సలాహ్ చేయవలెను
  6. ఎతెకాఫ్ లో కూర్చో వలెను.
  7. పుణ్యకార్యములు చాలా ఎక్కువగా చేయవలెను
ఉపవాసములో చేయకూడని పనులు:-
  1. గర్ గరా చేయుట గొంతు వరకూ నీళ్ళు వెళ్ళ నివ్వుట లేదా ముక్కులు నీరు లోపలకు పీల్చుట.
  2. అబద్ధము  చెప్పుట, చాడీలు చెప్పుట, అశ్లీల మాటలు మాట్లాడుట.
  3. అశ్లీల పనులను ప్రోత్సహించుట ఉదా: టివి చూడుట, పాటలు వినుట మొదలైనవి.
పైన తెలిపిన వాటి నుండి మిమ్మల్ని మీరు తప్పక కాపాడుకోవలెను.
ఎలాంటి పరిస్థితులలో ఉపవాసము లేకుండా ఉండవచ్చును :-
  1. ప్రయాణము కారణముగా
  2. అనారోగ్యము కారణముగా
  3. ఎవరినైనా ప్రాణాపాయము నుండి కాపాడుట కొరకు, గర్భిణి స్త్ర్రీ లేదా పాలు ఇచ్చే తల్లి. (వీరు తమ ఉపవాసములను తర్వాత పూర్తి చేసూకోవలెను.)
ఉపవాసమును భంగపరిచేవి :-
  1. తినుట, త్రాగుట, ఇటువంటి ఏ పనైనా
  2. భార్యతో కలియుట
  3. బలవంతంగా వాంతి చేయుట
  4. అశ్లీల మాటలు, లేదా చేష్టలు లేదా టివి చూచుట వలన మనీ వెలువడుట
  5. స్త్రీకి మాసపు నెత్తురు లేదా గర్భిణీ స్త్రీకి నెత్తురు రావడంవలన
  6. ఎక్కువగా నెత్తురు పొవుట లేదా తీయుట
  7. ఉపవాసాన్ని  ఉపసంహరించుకున్నట్లు సంకల్పము చేసుకొనుట (అతను తినకపొయిన త్రాగకపొయినా కూడా)
పైన తెలుపబడిన ఉపవాసమును భంగపరిచే కార్యములు ప్రతి ముస్లింనకు తెలిసి వుండవలెను.
ఉపవాసములకు బదులు :-
రమదాన్ మాసములో ఒకవేళ ఏవైనా దినములలో ఉపవాసము పాటించని యెడల, ఎన్ని రోజులు ఉపవాసం పాటించలేదో అన్ని రోజుల పాటు ఆ తర్వాత అయినా తప్పక ఉపవాసం ఉండవలెను. ఎవరైనా రమదాన్ మాసములో ఉపవాస సమయంలో భార్యతో కలిసిన యెడల అతను
  1. ఒక బానిసను విముక్తి చేయాలి.
  2. లేనిచో ఎకధాటిగా రెండు మాసములు ఉపవాసములు ఉండవలెను.
  3. లేనిచో అరవై బీద ముస్లింలకు భోజనము పెట్టవలెను
Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.