తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 8 April 2011

ఒక చిట్టి పాప తను కాన్సర్ తో చనిపోయే చివరిక్షణాల్లో రాసుకున్న కవిత...


ఒక చిట్టి పాప తను కాన్సర్ తో చనిపోయే చివరిక్షణాల్లో రాసుకున్న కవిత ఇది. ఆ పాప చనిపోయిన చాలా కాలం తరువాత ఇది బయటపడిందట. దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి  మీతో పంచుకుంటున్నాను. ఆ చిట్టితల్లి ఆత్మ కి శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను.


ప్రియమైన అమ్మ కి,


అమ్మా...


        నన్ను నేల మీద పడుకోబెట్టినపుడు
        నా శరీరానికి స్నానం చేయించాల్సి వచ్చినపుడు...


        నీ కన్నీటిని అందుకోసం వాడకు.


        నన్ను తీసుకెళ్ళేటపుడు మాత్రం
        ఓ రెండు కన్నీటి చుక్కలు అర్పించు.


  బూడిదలోంచి నా అస్థికల్ని ఏరేటప్పుడు
        నీ హృదయం ముక్కలు కాకుండా చూసుకో.


        నీ వేళ్ళ సందుల్లోంచి జారే బూడిద
        నేలపైని దుమ్ములో కలిసినా....


    నా జ్ఞాపకం.......


          నీ హృదయంలో శాశ్వతమని తెలుసు.


    ఆ ఒక్క ఊహే...


          నా అంతిమయాత్రకి కళ్యాణిరాగంగా మిగుల్తోంది...

5 comments:

  1. వినోద్ గారు, పద్మార్పిత గారు... మీ స్పందనకు నా వందనాలు.
    చెప్పాలంటే గారు.. మీకు బాధ గా ఎందుకనిపించిందో చెప్పలేదు.

    ReplyDelete
  2. :'( .............heart touching

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.